Gautam Gambhir : కొత్త హెడ్ కోచ్, కొత్త కెప్టెన్‌తో భారత యువ జట్టు శ్రీలంక గడ్డపై అడుగుపెట్టి క్లీన్ స్వీప్ చేయడం మనం చూశాం. ఆడిన ప్రతి మ్యాచ్‌లో కూడా టీమిండియా దుమ్మురేపింది. మూడు మ్యాచ్ ల సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఈ సిరీస్ గెలుపులో కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ తన స్ట్రాటజీ చూపించగా, కొత్త కెప్టెన్ తమ జట్టు ఆటగాళ్లని అద్భుతంగా ఆడి విజయం దక్కేలా చేశాడు. అయితే చివరి మ్యాచ్ రోజు అవార్డ్ సెర్మనీలో ఆటగాళ్లందరు కూడా ట్రోఫీ చేతిలో పట్టుకొని ఫొటోలకి పోజులు ఇచ్చారు. ట్రోఫీని అందుకుని ఫొటో దిగాల్సిందిగా గంభీర్ ను రింకూ సింగ్, రియాన్ పరాగ్ రిక్వెస్ట్ చేశారు. కానీ అతడు మాత్రం ట్రోఫీని టచ్ చేయలేదు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ట్రోఫీని గంభీర్
హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తొలి సిరీస్ కే తమ జట్టుకి విజయం అందించేలా చేశాడు గౌతమ్ గంభీర్. తన మార్క్ వ్యూహాలతో శ్రీలంకను 3-0తో చిత్తు చేశాడు. రియాన్ పరాగ్ ను కొత్త ఆల్ రౌండర్ గా, రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్ ను పార్ట్ టైమ్ స్పిన్నర్లుగా పరిస్థితులకు తగ్గట్లుగా వాడుకున్న తీరు అద్భుతం. ఎవ్వరూ ఊహించని విధంగా రింకూ, సూర్యలతో చివరి టీ20లో బౌలింగ్ చేయించి.. ఫలితం రాబట్టాడు గంభీర్. అయితే తన వ్యూహాలతో సిరీస్ గెలిపించిన గంభీర్.. సెలబ్రేషన్స్ లో మాత్రం వెనకాలే ఉండిపోయాడు. గంభీర్ తో సహా అందరూ స్టేజ్ దగ్గరికి వచ్చిన గంభీర్ మాత్రం చివర్లో నిల్చున్నాడు. రింకూ మాత్రం చాలా సేపు గంభీర్ ను బతిమిలాడాడు. కానీ ట్రోఫీని పట్టుకోవడానికి అతడు నో చెప్పాడు. అలాగే చివర్లో నిల్చుండిపోయాడు గంభీర్. దీనికి ప్రత్యేక కారణం ఏది లేదు. ఇది ఆటగాళ్ల సమిష్టి విజయం కావడంతో వారి చేతుల్లోనే కప్ ఉంటే బాగుంటుందని గంభీర్ ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
ఇక శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను టీమ్ఇండియా క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పుడు అందరి దృష్టి ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ పై పడింది. టీ20 సిరీస్ ఇచ్చిన ఉత్సాహంతో టీమ్ఇండియా వన్డే సిరీస్‌కు సిద్ధం అవుతోంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లతో పాటు శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్ల రాకతో భారత జట్టు బలం పెరిగింది. ఇక హెడ్ కోచ్‌గా తొలి సిరీస్‌తోనే విజయాన్ని అందుకున్న గౌతమ్ గంభీర్ వన్డే సిరీస్ పై ఫోకస్ పెట్టాడు. వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి జట్టును సన్నద్దం చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలను మొదలు పెట్టాడు. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌ను సైతం వైట్‌వాష్ చేయాలని టీమ్ఇండియా అభిమానులు కోరుకుంటున్నారు.
Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఇల్లు మరియు కార్యాలయం సౌరశక్తిని కలిగి ఉండాలని, విద్యుత్ ఉత్పత్తి మరియు వినియోగంలో స్వావలంబన…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో రాహుకేతులను నీడ గ్రహాలుగా చెబుతుంటారు.ఇక వీటిని ముఖ్య గ్రహాలుగా పరిగణించకపోయినప్పటికీ ఇవి ముఖ్య…
AP TRANSCO Jobs : విజయవాడలోని ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ పరిధిలో ఏపీ ట్రాన్ కో, ఏపీపీసీసీలో…
Karthika Masam : హిందూమతంలో పౌర్ణమి అమావాస్య వంటి వాటిని చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. ఇక ప్రతి నెల అమావాస్య…
Groom Arrested : ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లోని షాపూర్ ప్రాంతంలో షాకింగ్ ఘటన జరిగింది. కాసేపట్లో వివాహం జరుగాల్సి ఉండగా పోలీసులు…
Vaibhav Suryavanshi : క్రికెట్లో ఐపీఎల్‌కి IPL 2024 ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఐపీఎల్ పుణ్యమా అని…
Meenakshi : సుశాంత్ హీరోగా నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మీనాక్షి చౌదరి. ఆ…
Akkineni Akhil Engagement : సమంత నుండి విడిపోయిన నాగ చైతన్య త్వరలో శోభితని వివాహం చేసుకోబోతున్నాడు. డిసెంబర్ 4న…
This website uses cookies.