YCP : కుప్పంలో వైసీపీ దుకాణం మూత‌ప‌డ్డ‌ట్టేనా? ఏకంగా పార్టీ ఆఫీస్‌ని హోట‌ల్‌గా మార్చేశారా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YCP : కుప్పంలో వైసీపీ దుకాణం మూత‌ప‌డ్డ‌ట్టేనా? ఏకంగా పార్టీ ఆఫీస్‌ని హోట‌ల్‌గా మార్చేశారా..!

YCP : కూట‌మి విజ‌యం త‌ర్వాత వైసీపీ ప‌రిస్థితి దారుణంగా ఉంది. చాలా మంది వైసీపీ నాయ‌కులు కూట‌మి ప్ర‌భుత్వంలో చేరేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. మొన్నటి వరకు కళకళలాడిన కుప్పం బైపాస్‌ రోడ్డులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం.. హోటల్‌ అమరావతిగా మారిపోయోంది. ఎన్నికల తర్వాత కార్యాలయం ఖాళీ కావడంతో.. ఆ భవన యజమాని హోటల్‌గా మార్చేస్తున్నారు. త్వరలో హోటల్‌ అమరావతి ప్రారంభిస్తున్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అటు వైపుగా వెళుతున్న వారు ఈ మార్పు చూసి షాకవుతున్నారు. ఏంది […]

 Authored By ramu | The Telugu News | Updated on :1 August 2024,3:00 pm

YCP : కూట‌మి విజ‌యం త‌ర్వాత వైసీపీ ప‌రిస్థితి దారుణంగా ఉంది. చాలా మంది వైసీపీ నాయ‌కులు కూట‌మి ప్ర‌భుత్వంలో చేరేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. మొన్నటి వరకు కళకళలాడిన కుప్పం బైపాస్‌ రోడ్డులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం.. హోటల్‌ అమరావతిగా మారిపోయోంది. ఎన్నికల తర్వాత కార్యాలయం ఖాళీ కావడంతో.. ఆ భవన యజమాని హోటల్‌గా మార్చేస్తున్నారు. త్వరలో హోటల్‌ అమరావతి ప్రారంభిస్తున్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అటు వైపుగా వెళుతున్న వారు ఈ మార్పు చూసి షాకవుతున్నారు. ఏంది వైసీపీ ప‌రిస్థితి ఇలా మారింద‌ని అంద‌రు చ‌ర్చించుకుంటున్నారు.

YCP : దారుణంగా మారిన వైసీపీ ప‌రిస్థితి..

వైసీపీ పార్టీకి చెందిన నియోజకవర్గంలోని 14 మంది ఎంపీటీసీలు, ఐదుగురు కౌన్సిలర్లు టీడీపీలోకి జంప్‌ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వారు పార్టీలో చేరి పసుపు కండువా కప్పుకొన్నారు. కుప్పం మున్సిపాలిటీకి చెందిన వైసీపీ కౌన్సిలర్లు, నియోజకవర్గంలోని కుప్పం, గుడుపల్లె, శాంతిపురం మండలాలకు చెందిన ఎంపీటీసీలు మంగళవారం సాయంత్రం ఆయా మండలాల టీడీపీ నాయకులతో కలిసి విజయవాడకు చేరుకుని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను కలిశారు. బుధవారం ఉదయం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఇక్కడ వైసీపీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లకు చంద్రబాబు స్వయంగా పసుపు కండువాలు కప్పి, వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారితో సమావేశమయ్యారు.

సుమారు 8 మంది మున్సిపల్ కౌన్సిలర్లు, 20 మంది సర్పంచులు, 60 మంది ఎంపీటీసీలు అమరావతికి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో లాంచనంగా తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఇప్పుడు వైసీపీ పరిస్థితి దారుణంగా మారింది. అతి త్వరలో కుప్పం నుంచి పలువురు వైసీపీ నాయకులూ చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే 175 స్థానాల్లోనూ టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి 164 స్థానాల్లో గెలుపొందింది. ఇక వైసీపీ ఫస్ట్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు చెప్పిన కుప్పంలో వైసీపీ అభ్యర్థి భరత్ పై చంద్రబాబు 48,006 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో… కుప్పంలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని మూసివేసినట్లు కథనాలొస్తున్నాయి. అందుకు గల పలు కారణాలూ తెరపైకి వస్తున్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది