
PF : పీఎఫ్ దారులు ఈ విషయం గ్రహించండి.. ఈపీఎఫ్ఓ చేసిన ఐదు కీలక మార్పులు ఏంటంటే..!
PF : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన ఖాతాదారుల కోసం ఎన్నో సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. టెక్నాలజీ పెరిగేకొద్ది సులభమైన సేవలు తీసుకువస్తోంది. గతంలో ఏదైనా చిన్న పని ఉన్నాఈపీఎఫ్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఇంట్లోనే ఉండి పనులు చేసుకోవచ్చు. జాయింట్ డిక్లరేషన్ ప్రాసెస్ విషయంలో ఈపీఎఫ్ వో కొత్త సర్క్యూలర్ జారీ చేసింది. చందాదారుల సౌలభ్యం కోసం ఈ మార్పు చేసింది. దీని ద్వారా ఎస్ వోపీ వెర్షన్ 3.0 ప్రతిపాదనల్లో కొన్నింటిని మార్చడం సులభతరమవుతుంది.
PF : పీఎఫ్ దారులు ఈ విషయం గ్రహించండి.. ఈపీఎఫ్ఓ చేసిన ఐదు కీలక మార్పులు ఏంటంటే..!
సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ స్కీమ్ (సీపీపీఎస్)ను 2025 జనవరి ఒకటి నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పెన్షన్ ఇవ్వనుంది. దీని ద్వారా దేశంలోని ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ తీసుకునే అవకాశం కల్పించింది. తద్వారా ఇకపై పెన్షన్ పేమెంట్ ఆర్డర్ల అవసరం ఉండదు. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) కింద అధిక సంపాదన పొందుతున్న వ్యక్తుల పెన్షన్ కేసుల ప్రాసెసింగ్ విధానాలను వివరిస్తూ ఈపీఎఫ్ వో కొత్త సర్క్యూలర్ విడుదల చేసింది. అధిక వేతనాలపై పెన్షన్ (పీవోహెచ్ డబ్ల్యూ) కేసులకు సంబంధించిన కొన్ని సమస్యలపై క్షేత్ర కార్యాలయాలు ప్రశ్నలు లేవనెత్తాయి. వీటి పరిష్కారానికి కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపించారు.
ఈపీఎఫ్ అకౌంట్ అప్ డేటేషన్ సులభతరమైంది. తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ ను ఇప్పటికే ఆధార్ ద్వారా వెరిఫై చేయించుకున్న వారు ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు లేకుండానే పుట్టిన తేదీ, జెండర్, జాతీయత, తల్లిదండ్రుల పేరు, వివాహ స్థితి, జీవిత భాగస్వామి పేరు, జాయినింగ్ తేదీ, ఉద్యోగం వీడిన తేదీ మార్చుకోవచ్చు. అయితే 2017 అక్టోబర్ ఒకటికి ముందు యూఏఎన్ ఉన్న వారికి నిబంధనలు వేరుగా ఉంటాయి. పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ ఫర్.. ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ ట్రాన్స్ ఫర్ చేసుకునే ప్రక్రియను తాజాగా సులభతరం చేశారు. కంపెనీల యాజమాన్యాల ఆమోదం లేకుండానే ఆన్ లైన్ లో తమ ఖాతాను బదిలీ చేసుకోవచ్చు.
Beer Kidney Stones : కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడటం ప్రస్తుతం సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. కిడ్నీ…
Low-Calorie Snacks : ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలంటే కేవలం ప్రధాన భోజనాలపై మాత్రమే కాదు, మధ్యలో తీసుకునే స్నాక్స్‌పైనా ప్రత్యేక…
Jr NTR : టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
This website uses cookies.