
bihar pearl farmer earn lakhs employment migrant laborers covid 19 business success india
Business Idea : బీహార్‌లోని పాట్నా మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల రైతులు సాధారణంగా మొక్కజొన్న, పప్పులు, కందులు, తృణధాన్యాలు మరియు వరిని పండిస్తారు, ఆ ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల వ్యక్తి వారందరికీ విభిన్నంగా ఏదైనా చేయాలని అనుకున్నాడు. చంపారన్ జిల్లా మురేరా గ్రామానికి చెందిన నితిల్ భరద్వాజ్ ముత్యాల సాగుతో లక్షలు సంపాదిస్తున్నాడు. నితిల్ సంప్రదాయ రైతుల కుటుంబానికి చెందినవాడు. కానీ ఢిల్లీకి వెళ్లి ఒక బహుళజాతి కంపెనీలో కంప్యూటర్ ప్రొఫెషనల్‌గా పని చేశాడు. నెలకు దాదాపు రూ. 30,000 సంపాదించేవాడు.అదే సమయంలో, అతని తండ్రి ముత్యాల పెంపకం గురించి తెలుసుకుని అది ఎంత లాభదాయకమో కొడుకు నితిల్ భరద్వాజ్ కు వివరించాడు. ఇతర రైతులకు విభిన్నంగా సాగు చేస్తూ లక్షలు సంపాదించవచ్చని గ్రహించాడు. తండ్రి ఆలోచన నచ్చిన నితిల్ ముత్యాల పెంపకం గురించి శోధించడం మొదలు పెట్టాడు.
మధ్యప్రదేశ్‌లో బోమోరియా పెరల్ ఫామ్‌లో శిక్షణ తీసుకుని అక్కడే కొన్ని నెలలు పని చేసిమంచి అవగాహన పెంచుకున్నాడు. అవసరమైన నైపుణ్యాలను సంపాదించిన తర్వాత, అతను తన గ్రామంలో ముత్యాల పెంపకం ప్రారంభించడానికి తిరిగి వచ్చాడు. మొదటి ప్రయత్నంలోనే రిస్క్ ఫలించింది. అలాగే నితిన్ రూ.75,000 సంపాదించాడు. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగం కోల్పోయిన ఆరుగురు వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు అతను ‘భరద్వాజ్ పెరల్ ఫామ్ అండ్ ట్రైనింగ్ సెంటర్’ని ప్రారంభించాడు.అతను 2019 లో, అతను చెరువులో 400 గుల్లలు నాటాడు. ఆదర్శంగా, ఒక ఎకరం చెరువులో 25,000 నుండి 30,000 గుల్లలు ఉంటాయి. కానీ తను చిన్నగా ప్రారంభించినట్లు తెలిపాడు నితిల్ భరద్వాజ్. రూ. 25,000 పెట్టుబడి పెట్టి, 8-10 నెలల పాటు గుల్లలు పండించాడు. దాని వల్ల అతనికి రూ.75,000 సంపాదించాడు.
bihar pearl farmer earn lakhs employment migrant laborers covid 19 business success india
ప్రతి ఓస్టెర్ పై దాదాపు రూ. 40 పెట్టుబడి పెట్టాలి. ఒక గుల్ల రెండు ముత్యాలను ఉత్పత్తి చేస్తాయి. వాటిలో ప్రతి ఒక్కటి సగటు ధర రూ. 120కి అమ్ముడు పోతుంది. గుల్లలు నెలల తరబడి సాగవుతాయి – ఇది వాటి నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నాణ్యమైన ముత్యం రూ.200 పలుకుతుంది.2020లో అతను దాదాపు 25,000 ముత్యాలు నాటాడు. దాని నుండి అతను రూ. 30 లక్షలు సంపాదించాలని ఆశించాడు. అతను ఇప్పటివరకు రూ. 3.6 లక్షలు సంపాదించాడు. అదనంగా, నితిల్ ఆక్వాకల్చర్ ద్వారా చేపల సాగు కోసం చెరువును ఉపయోగిస్తున్నారు. గుల్లలకు హాని చేయని చేపలను పెంచుతున్నాడు. ఒక్క సీజన్‌లోనే చేపల వ్యాపారం ద్వారా రూ. 2.5 లక్షలు సంపాదిస్తున్నాడు.
నితిల్ విజయం ఇతర రైతులనూ ఆకర్షించింది. వారూ ముత్యాల పెంపకం చేపట్టాలని అనుకుని నితిల్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. ముత్యాల పెంపకం లాభదాయకంగా ఉన్నప్పటికీ, పెరుగుతున్న ప్రక్రియలో శ్రద్ధ అవసరమని నితిల్ చెబుతున్నాడు. గుల్లల ఆరోగ్యాన్ని ప్రతి 15 రోజులకోసారి పర్యవేక్షించాలని ఆరోగ్యకరమైన ఆహారం మరియు పోషకాహారాన్ని అందించాలని చెబుతున్నాడు నితిల్.ప్రస్తుతం నిటిల్ ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలోని వ్యాపారులకు ముత్యాలను విక్రయిస్తున్నాడు. వారు ఉత్పత్తిని చైనా మరియు జపాన్‌కు కూడా ఎగుమతి చేస్తారు. ముత్యాల సేద్యం వైపు మొగ్గు చూపడం పట్ల రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.