janaki kalaganaledu 29 march 2022 full episode
Janaki Kalaganaledu 29 March Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 29 మార్చి 2022, మంగళవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ దేవుడు నాకు దేవత లాంటి అమ్మను ఇచ్చాడు కానీ.. నేను మాత్రం మంచి కొడుకును కాలేకపోయాను జానకి గారు అంటాడు రామా. నా కారణంగా మీకు ఇలాంటి పరిస్థితి.. అటు అమ్మకు అలాంటి పరిస్థితి. ఇటు భర్త గాను.. అటు కొడుకు గాను నేను ఓడిపోయాను జానకి గారు అంటాడు రామా. మరోవైపు స్వీట్ షాపు దగ్గరకు వస్తుంది జ్ఞానాంబ. తనే ఓపెన్ చేస్తుంది. ఇంతలో రామా అక్కడికి వస్తాడు. నువ్వు ఇలా ఇబ్బంది పడుతుంటే చూస్తూ నేను ఎలాఉండగలను అంటాడు.
janaki kalaganaledu 29 march 2022 full episode
ఈ షాపు నాకేమీ కొత్త కాదు.. అంటుంది జ్ఞానాంబ. ఈ షాపు గురించి ఇన్నేళ్లలో ఏనాడూ భయం కాదు కదా.. కనీసం ఆలోచన కూడా రాలేదు అంటుంది. ఏ క్షణం అయితే ఇది నానమ్మ ఇచ్చిన ఆస్తి అని అన్నావో.. అప్పుడే నాలో భయం మొదలైంది అంటుంది జ్ఞానాంబ. నేను ఎందుకు అలా అంటాను అంటాడు రామా. దీంతో నువ్వు అనవు. నీ భార్య అంటుంది. ఎదురు తిరగమని.. వాటా పంచి ఇవ్వమని అంటుంది.. అని చెబుతుంది జ్ఞానాంబ.
తన తెలివితేటలతో కుటుంబాన్ని ముక్కలు చేసింది. రేపు ఈ కొట్టును చేయకుండా ఉంటుందా అంటుంది జ్ఞానాంబ. నా దృష్టిలో ఈ స్వీటు కొట్టు.. ఆస్తి కాదు. మన కుటుంబానికి అన్నం పెట్టిన కొట్టు. ఈ స్వీట్ కొట్టు నాది.. నా సొంతం. ఈ స్వీటు షాపు దగ్గర పరాయి వాళ్లు ఉండటానికి వీలు లేదు. ఇక్కడి నుంచి వెళ్లిపో అంటుంది జ్ఞానాంబ.
కట్ చేస్తే ఏదో ఒక పని కోసం వెతుక్కుంటూ ఉంటాడు రామా. మీ దయ వల్ల ఖార్ఖానా పెట్టుకున్నానని ఓ వ్యక్తి అంటాడు. అతడి ఖార్ఖానాకు వెళ్తాడు రామా. నాకు ఇక్కడ ఏదైనా పని కావాలండి అంటాడు రామా. రోజు వారి కానీ.. నెల వారి కానీ నేను పని చేస్తాను. మీకు ఎంత జీతం ఇవ్వాలనిపిస్తే అంత జీతం ఇవ్వండ అంటాడు రామా.
నేను ఇక్కడ అందరిలాగే పని చేస్తాను.. అంటాడు. కానీ.. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. నన్ను క్షమించండి బాబు అంటాడు. వెంటనే వెంకటేశులు జ్ఞానాంబకు ఫోన్ చేసి రామచంద్ర మా ఖార్ఖానాకు వచ్చి పని కావాలన్నాడు. అలా పని అడగడం నాకు చాలా బాధగా అనిపించింది అంటాడు.
మీ అబ్బాయి గారికి పని ఇచ్చేంత స్థాయి నాకు లేదమ్మా అంటాడు వెంకటేశులు. దీంతో జ్ఞానాంబకు ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పటి వరకు ఎవరి కారణంగా చేయి చాచని నా కొడుకు.. ఆ జానకి కారణంగా బయట చేయి చాచాల్సి వస్తోంది అని అనుకుంటుంది జ్ఞానాంబ.
రామా గారు.. ఈ రోజే కదా ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈరోజు కాకపోతే రేపైనా పని దొరుకుతుంది అంటుంది. ఇంతలో దొరబాబు ఫోన్ చేస్తాడు. వెంకటేశులు నీ నెంబర్ ఇచ్చాడు. ఖార్ఖానాలో పని కావాలన్నావట. రామాలయం దగ్గర మా షాపు ఉంది. అక్కడికి రండి అని చెబుతాడు.
దీంతో సరే అంటాడు. జానకి గారు ఈ పని దొరకడానికి అమ్మే కారణం తెలుసా అంటాడు రామా. జ్ఞానాంబ అక్కడే ఉండి అన్ని వింటుంది. వెళ్లేటప్పుడు అమ్మ ఫోటో చూసి వెళ్లానండి. అమ్మ ముఖం చూస్తే అంతే.. తప్పకుండా మంచే జరుగుతుంది అని అంటాడు.
అవును ఈరోజు కోచింగ్ సెంటర్ కు ముందే వెళ్లాలన్నారు కదా.. పదండి వెళ్దాం అంటాడు రామా. కట్ చేస్తే జ్ఞానాంబ ఇంటికి కోరియర్ వస్తుంది. అందులో ఏమున్నాయో ఒకసారి చూడు అని విష్ణుకు చెబుతాడు గోవిందరాజు. దాన్ని ఓపెన్ చేస్తాడు విష్ణు.
మనందరికీ గిఫ్టులు పంపించారు అంటాడు విష్ణు. అందరికీ గిఫ్టులు పంపించారు అంటాడు. అవన్నీ జానకి అన్నయ్య పంపిస్తాడు. దీన్ని అవకాశంగా మార్చుకోవాలని అనుకుంటుంది మల్లిక. ఈ ఇంట్లో తిరిగి అడుగు పెట్టడం కోసం జానకి ఆడిన నాటకం ఇది అంటుంది.
దీంతో.. ఆ గిఫ్టులన్నింటినీ రామా, జానకి ఇంటి మీదికి విసిరేస్తుంది జ్ఞానాంబ. ఏంటమ్మా ఇది అని అడుగుతాడు రామా. దీంతో ఆ మాట నీ భార్యను అడుగు అంటుంది. కట్ చేస్తే.. జానకి అన్నయ్య యోగికి మల్లిక ఫోన్ చేస్తుంది. అన్ని విషయాలు చెబుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
KCR : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్నారు. ఈ…
Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే... హీరో ధనుష్ , నటి…
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
This website uses cookies.