Business Idea : 58 ఏళ్ల హెతల్ దేశాయ్ తన కుమార్తెలు లేఖినీ, త్వరా దేశాయ్ లతో కలిసి ఫ్యాషన్ బ్రాండ్ ది ఇండియన్ ఎత్నిక్ ను ప్రారంభించారు. అంతే కాదు కోట్లలో డబ్బులను సంపాదిస్తూ… మహిళలందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే వారికి ఇదంతా ఎలా సాధ్యం అయింది, వారికి ఈ ఆలోచన వంటివి ఎలా వచ్చాయనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.ముంబైకి చెందిన హెతల్ దేశాయ్ కి చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం. ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేయకపోయినప్పటికీ… తన కూతుర్ల కోసం ఆమె బట్టలు డిజైన్ చేసే వాళ్లు.
అమ్మ డిజైన్ చేసిచ్చే బట్టలంటే లేఖినీ దేశాయ్, త్వరా దేశాయ్ లకు ఎంతో ఇష్టం. దాదాపు 30 ఏళ్లుగా వాళ్ల అమ్మే వారికి బట్టలను డిజైన్ చేస్తూ వస్తోంది. అయితే కూతళ్ల బట్టలను చూసిన వారి స్నేహితులంతా.. చాలా బాగున్నాయి మాకూ కావాలని అడిగేవారు. అయితే ఆ మాటలే వారి బిజినెస్ ప్రారంభించేందుకు బాటలు అయ్యాయి. అయితే తన కూతుర్ల సాయంతో… ఇంటి నుంచే హేతల్ దేశాయ్ తన బిజినెస్ ను ప్రారంభించింది.2016లో ప్రారంభమైన ది ఇండియన్ ఎత్నిక్ కో లో డిజైన్ చేసిన బట్టలను ఆమె కూతుళ్లే ప్రపంచానికి చూపిస్తున్నారు. అమ్మ తయారు చేసిన బట్టలు వేస్కొని మాడలింగ్ చేస్తూ… బట్టలు అమ్ముడుపోయేందుకు సాయపడుతున్నారు.
అయితే ఆ అమ్మాయిలి వేస్కునే బట్టలే కాకుండా వారు చేసే రీల్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. సోషల్ మీడియా ద్వారా లక్షల ఫాలోవర్స్ ను సంపాదించడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు కుమార్తెలు.. తల్లి హెతల్ దేశాయ్ కలిసి నెలకు 15 కోట్ల రూపాయలు సంపాదిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే 58 ఏళ్ల వయసులో ఒక బట్టలను డిజైన్ చేస్తూ… కోట్లు సంపాదిస్తానని ఎప్పుడూ అనుకోలేదని హెతల్ చెబుతుంటారు. అయితే ఇదంతా చాలా సంతోషంగా ఉందని, తన కుమార్తెల వల్లే ఇదంతా సాధ్యం అయిందని వివరించారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.