Business Idea : తల్లికి ఫ్యాషన్ మీద ఉన్న ఆసక్తిని గమనించి.. తనకు సపోర్ట్ చేసి 15 కోట్ల వాల్యూ ఉన్న బ్రాండ్ ను నెలకొల్పేలా చేసిన అక్కాచెల్లెళ్లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Business Idea : తల్లికి ఫ్యాషన్ మీద ఉన్న ఆసక్తిని గమనించి.. తనకు సపోర్ట్ చేసి 15 కోట్ల వాల్యూ ఉన్న బ్రాండ్ ను నెలకొల్పేలా చేసిన అక్కాచెల్లెళ్లు

 Authored By jyothi | The Telugu News | Updated on :25 March 2022,12:00 pm

Business Idea : 58 ఏళ్ల హెతల్ దేశాయ్ తన కుమార్తెలు లేఖినీ, త్వరా దేశాయ్ లతో కలిసి ఫ్యాషన్ బ్రాండ్ ది ఇండియన్ ఎత్నిక్ ను ప్రారంభించారు. అంతే కాదు కోట్లలో డబ్బులను సంపాదిస్తూ… మహిళలందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే వారికి ఇదంతా ఎలా సాధ్యం అయింది, వారికి ఈ ఆలోచన వంటివి ఎలా వచ్చాయనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.ముంబైకి చెందిన హెతల్ దేశాయ్ కి చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం. ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేయకపోయినప్పటికీ… తన కూతుర్ల కోసం ఆమె బట్టలు డిజైన్ చేసే వాళ్లు.

అమ్మ డిజైన్ చేసిచ్చే బట్టలంటే లేఖినీ దేశాయ్, త్వరా దేశాయ్ లకు ఎంతో ఇష్టం. దాదాపు 30 ఏళ్లుగా వాళ్ల అమ్మే వారికి బట్టలను డిజైన్ చేస్తూ వస్తోంది. అయితే కూతళ్ల బట్టలను చూసిన వారి స్నేహితులంతా.. చాలా బాగున్నాయి మాకూ కావాలని అడిగేవారు. అయితే ఆ మాటలే వారి బిజినెస్ ప్రారంభించేందుకు బాటలు అయ్యాయి. అయితే తన కూతుర్ల సాయంతో… ఇంటి నుంచే హేతల్ దేశాయ్ తన బిజినెస్ ను ప్రారంభించింది.2016లో ప్రారంభమైన ది ఇండియన్ ఎత్నిక్ కో లో డిజైన్ చేసిన బట్టలను ఆమె కూతుళ్లే ప్రపంచానికి చూపిస్తున్నారు. అమ్మ తయారు చేసిన బట్టలు వేస్కొని మాడలింగ్ చేస్తూ… బట్టలు అమ్ముడుపోయేందుకు సాయపడుతున్నారు.

Business Idea desai sisters helped her mother to start fashion brand

Business Idea desai sisters helped her mother to start fashion brand

అయితే ఆ అమ్మాయిలి వేస్కునే బట్టలే కాకుండా వారు చేసే రీల్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. సోషల్ మీడియా ద్వారా లక్షల ఫాలోవర్స్ ను సంపాదించడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు కుమార్తెలు.. తల్లి హెతల్ దేశాయ్ కలిసి నెలకు 15 కోట్ల రూపాయలు సంపాదిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.  అయితే 58 ఏళ్ల వయసులో ఒక బట్టలను డిజైన్ చేస్తూ… కోట్లు సంపాదిస్తానని ఎప్పుడూ అనుకోలేదని హెతల్ చెబుతుంటారు. అయితే ఇదంతా చాలా సంతోషంగా ఉందని, తన కుమార్తెల వల్లే ఇదంతా సాధ్యం అయిందని వివరించారు.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది