
Business Idea hyderabad deccan pen store story
Business Idea : కలంపై మక్కువ ఉన్న ఎవరికైనా తెలిసిన పేరు “డెక్కన్ పెన్ స్టోర్స్”. అందులోను ప్రత్యేకంగా ఇంకు పెన్ను మీద మోజు ఉన్న ప్రతివారు తప్పకుండా వెళ్లిన చోటే.. దక్కన్ పెన్’.. దశాబ్దాలుగా ఆదరణ పొందుతూనే ఉంది. నిజాం హయాంలో ప్రారంభమైన ఈ పెన్నుల దుకాణం ఇప్పటికీ విద్యావంతులు, అధ్యాపకులు, విద్యార్థులను ఆకట్టుకుంటూనే ఉంది. నిజాం కాలంలోనే నగరంలో పెన్నుల దుకాణం మొదలైంది. బాల్‌పాయింట్ పెన్ లేని సమయంలో హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో ‘దక్కన్ పెన్ స్టోర్’ మొదలైంది. ఉస్మానియా విశ్వవిద్యాయలం ఏర్పాటైన మూడేళ్లకే అలహాబాద్ (ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్ నగర్)లో నివసించే సబీ అక్తర్ సిద్ధీఖీ ఇంగ్లండ్‌లో తయారయ్యే కన్‌వెస్టివర్డ్ పెన్, ఫ్రాన్స్‌లో తయారు అయ్యే డ్యూరో పెన్ కంపెనీల ఏజెన్సీలను తీసుకొని 1922లో నగరానికి వచ్చారు. ఇక్కడ విశ్వవిద్యాలయంతో పాటు విద్యార్థులను కలిసి పెన్నుల విశిష్టతను తెలిపి విక్రయించే వారు.
ఇలా ఆరేళ్ల పాటు పెన్నులు విక్రయించి 1928లో అబిడ్స్‌లో ‘ది దక్కన్ పెన్ స్టోర్’ను ప్రారంభించారు. 90 ఏళ్లుగా దేశ విదేశాల్లో తయారయ్యే పెన్నులు ఇప్పటికీ విక్రయిస్తూనే ఉన్నారు.అత్యాధునిక కలాలు..దేశంలోనే అత్యాధునిక రకాల కలాలను దక్కన్ పెన్ స్టోర్‌లో చూడవచ్చు. ప్రాచీన కాలం నాటి పెన్నుల నుంచి అరుదైన రకాలూ ఇక్కడ ఉన్నాయి. బాల్‌పెన్, రోలర్, ఫౌంటెన్, జెల్, డిస్పోజబుల్ పెన్ అంటూ చాలా రకాలు ఇక్కడ దొరుకుతాయి. వాటర్ మ్యాన్ పెన్, పార్కర్, షెఫర్, క్రాస్, పెలికన్ తదితర రకాలను చూసి ఆశ్చర్యపోవాల్సిందే.వైవిధ్యమైనవెన్నో…వాడి పారేసే మూడు రూపాయల పెన్నుల నుంచి రూ.లక్ష.. ఆ పైచిలుకు ధర ఉన్న పెన్నులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్న కొన్ని పెన్నులు రూ.లక్షపైనే ధరల్లో ఉన్నాయి. కాన్వే స్టెవార్ట్ పెన్ దక్కన్ పెన్‌స్టోర్‌లో అత్యధికంగా రూ.1,39,750 ధర పలుకుతోంది.
Business Idea hyderabad deccan pen store story
పూర్తిగా వెండితో తయారు చేయడమే ఇందుకు కారణం. పెన్ను ముందు భాగంలో బంగారంతో తయారు చేసిన టిప్ ప్రత్యేక ఆకర్షణ. తెలుగు సినిమా నటీనటులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు.. దుకాణాన్ని సందర్శించి పెన్నులను కొనుగోలు చేస్తారు. నిజాం వారసుడు మఫకంజా..’ఏడో నిజాం కాలంలో మా నాన్న ఎస్.ఎ.సిద్ధిఖీ ఫ్రెంచ్ పెన్నును నగరానికి పరిచయం చేశారు. డ్యూరో పెన్ ఏజెన్సీని హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఆ సమయంలో ఇంటింటికీ వెళ్లి పెన్నుల గురించి ప్రచారం చేస్తూ అమ్మకాలు సాగించేవారు. అరుదైన రకాల పెన్నులేవైనా పాడైతే.. మా దగ్గరకు తెస్తే అబిడ్స్ శాఖలో రిపేరింగ్ చేస్తాం. ఇటీవల ఫ్రాన్స్‌కు చెందిన ఓ మహిళ వాటర్‌మ్యాన్ పెన్నును తీసుకొచ్చి రిపేరింగ్ చేయాల్సిందిగా కోరారు. క్వీన్ ఎలిజబెత్ నుంచి ఆ పెన్ను బహుమతిగా పొందినట్లు చెప్పారు. మా దగ్గరున్న యంత్రం సహాయంతో విడిభాగాలు తయారు చేసి, ఆ తర్వాత రిపేర్ చేసి ఇచ్చాం.’– హలీం అక్తర్ సిద్ధిఖీ, దక్కన్ పెన్‌స్టోర్ యజమాని
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.