Intinti Gruhalakshmi 17 Feb Today Episode : కష్టాల్లో అభి.. తులసి ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్.. తులసిపైనే నేరం మోపిన లాస్య, నందు.. ఇంతలో తులసికి భారీ షాక్

Advertisement
Advertisement

Intinti Gruhalakshmi 17 Feb Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 17 ఫిబ్రవరి 2022, గురువారం ఎపిసోడ్ 558 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. డబ్బుల కోసం గొడవపడి ఫ్రెండ్ ను పొడిచి పారిపోయాడు అని ఎస్ఐ నందుతో చెబుతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. లేదు ఎస్ఐ గారు మా అభి ప్రాణాలు పోసే డాక్టర్.. ప్రాణాలు తీసే డాక్టర్ కాదు అంటుంది తులసి. అవునో.. కాదో వాడినే అడిగితే చెబుతాడు. కానిస్టేబుల్స్.. ఇల్లంతా వెతకండి.. ఎక్కడున్నాడో చూడండి అని ఇల్లంతా వెతికిస్తాడు ఎస్ఐ. లోపల అభి కనిపించడు. చట్టానికి కావాల్సింది సాక్ష్యాలు.. మీ వాడు మర్డర్ చేసి పారిపోతుంటే చూసిన ప్రత్యక్ష సాక్షి ఉన్నారు అంటాడు ఎస్ఐ. మీ ఇంటి చుట్టూ పోలీసులు ఉంటారు. మీ వాడు ఫోన్ చేస్తే వెంటనే వచ్చి లొంగిపోవాలని చెప్పండి. మీ వాడు పొడిచిన వాడు ప్రస్తుతం ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నాడు. వాడు పొరపాటున చావాలి కానీ.. మీవాడికి యావజ్జీవ కారాగార శిక్ష తప్పదు అని చెప్పి ఎస్ఐ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Advertisement

intinti gruhalakshmi 17 february 2022 full episode

ఇంతలో అంకిత స్పృహ తప్పి పడిపోతుంది. దీంతో ఇంట్లో వాళ్లకు ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు అభి.. తన ఫ్రెండ్ రాజు ఇంటికి వెళ్తాడు. అక్కడ ఈ రాత్రికి షెల్టర్ కావాలంటాడు. దీంతో సరే అంటాడు. అంకితతో గొడవ పడి వచ్చాను అంటాడు. దీంతో రాత్రికి అక్కడ ఉండేందుకు ఓకే అంటాడు రాజు. రాజు ఫోన్ తీసుకొని అంకితకు ఫోన్ చేస్తాడు అభి. కానీ.. అంకిత ఫోన్ రూమ్ లో ఉండటంతో తను ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇంతలో అడ్వకేట్ కు కాల్ చేసి అసలు విషయం చెబుతుండగా రాజు భార్య వింటుంది. వెంటనే రాజు భార్య.. రాజును ప్రశ్నిస్తుంది. మర్డర్ చేసి వచ్చిన వాడికి షెల్టర్ ఇస్తావా.. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి చెప్పండి అంటుంది రాజు భార్య.

Advertisement

మరోవైపు అంకిత.. వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. నాకు అభి కావాలి ఇప్పుడు అంటుంది. ప్రాణాలు తీసేంత దుర్మార్గుడు కాదు అభి అంటుంది అంకిత. ఇంతలో నందు కలగజేసుకుంటాడు. తులసి వల్లే అభికి ఈ గతి పట్టింది అంటాడు. మీరు కూడా లాస్యలా తయారయ్యారు అంటుంది.

నువ్వు ప్రెజర్ పెట్టడం వల్లనే వాడు ఇలా తయారయ్యాడు అంటాడు నందు. అవకాశం దొరికింది కదా అని బురద జల్లడానికి ప్రయత్నించకండి అంటుంది తులసి. చూశావా అంకిత.. నీ ఆంటి ఇలాంటి మాటలే మాట్లాడుతుంది అని లాస్య.. అంకిత వైపు మాట్లాడుతుంది.

Intinti Gruhalakshmi 17 Feb Today Episode : అభి విషయంలో నందు, తులసి, లాస్య మధ్య గొడవ

తులసి వల్లనే ఇప్పుడు అంకితకు ఈ గతి పట్టింది అంటుంది లాస్య. రేపు జరగకూడనిది జరిగి.. హాస్పిటల్ లో ఉన్నవాడు పోతే ఇంకేముంది.. అంకిత, అభి విడిపోయి బతకాల్సిందే కదా. దానికి కారణం ఎవ్వరు తులసినే కదా అంటుంది లాస్య.

ఇంట్లో అందరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలిసి కూడా ఇలా మాట్లాడటానికి బుద్ధి లేదా అంటుంది తులసి. రేపు ఏదైనా జరగరానిది జరిగితే తులసే కారణం అని చెబుతాను.. కోర్టులో కూడా అదే చెబుతాను అంటాడు రామా. దీంతో అనసూయ, పరందామయ్య.. తులసికి సపోర్ట్ చేస్తారు.

నీకు బాధ్యత మోయడం చేతగాక తులసి మీద అరుస్తున్నావా? నువ్వు నా కొడుకుగా ఏం చేశావురా.. అని ప్రశ్నిస్తాడు పరందామయ్య. మళ్లీ మళ్లీ అంటాను. అభి విషయంలో తులసిదే తప్పు. తనే మనల్ని కాకుండా చేస్తోంది. తీరిగ్గా కూర్చొని ఆలోచించండి అప్పుడు అర్థం అవుతుంది అంటాడు అభి.

మరోవైపు అభికి ఏం చేయాలో అర్థం కాదు. తులసి చెప్పిన విషయాలనే గుర్తు చేసుకుంటూ ఉంటాడు అభి. ఇంతలో రాజు పోలీసులకు ఫోన్ చేస్తాడు. వెంటనే పోలీసులు వస్తారు. ఎస్ఐ గారు ఈ రూమ్ లో ఉన్నాడు అభి అనడం వింటాడు అభి. వెంటనే అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తాడు. అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు.

అంకిత ఏడుస్తూనే ఉంటుంది. అభిని మనం అందరం అవమానించాం.. అందుకే అభి దూరం అయ్యాడు.. అంటుంది అంకిత. అభి మనకు ఎప్పటికీ దూరం కాడు. నా బిడ్డ ప్రాణానికి నా ప్రాణాన్ని అడ్డం వేసి అయినా సరే కాపాడుకుంటాను అంటుంది తులసి. ఇంతలో మాధవి వస్తుంది. ఏంటి వదిన ఇదంతా అంటుంది. తలరాత అంటుంది తులసి.

నేను ఆరోజు లక్ష రూపాయలు ఇవ్వడం వల్లే అలా జరిగింది అంటుంది మాధవి. అలా ఏం కాదు. మన తలరాత బాగాలేనప్పుడు ఏం చేసినా ఏంటి ఉపయోగం అని అంటుంది తులసి. ఇంతలో అభి రోడ్డు మీద పరిగెడుతుంటాడు. ఎదురుగా పోలీస్ వాహనం వస్తూ ఉంటుంది. దీంతో ఏం చేయాలో అర్థం కాదు.

వెంటనే పక్కనే ఉన్న ఆటో ఎక్కుతాడు అభి. దీంతో ఆటో వ్యక్తి దిగు అంటాడు. ఇంతలో పోలీస్ జీప్ వెళ్లిపోతుంది. మరోవైపు తులసికి కనిపిస్తాడు అభి. తులసి వద్దు అన్నా తనను నెట్టేసి వెళ్లబోతాడు అభి. ఇంతలో పోలీసులు వస్తారు. చాలా అసభ్యంగా తులసితో ప్రవర్తిస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

59 mins ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

2 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

11 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

12 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

13 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

14 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

15 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

16 hours ago

This website uses cookies.