Business Idea : లక్ష పెట్టుబడితో రోజుకు రూ.5 వేలు సంపాందించే బిజినెస్
Chinese Fast Food Center : ప్రస్తుతం ఉద్యోగాల కోసం ఎదురు చూడటం కన్నా స్వంతంగా వ్యాపారం ప్రారంభించడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మార్కెటింగ్ స్ట్రాటజీ, సరైన ప్లానింగ్, క్రమశిక్షణ ఉంటే వ్యాపారంలో విజయం సాధించడం సులభం. కృషి చేస్తే తప్పకుండా ఫలితం వస్తుందని పెద్దలు చెప్పినట్లు, వ్యాపార రంగంలో కూడా ఈ సూత్రం ఖచ్చితంగా సరిపోతుంది. తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే వ్యాపారాల్లో చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఒక మంచి అవకాశంగా మారుతోంది.
ఇప్పటి కాలంలో ఫాస్ట్ ఫుడ్ తినే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా యువతకు చైనీస్ ఫుడ్ అంటే ప్రత్యేక ఇష్టం. ఫ్రైడ్ రైస్, నూడుల్స్, మంచూరియా, సూప్స్ వంటి వంటకాలు ఎక్కువ డిమాండ్‌లో ఉన్నాయి. వెజ్, నాన్ వెజ్ రెండురకాలుగా ఈ వంటకాలను సులభంగా తయారు చేసి వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా అందించవచ్చు. ఈ డిమాండ్ కారణంగా చిన్నపాటి చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఏర్పాటు చేస్తే కూడా మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.

People Are Very Crazy Food
ఈ బిజినెస్‌ను రెండు విధాలుగా చేయవచ్చు. ఒకటి స్ట్రీట్ సైడ్ ఫుడ్ స్టాల్‌గా ప్రారంభించడం, లేకపోతే ఒక చిన్న రెస్టారెంట్ ఓపెన్ చేయడం. స్విగ్గి, జొమాటో వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లతో కలసి పని చేస్తే కస్టమర్ల సంఖ్య మరింత పెరుగుతుంది. తక్కువ పెట్టుబడితో ప్రారంభించాలనుకునే వారికి కేవలం ఒక లక్ష రూపాయలతో చిన్న చైనీస్ ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసుకోవచ్చు. రోజుకు 5000 రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉందని ఈ రంగంలో ఇప్పటికే రాణిస్తున్న వ్యాపారులు చెబుతున్నారు. అందువల్ల కష్టపడే మనసు ఉంటే, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ద్వారా మంచి భవిష్యత్తు నిర్మించుకోవచ్చు.