
Today Gold Rate : బంగారం కొనేవారికి గుడ్న్యూస్... ఈరోజు బంగారం ధర ఎంత తగ్గిందో తెలుసా..?
Gold price falls : డాలర్ స్థిరంగా ఉండటం, అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయనే ఆశల నేపథ్యంలో సురక్షిత స్వర్గధామ పెట్టుబడి బంగారంపై ఆసక్తిని తగ్గించడంతో బంగారం ధరలు 1 శాతానికి పైగా పడిపోయాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 0.9 శాతం తగ్గి $3,289.97 వద్ద ఉంది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం తగ్గి $3,301 వద్ద ఉంది. US కరెన్సీని ఇతర కరెన్సీలతో పోల్చి కొలిచే డాలర్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగి, ఇతర కరెన్సీ హోల్డర్లకు బంగారం ఆకర్షణీయంగా లేదు.
Gold price falls : తగ్గనున్న బంగారం ధరలు.. తులం బంగారం రూ.70 వేలకు పడిపోయే అవకాశం
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.98 వేల సమీపంలో ఉంది. ధరలు గత సంవత్సరంతో పోల్చి చూస్తే ఈ సంవత్సరం దాదాపు 25 శాతం పెరిగినట్లు గమనించవచ్చు. గతేడాది ఏప్రిల్ లో బంగారం ధర రూ.70 నుంచి 75 వేల మధ్యలో ఉంది. అప్పటి నుండి క్రమంగా పెరుగుతూ లక్ష రూపాయలకు చేరుకుంది.
పసిడి ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టగానే చైనా సహా ప్రపంచ దేశాలు అన్నింటి పైనా ఎడాపెడా సుంకాలు వేశారు. దీంతో ఒక్కసారిగా వాణిజ్య యుద్ధానికి తెరతీసినట్లైంది. ఫలితంగా బంగారం ధరలు భారీగా పెరగడం ప్రారంభమయ్యాయి. డాలర్ ధర పతనం అవడంతో పాటు, స్టాక్ మార్కెట్స్ పతనం కూడా బంగారం ధరలకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
బంగారం ధరలు ఇప్పటికే అంచనాలకు మించి పెరిగాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా బంగారం ధరలు దిగివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా కజకిస్థాన్‌కు చెందిన ప్రముఖ బంగారం మైనింగ్ కంపెనీ సాలిడ్‌కోర్ రిసోర్సెస్ PLC సీఈఓ విటాలీ నెసిస్ మాట్లాడుతూ బంగారం ధరలు రాబోయే సంవత్సర కాలంలో భారీగా తగ్గే అవకాశం ఉందన్నారు. వచ్చే 12 నెలల కాల వ్యవధిలో బంగారం ధరలు 40 శాతం మేర తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఒక ట్రాయ్ ఔన్స్ బంగారం ధర 3,300 డాలర్లు ఉండగా అది అతి త్వరలోనే 2,500 డాలర్లకు పతనం అయ్యే అవకాశం ఉందనే వార్తలు వెలువడుతున్నాయి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.