Home » Business » Gold Silver 27 March 2026 Price Friday Today In Hyderabad
Business

Gold Silver 27 March 2026 Price Today : భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఒక్కరోజే రూ.2000 పైగా క్రాష్.. తులం రేటు ఎంతంటే?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: March 27, 2026, 10:13 am
Advertisement

Gold Silver 27 March 2026 Price Today : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి, పసిడి ప్రియులకు ఇది నిజంగా అదిరిపోయే శుభవార్త. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పరుగులు పెట్టి, సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిన బంగారం ధరలు ఎట్టకేలకు శాంతించాయి. దేశీయ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు మళ్లీ భారీగా తగ్గుముఖం పట్టాయి. నిన్నటి వరకు పెరుగుతూ ఆందోళన కలిగించిన పసిడి, నేడు ఒక్కసారిగా పాతాళానికి పడిపోవడంతో కొనుగోలుదారులకు భారీ ఉపశమనం లభించినట్లు అయింది. ఈ క్రమంలో నేడు (మార్చి 27) దేశీయ మార్కెట్లో ముఖ్యంగా హైదరాబాద్ సహా వివిధ ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం రేట్లు, కిలో వెండి ధర ఎంత మేర దిగివచ్చాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Advertisement

Gold Silver 27 March 2026 Price Today : భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఒక్కరోజే రూ.2000 పైగా క్రాష్.. తులం రేటు ఎంతంటే?

Gold Silver 27 March 2026 Price Today బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? కారణాలివే..

పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు చోటుచేసుకుంటున్నాయి. అయితే క్రితం రోజు ఒక్కసారిగా పెరిగి ఆందోళన కలిగించినప్పటికీ, ఇవాళ మళ్లీ భారీగానే దిగిరావడం గమనార్హం. అంతర్జాతీయంగా పరిస్థితులు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. క్రూడ్ ఆయిల్ (ముడి చమురు) ధరలు మళ్లీ భారీగా పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ పుంజుకోవడం వంటి ప్రధాన కారణాలతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం నుంచి తమ పెట్టుబడులను లాగేసుకుంటున్నారు. దీనికి తోడు.. ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపాయి. ఇరాన్ యుద్ధం ముగింపు దశకు వచ్చిందని, తాత్కాలికంగా 5 రోజుల పాటు దాడులకు విరామం ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ వార్తలతో తొలుత క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా దిగివచ్చి పసిడి రేట్లు పెరిగాయి. కానీ, ఇరాన్ అందుకు విరుద్ధంగా వ్యవహరించి, ప్రకటనలు చేయడమే కాకుండా దాడులను మరింత ముమ్మరం చేసింది. దీంతో గ్లోబల్ మార్కెట్లో మళ్లీ క్రూడ్ ధరలు మంటలు రేపాయి. ఫలితంగా పసిడి రేట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.

Advertisement

Gold Silver 27 March 2026 Price Today గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ దఢేల్

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పతనమయ్యాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఏకంగా ఔన్సుకు 161 డాలర్ల మేర కుప్పకూలింది. దీంతో ఔన్స్ పసిడి ధర 4391 డాలర్ల వద్దకు దిగివచ్చింది. ఇక స్పాట్ సిల్వర్ (వెండి) రేటు కూడా 5 డాలర్ల మేర దిగివచ్చి, ప్రస్తుతం 68 డాలర్ల స్థాయికి పడిపోయింది. గ్లోబల్ మార్కెట్లో వచ్చిన ఈ భారీ మార్పుల ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపించింది.

హైదరాబాద్‌లో నేటి బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఈరోజు భారీగా పడిపోయాయి. వినియోగదారులకు ఇది మంచి కొనుగోలు సమయంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Advertisement

24 క్యారెట్ల బంగారం (స్వచ్ఛమైన బంగారం): 10 గ్రాముల (తులం) మేలిమి గోల్డ్ రేటుపై ఏకంగా రూ.2120 మేర భారీ పతనం నమోదైంది. దీంతో ప్రస్తుతం తులం రేటు రూ.1,44,550 వద్దకు దిగివచ్చింది.

22 క్యారెట్ల బంగారం (ఆభరణాల బంగారం): ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములపై రూ.1950 మేర పడిపోయింది. దీంతో తులం బంగారు నగల ధర రూ.1,32,500 వద్దకు దిగివచ్చి, కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది.

స్థిరంగా కొనసాగుతున్న వెండి ధర

ఒకవైపు బంగారం ధరలు భారీగా దిగివచ్చినప్పటికీ, వెండి రేటు మాత్రం స్థిరంగానే కొనసాగుతోంది. ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.2,60,000 వద్ద ట్రేడవుతోంది. అయితే గతంలొ నమోదైన ఆల్ టైమ్ హై స్థాయితో పోల్చుకుంటే, ప్రస్తుతం వెండి రూ.1.40 లక్షల మేర దిగువన ట్రేడవుతుండటం విశేషం.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో నేటి పసిడి రేట్లు ఇవే

వివిధ రాష్ట్రాల పన్నులు, స్థానిక డిమాండ్ కారణంగా నగరాల వారీగా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి 24 క్యారెట్లు, 22 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే:

Advertisement

హైదరాబాద్: 24 క్యారెట్ల ధర రూ.1,44,540 | 22 క్యారెట్ల ధర రూ.1,32,490

విజయవాడ: 24 క్యారెట్ల ధర రూ.1,44,540 | 22 క్యారెట్ల ధర రూ.1,32,490

న్యూఢిల్లీ: 24 క్యారెట్ల ధర రూ.1,44,690 | 22 క్యారెట్ల ధర రూ.1,32,640

ముంబై: 24 క్యారెట్ల ధర రూ.1,44,540 | 22 క్యారెట్ల ధర రూ.1,32,490

Advertisement

బెంగళూరు: 24 క్యారెట్ల ధర రూ.1,44,540 | 22 క్యారెట్ల ధర రూ.1,32,490

చెన్నై: 24 క్యారెట్ల ధర రూ.1,45,630 | 22 క్యారెట్ల ధర రూ.1,33,490

కేరళ: 24 క్యారెట్ల ధర రూ.1,44,540 | 22 క్యారెట్ల ధర రూ.1,32,490

వివిధ నగరాల్లో వెండి రేట్లు

వెండి ధరల విషయానికొస్తే.. హైదరాబాద్‌, చెన్నై, కేరళ వంటి దక్షిణ భారత నగరాల్లో కిలో వెండి ధర రూ.2,59,900 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా ఉత్తరాది, ఇతర ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర కాస్త తక్కువగా రూ.2,49,900 వద్ద కొనసాగుతోంది.

ముఖ్య గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్చి 27వ తేదీ శుక్రవారం రోజు ఉదయం 8 గంటల సమయానికి నమోదైనవి. బులియన్ మార్కెట్లో పసిడి, వెండి రేట్లు అంతర్జాతీయ కదలికల ఆధారంగా మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అలాగే ఈ ధరలకు జీఎస్టీ GST, తరుగు, మజూరీ వంటి అదనపు ఛార్జీలు కలుస్తాయి. కాబట్టి, కొనుగోలు చేసే వారు స్థానికంగా ఉండే జ్యువెలరీ షాపుల్లో తాజా ధరలను కచ్చితంగా విచారించి కొనుగోలు చేయడం ఉత్తమం.

ఈ ధరల పతనం రాబోయే పండుగ సీజన్లలో, వివాహాది శుభకార్యాల నిమిత్తం ఆభరణాలు చేయించుకోవాలనుకునే వారికి ఒక అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి