Home » Business » Gold Silver Price 21 March 2026 Saturday In Hyderabad
Business

Gold Silver Price 21 March 2026 : పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. మార్కెట్లో కుప్పకూలిన బంగారం, వెండి ధరలు!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: March 21, 2026, 9:40 am
Advertisement

Gold Silver Price 21 March 2026 : బంగారం కొనాలనుకునే వారికి, పసిడి ప్రియులకు ఇది నిజంగా పండుగ లాంటి వార్త. గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా, చుక్కలనంటుతున్న పసిడి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ప్రతిరోజూ వరుసగా దిగొస్తూ సామాన్యులకు భారీ ఊరటనిస్తున్నాయి. నిన్నటి రోజున భారీగా తగ్గిన బంగారం ధరలు, ఇవాళ (మార్చి 21) కూడా అదే తీరును కొనసాగించాయి. నేడు 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.1000కి పైగా తగ్గగా, వెండి ధర ఏకంగా కిలోకు రూ.5,000 మేర పతనం కావడం మార్కెట్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. గత ఏడాది కాలంలో నమోదైన అతిపెద్ద తగ్గుదల ఇదే కావడం గమనార్హం.

Advertisement

Gold Silver Price 21 March 2026 : పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. మార్కెట్లో కుప్పకూలిన బంగారం, వెండి ధరలు!

Gold Silver Price 21 March 2026 యుద్ధం ఉన్నా.. పెరగని ధరలు (సీన్ రివర్స్)

సాధారణంగా పశ్చిమాసియాలో ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం లాంటి ప్రతికూల పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పుడు.. పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత సాధనంగా భావిస్తారు. దీంతో డిమాండ్ పెరిగి బంగారం ధరలు రాకెట్ లా దూసుకెళ్తాయి. కానీ, ప్రస్తుతం సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. ఫిబ్రవరి చివర్లో యుద్ధ వాతావరణం మొదలైన ఈ 20 రోజుల్లో కేవలం 3-4 రోజులు మాత్రమే స్వల్పంగా పెరిగిన పసిడి, మిగతా అన్నీ రోజులు భారీ పతనాన్నే నమోదు చేసింది.

Advertisement

Gold Silver Price 21 March 2026 అంతర్జాతీయ మార్కెట్లో కుప్పకూలిన రేట్లు

దేశీయ మార్కెట్ తో పాటు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరల్లో భారీ కరెక్షన్ కనిపించింది. అమెరికా డాలర్ బలం పుంజుకోవడం, మదుపర్లు లాభాల స్వీకరణకు Profit Booking మొగ్గుచూపడం వల్ల ఈ పతనం చోటుచేసుకుంది. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకున్న కఠిన నిర్ణయాలు కూడా ప్రభావం చూపాయి.

స్పాట్ గోల్డ్ Spot Gold: ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఒక్కరోజులోనే ఔన్సుకు 200 డాలర్లకు పైగా పడిపోయి 4492 డాలర్ల వద్ద ట్రేడవుతోంది (నిన్న 4700 డాలర్లు).

Advertisement

వెండి Silver: వెండి రేటు కూడా 10 శాతం వరకు పతనమై ఔన్సుకు 67.97 డాలర్ల వద్ద ఉంది.

రూపాయి విలువ: ఇదే సమయంలో డాలరుతో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోయి రూ.93.57 వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల (22K) బంగారం ధర రూ. 1200 మేర తగ్గి, ప్రస్తుతం తులం రూ.1,36,540 కి దిగొచ్చింది. వారం రోజుల వ్యవధిలో ఈ ధర వరుసగా రూ.600, రూ.2050, రూ.950 చొప్పున పడుతూనే వచ్చింది. ఇక స్వచ్ఛమైన 24 క్యారెట్ల (24K) బంగారం ధర రూ.1370 తగ్గి 10 గ్రాములకు రూ.1,48,900 వద్ద ట్రేడవుతోంది. కిలో వెండి ధర ఏకంగా రూ.5 వేలు తగ్గి రూ.2.60 లక్షల (రూ.2,59,900) వద్ద కొనసాగుతోంది. వారం వ్యవధిలో వెండి ఏకంగా రూ.30 వేల వరకు పతనం కావడం విశేషం.

దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి పసిడి ధరలు (10 గ్రాములకు)

హైదరాబాద్: 22 క్యారెట్ల ధర రూ. 1,36,540 కాగా, 24 క్యారెట్ల ధర రూ. 1,48,900.

Advertisement

విజయవాడ: 22 క్యారెట్ల ధర రూ. 1,36,540 కాగా, 24 క్యారెట్ల ధర రూ. 1,48,900.

విశాఖపట్నం: 22 క్యారెట్ల ధర రూ. 1,36,540 కాగా, 24 క్యారెట్ల ధర రూ. 1,48,900.

న్యూఢిల్లీ: 22 క్యారెట్ల ధర రూ. 1,36,690 కాగా, 24 క్యారెట్ల ధర రూ. 1,49,050.

ముంబై: 22 క్యారెట్ల ధర రూ. 1,36,540 కాగా, 24 క్యారెట్ల ధర రూ. 1,48,900.

Advertisement

చెన్నై: 22 క్యారెట్ల ధర రూ. 1,39,510 కాగా, 24 క్యారెట్ల ధర రూ. 1,52,190.

బెంగళూరు: 22 క్యారెట్ల ధర రూ. 1,47,690 కాగా, 24 క్యారెట్ల ధర రూ. 1,48,900.

కోల్‌కతా: 22 క్యారెట్ల ధర రూ. 1,36,540 కాగా, 24 క్యారెట్ల ధర రూ. 1,48,900.

బంగారం కొనడానికి ఇదే సరైన సమయమా?

మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. రికార్డు స్థాయిల నుంచి ధరలు భారీగా దిగిరావడం వల్ల వినియోగదారులు కొనుగోళ్లకు మొగ్గుచూపేందుకు ఇది మంచి తరుణం. అయితే, భవిష్యత్తులో ఈ ధరలు మరింత తగ్గుతాయా, లేదా మళ్లీ పుంజుకుంటాయా అన్నది అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మార్కెట్ ట్రెండ్‌ను గమనిస్తూ ఉండటం ముఖ్యం. అలాగే, ఎప్పుడూ స్వచ్ఛతను నిర్ధారించే హాల్‌మార్క్ (Hallmark) ఉన్న ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటల సమయానికి ఉన్నవి. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల ఈ ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొనుగోలు చేసే ముందు మీ స్థానిక జ్యువెలరీ షాపులో కచ్చితమైన ధరను తెలుసుకోగలరు.)

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి