Home » Business » Good News For 10th Pass Candidates
Business

10th Pass : మీరు ప‌ది పాస్ అయ్యారా.. రూ. 25 వేలు మీ సొంతం..!

Authored By
Ramalingaiah Tandu
The Telugu News | Updated on: May 5, 2025 6:30 pm
Advertisement

10th Pass : టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్ధుల‌కి అదిరిపోయే శుభ‌వార్త‌. విజయనగరం జిల్లా రాజం పట్టణంలో 2024 – 25 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు రూ.25 వేలు ద‌క్కించుకునే అవ‌కాశం. రాజం నియోజకవర్గం, జి. సిగడాం, తెర్లాం, పాలకొండ, బూర్జ, మెరకముడిదాం, బలిజీపేట, మండల పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థినులకు ఈ అవ‌కాశం ద‌క్క‌నుంది. వీరికి మరింత ప్రోత్సాహం అందించే మంచి సదావకాశం.

Advertisement

10th Pass : మీరు ప‌ది పాస్ అయ్యారా.. రూ. 25 వేలు మీ సొంతం

10th Pass వినియోగించుకోండి..

ఇందులో భాగంగా జిఎంఆర్ వరలక్ష్మి కేర్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ యడ్ల నీరజారాణి ఆధ్వర్యంలో సంబంధిత మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివి 540 మార్కులకు పైన పొందిన విద్యార్థినిలకు మే 11వ తేదీ ఆదివారం నాడు రాజాం డోలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్ష పెడుతున్నట్లు వెల్లడించారు. అదే రోజు ఫలితాలు ప్రకటించి మొదటి మూడు స్థానాల్లో వచ్చిన వారికి ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను సన్మానించడం జరుగుతుంది అని తెలియజేశారు.

Advertisement

ప్రథమ బహుమతి రూ.25000, ద్వితీయ బహుమతి రూ. 15000, తృతీయ బహుమతి 10000 రూపాయలు ఇస్తున్నట్లు వెల్లడి చేశారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను తప్పనిసరిగా మార్కుల జాబితా, టెన్త్ హాల్ టికెట్ తీసుకుని రావాలి లేనిచో పరీక్షకు అనుమతించబడదని వెల్ల‌డించారు. రాజం మండలం డోలపేట ఉన్నత పాఠశాలలో మే 11వ తేదీన ఉదయం 7 గంటలకు పరీక్షకు హాజరుకావాలని సూచించారు. మే 11వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 9:20 నిమిషాల వరకు పరీక్ష జరుగుతుందని వెల్లడించారు.

Ramalingaiah Tandu

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి