Home » Business » Income Of Rs 10 Lakh Per Month From A Business Without The Influence Of Ai
Business

Dairy industry : AI ప్రభావం లేని వ్యాపారం.. రూ.10 లక్షల సంపాదన.. 18 ఏళ్ల యువకుడి అద్భుతం విజయం.. ఎలాగో తెలుసా?

Authored By
Suma
The Telugu News | Updated on: February 7, 2026 10:42 am
Advertisement

Dairy industry : ప్రస్తుతం ప్రపంచమంతా కృత్రిమ మేధ AI చుట్టూ తిరుగుతోంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల నుంచి కంటెంట్ క్రియేటర్ల వరకు అందరూ “మన ఉద్యోగాలు ఉంటాయా?” అనే ఆందోళనలో ఉన్నారు. మెషీన్లు వేగంగా మనుషుల స్థానాన్ని ఆక్రమిస్తున్న ఈ కాలంలో AI ఎంత అభివృద్ధి చెందినా పూర్తిగా భర్తీ చేయలేని రంగం ఏదైనా ఉందా అంటే అది పాడి పరిశ్రమే. ఎందుకంటే టెక్నాలజీ ఎంత అద్భుతాలు చేసినా మనిషికి అవసరమైన స్వచ్ఛమైన పాలను మాత్రం ఇప్పటివరకు సృష్టించలేకపోయింది. ఈ సత్యాన్ని బలంగా నమ్మిన ఒక యువకుడు తన 18 ఏళ్ల వయస్సులోనే నెలకు 10 లక్షల రూపాయల టర్నోవర్ సాధించి దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాడు. అతడే పంజాబ్‌కు చెందిన సోహల్‌ప్రీత్ సింగ్ సిద్ధూ.

Advertisement

Dairy industry : AI ప్రభావం లేని వ్యాపారం..రూ.10 లక్షల సంపాదన.. 18 ఏళ్ల యువకుడి అద్భుతం విజయం.. ఎలాగో తెలుసా?

Dairy industry : చిన్న పెట్టుబడితో మొదలైన పెద్ద ప్రయాణం

బర్నాలా జిల్లా సమీపంలోని సెహ్నా గ్రామానికి చెందిన సోహల్‌ప్రీత్ కథ సోషల్ మీడియాలో రీల్స్ చూసి ఫేమస్ అయిన కథ కాదు. ఇది చెమటతో రాసుకున్న నిజమైన విజయగాథ. తోటి పిల్లలు ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు, గ్యాడ్జెట్ల కోసం తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్న సమయంలో 18 ఏళ్ల సోహల్‌ప్రీత్ మాత్రం తన తండ్రిని రూ.1.2 లక్షల పెట్టుబడి అడిగాడు. అదే అతడి జీవితాన్ని మార్చిన మొదటి అడుగు. మొదట కొన్ని పశువులతో ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు 120 పశువులతో కూడిన ఆధునిక డైరీ ఫామ్‌గా ఎదిగింది. ప్రతిరోజూ ఉదయం 4:30 గంటలకే నిద్రలేచి పశువుల ఆరోగ్యాన్ని పరిశీలించడం మేత ఏర్పాట్లు, పాలు పితకడం వరకు ప్రతి పనిని స్వయంగా పర్యవేక్షిస్తాడు. వ్యాపారంలో యజమాని కంటే కార్మికుడిగా ముందుండే మనస్తత్వమే తన బలమని సోహల్‌ప్రీత్ చెబుతాడు.

Advertisement

Dairy industry : రోజుకు 700 లీటర్లు, నెలకు లక్షల లాభం

పంజాబ్ యువతలో చాలామంది చదువులు లేదా ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లాలని కలలు కంటారు. కానీ సోహల్‌ప్రీత్ మాత్రం తన సొంత గడ్డపైనే అవకాశాలు సృష్టించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం అతడి ఫామ్‌లో 55 గేదెలు, 15 ఆవులు, 50 దూడలు ఉన్నాయి. వీటితో రోజుకు సగటున 700 లీటర్ల పాలను సేకరిస్తున్నాడు. ఈ పాలను ప్రైవేట్ డైరీ కంపెనీలకు విక్రయిస్తూ గేదె పాలకు లీటరుకు రూ.65–70, ఆవు పాలకు సుమారు రూ.40 వరకు పొందుతున్నాడు.
పశువులకు అవసరమైన మేతను సొంతంగా సాగు చేయడం వల్ల ఖర్చులు గణనీయంగా తగ్గాయి. దీంతో సుమారు 60 శాతం వరకు లాభం మిగులుతూ నెలకు రూ.5 నుంచి 6 లక్షల వరకు నికర ఆదాయం పొందుతున్నాడు. అయితే ఈ విజయం సులభంగా రాలేదు. నష్టాలు, పశువుల కొనుగోలులో మోసాలు, అనారోగ్య సమస్యలు వంటి ఎన్నో సవాళ్లు ఎదురైనా వెనకడుగు వేయలేదు. లాభాలను లగ్జరీలపై కాకుండా తిరిగి వ్యాపారంలోనే పెట్టుబడిగా పెట్టడం అతడి విజయం వెనుక కీలక కారణం. కేవలం డిగ్రీలే కాదు నేర్చుకోవాలనే తపన, కష్టపడే స్వభావం ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని సోహల్‌ప్రీత్ సింగ్ సిద్ధూ తన జీవితంతో నిరూపిస్తున్నాడు.

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి