Summer Business Idea : సమ్మర్ స్పెషల్ బిజినెస్ ఐడియా: రోజుకు 3 గంటల పని.. నెలకు లక్ష రాబడి.. ఐస్‌క్రీమ్ ట్రక్కుతో అదిరిపోయే లాభాలు!

 Authored By jagadesh | The Telugu News | Updated on :6 April 2026,1:30 pm

Summer Business Idea : వేసవి కాలం వచ్చేసింది.. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇలాంటి ఎండల్లో బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ కాస్త ఉపశమనం కోసం చల్లని ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ లేదా జ్యూస్‌ల వైపు మొగ్గు చూపుతారు. ఈ డిమాండ్‌ను కచ్చితమైన వ్యాపారంగా మార్చుకుంటే అద్భుతమైన లాభాలు గడించవచ్చు. మీరు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే తక్కువ శ్రమతో, ఆకర్షణీయమైన ఆదాయాన్ని అందించే “మొబైల్ ఐస్ క్రీమ్ ట్రక్” Mobile Ice Cream Truck ఒక వినూత్నమైన, లాభదాయకమైన మార్గం.

Summer Business Idea : సమ్మర్ స్పెషల్ బిజినెస్ ఐడియా: రోజుకు 3 గంటల పని.. నెలకు రూ. లక్ష రాబడి.. ఐస్‌క్రీమ్ ట్రక్కుతో అదిరిపోయే లాభాలు!

Summer Business Idea : సమ్మర్ స్పెషల్ బిజినెస్ ఐడియా: రోజుకు 3 గంటల పని.. నెలకు రూ. లక్ష రాబడి.. ఐస్‌క్రీమ్ ట్రక్కుతో అదిరిపోయే లాభాలు!

సాధారణంగా ఐస్ క్రీమ్ పార్లర్ Ice Cream Parlor పెట్టాలంటే రద్దీగా ఉండే ప్రాంతంలో భారీ అద్దె చెల్లించి ఒక షాపు తీసుకోవాలి. కస్టమర్లు మన దగ్గరకు వచ్చే వరకు ఎదురుచూడాలి. కానీ, ‘ఐస్ క్రీమ్ ట్రక్’ కాన్సెప్ట్ అలా కాదు.. కస్టమర్లు ఎక్కడ ఉంటే మనం అక్కడికే నేరుగా వెళ్లవచ్చు. ఈ వ్యాపారంలో ఉన్న అద్భుతమైన అవకాశాలు, పెట్టుబడి, లాభాల వివరాలు ఇప్పుడు చూద్దాం.

Summer Business Idea పెట్టుబడి ఎంత అవసరం?

ఒక మోస్తరు ఐస్ క్రీమ్ ట్రక్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి సుమారు రూ. 10 లక్షల వరకు పెట్టుబడి అవసరమవుతుంది. దీన్ని ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేస్తే అద్భుతమైన సెటప్ సిద్ధం అవుతుంది.

వాహనం ఖర్చు: ముందుగా ఒక సెకండ్ హ్యాండ్ మినీ ట్రక్ Tata Ace, Bolero లాంటివి కొనుగోలు చేయడానికి సుమారు రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ఖర్చవుతుంది.

ఇంటీరియర్ అండ్ ఫ్రీజర్లు: ట్రక్కులో డీప్ ఫ్రీజర్లు ఏర్పాటు చేయడానికి, బ్యాకప్ కోసం ఇన్వర్టర్ లేదా జనరేటర్ సెట్ చేయడానికి మరికొంత మొత్తం కేటాయించాలి.

బ్రాండింగ్ అండ్ లైసెన్సులు: ట్రక్కు బయట ఆకర్షనీయమైన రంగులు, ఎల్ఈడీ లైటింగ్, మ్యూజిక్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. అలాగే ఫుడ్ అండ్ సేఫ్టీ (FSSAI) లైసెన్స్, స్థానిక మున్సిపల్ అనుమతుల కోసం కొంత బడ్జెట్ అవుతుంది. మిగిలిన మొత్తాన్ని ప్రాథమిక స్టాక్ కోసం ఉంచుకోవాలి.

Summer Business Idea ట్రక్ బిజినెస్ ఎందుకు బెస్ట్?

సాధారణంగా రోడ్ల మీద సైకిల్ లేదా తోపుడు బండ్ల మీద అమ్మే ఐస్ క్రీమ్స్ ఒకే బ్రాండ్‌కు పరిమితమవుతాయి. వారి దగ్గర వెరైటీలు తక్కువగా ఉంటాయి. కానీ ఒక ఐస్ క్రీమ్ ట్రక్ ద్వారా మీరు 15 నుంచి 20 రకాల బ్రాండ్లను Amul, Kwality Walls, Cream Bell వంటివి ఒకే చోట కస్టమర్లకు అందించవచ్చు. కోన్‌లు, కప్‌లు, క్యాండీలు, ఫ్యామిలీ ప్యాక్‌లు, థిక్ షేక్స్.. ఇలా విభిన్న ఫ్లేవర్లను అందుబాటులో ఉంచడం ద్వారా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకర్షించవచ్చు.

రోజుకు 3 గంటల పని.. లక్షల్లో లాభాలు

ఈ వ్యాపారంలో లాభాలు మనం ఎంచుకునే బ్రాండ్‌ను బట్టి మారుతుంటాయి.

కార్పొరేట్ బ్రాండ్స్: మార్కెట్లో బాగా పేరున్న కార్పొరేట్ బ్రాండ్స్ అమ్మితే 10 శాతం నుంచి 15 శాతం వరకు మార్జిన్ Profit Margin లభిస్తుంది.

లోకల్ బ్రాండ్స్: అదే కొత్తగా వస్తున్న బ్రాండ్స్ లేదా నాణ్యమైన లోకల్ బ్రాండ్స్ అయితే ఏకంగా 25 శాతం నుంచి 30 శాతం వరకు లాభం పొందవచ్చు.

ఆదాయం ఎలా వస్తుంది?: ఉదాహరణకు, ఐటీ కారిడార్లు, పార్కులు, కాలేజీల వద్ద సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు (కేవలం 3 లేదా 4 గంటలు) వ్యాపారం చేసినా చాలు. రోజుకు సగటున రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు అమ్మకాలు జరిగినా.. అందులో దాదాపు రూ. 3 వేల నుంచి రూ.4 వేల వరకు నికర లాభం Net Profit ఉంటుంది. ఈ లెక్కన నెలకు సులభంగా రూ. లక్ష వరకు ఆదాయం మీ సొంతం అవుతుంది. పెళ్లిళ్లు, బర్త్ డే పార్టీలు, ఈవెంట్లకు క్యాటరింగ్ ఆర్డర్లు తీసుకుంటే ఆదాయం మరింత పెరుగుతుంది.

సీజన్‌తో సంబంధం లేని వ్యాపారం

ఐస్ క్రీమ్ అంటే కేవలం వేసవిలోనే తినేది అన్న పాత భావన ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. నేటి యువత, ప్రజలు ఏడాది పొడవునా వీటిని ఇష్టపడుతున్నారు. సమ్మర్‌లో అమ్మకాలు విపరీతంగా ఉంటే, చలి లేదా వర్షాకాలంలో కొంచెం తగ్గవచ్చు.. కానీ వ్యాపారం మాత్రం పూర్తిగా ఆగదు.

అంతేకాకుండా, సీజన్‌కు అనుగుణంగా మీరు మీ ట్రక్కులో మార్పులు చేసుకోవచ్చు. చలికాలంలో వేడి వేడి వాఫిల్స్ Waffles, బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్, కాఫీ, హాట్ చాక్లెట్ వంటి ఇతర ఆహార పదార్థాలను కూడా మెనూలో చేర్చుకోవచ్చు. కొత్తగా ఏదైనా సొంత వ్యాపారం చేయాలనుకునే యువతకు, తక్కువ రిస్క్ ఉన్న ఈ ‘మొబైల్ ఐస్ క్రీమ్ ట్రక్’ ఐడియా అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి