Today Gold Price : హమ్మయ్య ఈరోజు దిగొచ్చిన బంగారం ధర.. తులం ఎంత ఉందంటే..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Today Gold Price : హమ్మయ్య  ఈరోజు దిగొచ్చిన బంగారం ధర..  తులం ఎంత ఉందంటే..!!

 Authored By ramu | The Telugu News | Updated on :20 June 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  హమ్మయ్య బంగారం ధరలు కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసాయి

  •  తగ్గిన బంగారం, వెండి ధరలు

  •  Today Gold Price : హమ్మయ్య  ఈరోజు దిగొచ్చిన బంగారం ధర..  తులం ఎంత ఉందంటే..!!

Today Gold Price : గత కొద్దీ రోజులుగా బంగారం ధరలు ప్రతిరోజూ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను రూ. 1,03,000కి చేరింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలంటే సాధారణ ప్రజలు తీవ్ర ఆర్థిక భారం ఎదుర్కొంటున్నారు. అయితే ఈరోజు మాత్రం కాస్త తగ్గుదల కనిపించింది. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 600 తగ్గి రూ. 1,00,480గా నమోదైంది. అదే విధంగా 22 క్యారెట్ల ధర రూ. 550 తగ్గి రూ. 92,100గా ఉంది. వెండి ధర కూడా కేజీకి రూ. 2,000 తగ్గి రూ. 1,20,000గా నమోదైంది. ఈ ధరలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సగటున ఇలా ఉన్నట్లు తెలుస్తోంది.

Today Gold Price హమ్మయ్య ఈరోజు దిగొచ్చిన బంగారం ధర తులం ఎంత ఉందంటే

Today Gold Price : హమ్మయ్య  ఈరోజు దిగొచ్చిన బంగారం ధర..  తులం ఎంత ఉందంటే..!!

Today Gold Price : హమ్మయ్య బంగారం ధరలు కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసాయి

బంగారం ధరల ఈ తీవ్ర పెరుగుదల మధ్య పసిడి ఆభరణాలు కొనడం తక్కువ ఆదాయ గలవారికి దాదాపు అసాధ్యంగా మారింది. గతేడాది ఇదే జూన్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,000 మాత్రమే ఉండగా, ఇప్పుడు దాదాపు రూ. 28,000 పెరిగింది. ఇది శాతం ప్రకారం చూస్తే 35-40 శాతానికి పైగా పెరుగుదలగా చెప్పవచ్చు. ముఖ్యంగా వివాహ కాలంలో బంగారానికి ఉండే డిమాండ్ నేపథ్యంలో గోల్డ్ జ్యువెలరీ కొనుగోళ్లపై చాలా మంది వెనుకంజ వేస్తున్నారు. మార్కెట్‌లో ధరల పెరుగుదల కారణంగా గోల్డ్ లోన్స్, గోల్డ్ బాండ్‌లపై ప్రజల ఆసక్తి మాత్రం పెరుగుతున్నదిగా వ్యాపారవేత్తలు చెబుతున్నారు.

గత ఐదు సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే బంగారం ధరలు మూడు రెట్లు పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. 2020లో 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ. 40,000 వద్ద ఉండగా, ప్రస్తుతం అది లక్ష రూపాయల మార్క్ దాటింది. ఇది ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ఇన్ఫ్లేషన్, డాలర్ వ్యాల్యూ, జియోపాలిటికల్ సమస్యలు వంటి అనేక కారణాల వల్ల చోటుచేసుకున్నదిగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. భవిష్యత్‌లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, దీనికి ముందు నుంచి సన్నద్ధం కావాలంటున్నారు. దీంతోపాటు, బంగారం కొనుగోళ్లలో సురక్షిత మార్గాలపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి