Home » Business » Today Gold Price 18 06 2025
Business

Today Gold Price : బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి.. ఈ రోజు మళ్లీ పెరిగిన ధర ఎంతంటే..?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: June 18, 2025 12:03 pm
Advertisement

Today Gold Price : నాల్గు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఈరోజు (జూన్ 18) మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ పెరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ మారడంతో పసిడికి మళ్లీ రెక్కలు వచ్చాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 540 పెరిగి రూ. 1,00,910కు చేరింది. ఇది మళ్లీ లక్ష రూపాయల మార్క్‌ను దాటి పోవడం గమనార్హం.

Advertisement

Today Gold Price : బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి.. ఈ రోజు మళ్లీ పెరిగిన ధర ఎంతంటే..?

Today Gold Price : మళ్లీ ఉసురు అనిపించిన బంగారం ధరలు

ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 500 పెరిగి ప్రస్తుతం 10 గ్రాములకు రూ. 92,500 వద్ద ఉంది. బంగారంపై పెరుగుతున్న ఈ ధరలు సాధారణ వినియోగదారులకు భారం అవుతున్నాయి. అయితే పండుగల సీజన్, వివాహాల సమయంలో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఇలాంటి ధరల హెచ్చుతగ్గులు సహజంగా మారాయి. మద్దతు ధరలు పెరగడం, దిగుమతి చార్జీలు కూడా ఈ మార్పుకు కారణమవుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు.

Advertisement

వెండి ధరలు కూడా ఈరోజు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర రూ. 1,000 పెరిగి రూ. 1,21,000కు చేరింది. ఈ ధరలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు సమానంగా ఉన్నాయి. మార్కెట్‌పై ఓవరాల్‌గా పెట్టుబడిదారుల విశ్వాసం పెరగడం, భవిష్యత్‌లో బంగారంపై లాభాల అంచనాలు పెరగడం వలన రేట్లు మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. కాబట్టి కొనుగోలు చేసే ముందు వినియోగదారులు ధరలపై అప్రమత్తంగా ఉండాలి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి