
Today Gold price : వామ్మో ఇంత తగ్గిందేంటి.. ఏకంగా రూ. 6 వేలు తగ్గిన గోల్డ్ ధర..!
Today Gold price : పది రోజుల క్రితం వరకు ఆకాశాన్ని తాకిన Gold rate బంగారం ధరలు ఇప్పుడు ఒక్కసారిగా తగ్గుతూ వస్తున్నాయి. తులం బంగారం ధర లక్ష రూపాయల మార్క్‌ను అధిగమించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే. అయితే గత వారం రోజులుగా ధరలు వరుసగా తగ్గుతూ రావడం గమనార్హం. ముఖ్యంగా శుక్రవారం నాడు కూడా బంగారం ధరలో గణనీయమైన తగ్గుదల నమోదైంది. గడిచిన వారం రోజుల వ్యవధిలో రూ.6,000కిపైగా తగ్గడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
Today Gold price : వామ్మో ఇంత తగ్గిందేంటి.. ఏకంగా రూ. 6 వేలు తగ్గిన గోల్డ్ ధర..!
బంగారం ధరలు భారీగా పెరుగుతాయని, తులానికి లక్షన్నర రూపాయలు దాటుతుందని కొన్ని అంచనాలు వెలువడగా, ఇప్పుడు ఆ అంచనాలను తలకిందులు చేస్తూ ధరలు తగ్గుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 87,740కు పడిపోగా, 24 క్యారెట్ల ధర రూ. 95,720 వద్ద కొనసాగుతోంది. గడచిన కొన్ని వారాల్లోని చరిత్రలో ఇది ఒక పెద్ద తగ్గుదలగా భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో ద్రవ్యోల్బణం తగ్గడం, డాలర్ బలపడటం వంటి కారణాలు ఈ ధర తగ్గుదలకు దోహదపడినట్టు నిపుణులు పేర్కొంటున్నారు.
దేశంలోని ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. పెళ్లిళ్లు, పండుగల సీజన్ దృష్ట్యా బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారి కోసం ఇది మంచి అవకాశం. త్వరలో మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు కూడా ఉన్నాయి కాబట్టి, ధర తగ్గిన ఈ సమయంలో కొనుగోలు చేయడం బాగుంటుందని నిపుణుల అభిప్రాయం.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.