Home » Business » Today Gold Rate June 2nd 2025
Business

Today Gold Rate : ఈ రోజు బంగారం ధర పెరిగిందా.. ? తగ్గిందా..? మీరే చూడండి

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: June 2, 2025 11:23 am
Advertisement

Today Gold Rate  : ఈ రోజు జూన్ 2 (సోమవారం) నాడు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుToday Gold Rate : ఈ రోజు బంగారం ధర పెరిగిందా.. ? తగ్గిందా..? మీరే చూడండితున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,343గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,233గా నమోదైంది. మరోవైపు, వెండి ధర కూడా స్వల్ప మార్పులతో రూ.97,280కి చేరుకుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో కొంత స్థిరత కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశంపై మార్కెట్లలో ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Today Gold Rate : ఈ రోజు బంగారం ధర పెరిగిందా.. ? తగ్గిందా..? మీరే చూడండి

Today Gold Rate  :  జూన్ 2 న బంగారం ధర ఎలా ఉందంటే..!

ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే, సంస్థలకు డబ్బుల ప్రవాహం పెరుగుతుంది. దీనివల్ల స్టాక్ మార్కెట్లు లాభాలను నమోదు చేయగలవు. ఇదే సమయంలో బంగారం వంటి భద్రత కలిగిన పెట్టుబడి ప్రత్యామ్నాయాలపై డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. గత నెలల్లో బంగారం ధర 1 లక్ష రూపాయల మార్కును చేరుకున్నప్పటికీ, కొన్ని రోజుల్లోనే 95 వేల రూపాయల దాకా పడిపోయింది. అయినప్పటికీ, ప్రస్తుతం ధరలు మళ్లీ పెరుగుతూ రికార్డు స్థాయికి చేరుతున్నాయి.

Advertisement

అంతర్జాతీయంగా ఒక ఔన్స్ బంగారం ధర గతంలో 3,500 డాలర్లను దాటినప్పటికీ, ప్రస్తుతం అది 3,330 డాలర్ల దిగువకు పడిపోయింది. దీని ప్రభావం దేశీయ మార్కెట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బంగారం ధరలు ఆల్ టైం రికార్డు స్థాయికి 3,000 రూపాయలు తక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయదలచుకున్న వినియోగదారులు ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నదని ఎదురుచూస్తున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి