
Union Minister Piyush Goyal : ఈఎఫ్‌టీఏతో భారత్ కీలక ఒప్పందం .. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
Union Minister Piyush Goyal : ఢిల్లి: ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం (ఈఎఫ్‌టీఏ) రాబోయే 15 ఏళ్లలో భారతదేశంలో 100 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టనుంది. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య,పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం భారత్-ఈఎఫ్‌టీఏలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి. ఇందులో సరకు వాణిజ్యం, మేధఓ సంపత్తి హక్కులు, సేవలు, పెట్టుబడి ప్రోత్సాహం, సహకారం, ప్రభుత్వ సేకరణ, సాంకేతిక అడ్డంకులను తొలగించుకోవడం వంటి 14 అంశాలున్నాయి. దాంతోపాటు పెట్టుబడుల్ని ప్రోత్సహించడానికి ఇరు పక్షాలు నిబంధనల్ని సడలించాల్సి ఉంటుంది. న్యాయమైన, సమానత్వంతో కూడిన వాణిజ్యానికి ఈ ఒప్పందం నిదర్శనమని ప్రధాని మోడీ అన్నారు. ఈఎఫ్‌టీఏలో ఐర్లాండ్, లైక్టన్‌స్టైన్, నార్వే, ఫిన్లాండ్ సభ్యదేశాలుగా ఉన్నాయి. ఇవి ఐరోపా సమాఖ్యలో భాగం కాదు. స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటైన సమాఖ్య. కెనడా, చిలీ, చైనా, మెక్సికో, కొరియా వంటి 40 భాగస్వామ్య దేశాలతో ఈఎఫ్‌టీఏ ఇప్పటి వరకు 29 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. ఈఎఫ్‌టీఏ దేశాలకు భారత్ ఎగుమతులు 2021-2022లో 174 బిలియన్ డాలర్లుగా ఉండేవి. 2022-23 నాటికి అవి 1.92 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక ఆదేశాల నుంచి దిగుమతులు 25.5 బిలియన్ డాలర్ల నుంచి 16.74 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
ఈ ఒప్పందం ద్వారా ఈఎఫ్‌టీఏ దేశాలు ఒక ప్రధాన వృద్ధి మార్కెట్‌కు యాక్సెస్‌ను పొందుతాయి. మన కంపెనీలు తమ సరఫరా గొలుసులను మరింత స్థితిస్థాపకంగా అందించడానికి ప్రయత్నిస్తాయి. ప్రతిఫలంగా, ఈఎఫ్‌టీఏ నుంచి భారత్ మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. తద్వారా ఉద్యోగాల పెరుగుదలకు దారి తీస్తుంది. మొత్తం మీద, ఈ ఒప్పందం ఆర్థిక సామర్థ్యాన్ని మెరుగ్గా ఉపయోగించుకోవడానికి అనుమతిస్తుంది అని ఈఎఫ్‌టీఏ సభ్య దేశాల తరపున ఫెడరల్ కౌన్సిలర్ గై పార్మెలిన్ అన్నారు.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ప్రకారం, ఇద్దరు వ్యాపార భాగస్వాములు తమ మధ్య వర్తకంలో గరిష్ట సంఖ్యలో వస్తువులపై కస్టమ్స్ సుంకాలను గణనీయంగా తగ్గించడం లేదా తొలగించడంతోపాటు, సేవలు, పెట్టుబడులలో వాణిజ్యాన్ని ప్రోత్స#హంచడానికి నిబంధనలను సడలిస్తాయి. ఈ ప్రక్రియను అధికారికంగా వాణిజ్యం-ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (టీఈపీఏ) అని పిలుస్తారు. నవంబర్ 2013లో చర్చలు ఆగిపోయే ముందు వరకు 2008 జనవరి నుంచి మొత్తం పదమూడు రౌండ్లు చర్చలు జరిగాయి. అక్టోబరు 2023లో ఇరుపక్షాలు చర్చలను పున:ప్రారంభించి, ఫాస్ట్ ట్రాక్ మోడ్‌లో ముగించాయి.
ఐరోపా సమాఖ్యలోని నాలుగు దేశాలతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కీలకమైన కొత్త మలుపుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభివర్ణించారు. భారత్-ఈఎఫ్‌టీఏ వాణిజ్య, ఆర్థిక ఒప్పందంలో కీలకంగా వ్యవహరించిన, దీనిపై సంతకాలు చేసిన వారికి శుభాకాంక్షలు. గత పదేళ్లలో భారత్ ఆర్థిక వ్యవస్థ గణనీయమైన వృద్ధిని సాధించింది. ప్రత్యేకించి ఫార్మా, వైద్యపరికరాలు, శుద్ధిచేసిన ఆహార పదార్థాలు, పారిశ్రామిక వస్తువుల రంగంలో పెనుమార్పులకు ఈ ఒప్పందం సహకరిస్తుంది. యుతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు ఈ ఒప్పందం ఎంతో సహకరిస్తుందని అన్నారు. ఈ ఒప్పందం ప్రకారం మొదటి పదేళ్లలో 50 బిలియన్ డాలర్లు, తదుపరి ఐదేళ్లలో మరో 50 బిలియన్ డాలర్ల మొత్తాన్ని పెట్టుబడులుగా పెడతారు. తద్వారా 10 లక్షలమందికి ప్రత్యేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో 11వ స్థానం నుంచి ఐదో స్థానానికి చేరుకుంది. భారత్‌ను ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడమే మా తదుపరి లక్ష్యం అని ప్రధాని తెలిపారు.
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
Vijay Devarakonda -Naveen Polishetty : మొన్నటి వరకు టాలీవుడ్ సేఫెస్ట్ హీరో ఎవరంటే చాలామంది విజయ్ దేవరకొండ అని…
Central Government: మన దేశంలోని చిన్న వ్యాపారులకు (MSMEs) ఇది నిజంగా పండగలాంటి వార్త. భారత్–UAE మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం…
Nara Lokesh : దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
Post Office Recurring Deposit (RD) Scheme : షేర్ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్న తరుణంలో,…
Husband and Wife : దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్లో నిర్వహించిన తెలుగు డయాస్పొరా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
ఒకప్పుడు బంగారం అంటే టక్కున కొనేవారు..కానీ ఇప్పుడు బంగారం పేరు చెపితేనే వామ్మో అంటున్నారు. గత ఐదేళ్లుగా బంగారం ధరలు…
This website uses cookies.