Children : ప్రస్తుతం ఇది సోషల్ మీడియా యుగం అని చెప్పొచ్చు. ఎందుకు అంటే. చాలా మంది కంటెంట్ సృష్టికర్తలు మరియు రియల్ స్టార్ లు మరియు ప్రభావశీలులుగా మారారు కాబట్టి. అయితే చిన్నపిల్లలు కూడా తమ ప్రతిబను చూపిస్తూ ఎంతో కొంత సంపాదిస్తూ ఉన్నారు. అయితే వారి ఆదాయం అనేది పరిధిలోకి వచ్చినట్లయితే దానికి ఎవరు పన్ను కట్టాలి. దీని గురించి చట్టం ఏమి చెబుతుంది. ఈ వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. పిల్లలు రెండు రకాలుగా సంపాదించవచ్చు. ఒకటి వాళ్లు సంపాదించిన ఆదాయం. మరొకటి ఆస్తి సంపాదన. అయితే ఆస్తి మరియు భూమి మరియు ఆస్తి బహుమతి ఇలా తల్లిదండ్రులు పిల్లల పేర్ల మీద పెట్టుబడి పెడితే దానిపై వచ్చే వడ్డీ అనేది ఆదాయంగా వస్తూ ఉంటుంది.
అయితే ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 64 (1A) ప్రకారం చూసినట్లయితే, మైనర్ అయిన పిల్లలు గనక సంపాదిస్తే వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఆదాయం అనేది వాళ్ల తల్లిదండ్రుల ఆదాయానికి కలపటం జరుగుతుంది. అయితే ఈ ఆదాయాన్ని బట్టి వారు పన్ను కట్టాల్సి ఉంటుంది. అలాగే సెక్షన్ 10( 32 )ప్రకారం చూసినట్లయితే, అయితే సంవత్సరానికి రూ.1500 వరకు పిల్లల ఆదాయం అనేది పన్ను నుండి మినహాయింపు ఉంటుంది. అలాగే రూల్ 64 (1A) ప్రకారం చూసినట్లయితే, పిల్లలకు వచ్చే ఆదాయాన్ని తల్లిదండ్రుల ఆదాయానికి కలుపుతారు. అలాగే తల్లిదండ్రులు ఇద్దరు కూడా సంపాదకులు అయినట్లయితే వారి పిల్లలు మరియు తల్లిదండ్రుల అధిక ఆదాయం అనేది నిబంధనల ప్రకారం పన్ను విధించడం జరుగుతుంది. అంతేకాక పిల్లలు గనక లాటరీ గెలిచినట్లయితే 30% టీడీఎస్ తీసివేస్తారు. అలాగే దానిపై 10% సర్ చార్జ్, 4% వరకు సెస్ కట్టాల్సి ఉంటుంది.
కానీ కొడుకు గనక అనాధ అయితే మాత్రం తన సంపాదనపై స్వయంగా ఐటీఆర్ కట్టాల్సి ఉంటుంది. అలాగే సెక్షన్ 80(U) ప్రకారం చూస్తే, పిల్లవాడు వికలాంగుడు మరియు అతని వైకల్యం 40% కంటే అధికంగా ఉన్నట్లయితే అతని ఆదాయం తల్లిదండ్రుల ఆదాయానికి కలపటం జరగదు…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.