Money Earn : రైతులు సంప్రదాయ పంటల సాగునే ఎక్కువగా అవలంభిస్తున్నారు. అయితే మారుతున్న కాలమాన పరిస్థితుల్లో చదువుకున్న యువత వ్యవసాయంలోకి అడుగిడి విన్నూత రీతిలో పంటలు సాగు చేస్తూ దూసుకెళ్తున్నారు. ఉద్యాన పంటలను సాగు చేయడం వలన రైతులకు సంప్రదాయ పంటల కంటే రెండు రెట్లు ఎక్కువ ఆదాయం Business వచ్చే అవకాశం ఉండడంతో దాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. అటువంటి ఓ యువ రైతు జీవితమే ఇప్పుడు చాలా మందికి ఆదర్శంగా నిలుస్తుంది. చాలా మంది ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసి చాలిచాలని జీతాలతో జీవితాలు నెట్టుకొస్తుండగా.. ఈ యువకుడు మాత్రం చదువు అనేది జ్ఞానం సముపార్జనకే అని నమ్మి సొంతూర్లో, తన వాళ్ల మధ్య హాయిగా జీవిస్తూ అందరూ ఔరా అనేలా వ్యవసాయం చేస్తూ లక్షలు ఆర్జిస్తున్నాడు. ఆ యువకుడే మంచిర్యాల జిల్లా భీమారం మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన భూక్యా రాజు నాయక్. బి ఫార్మసీ, ఎల్ ఎల్ బి పూర్తి చేశాడు. కొంతకాలం పాటు ప్రాక్టీస్ కూడా చేశాడు. అయితే వ్యవసాయంపై మక్కువ, సొంతంగా ఎదుగాలనే ఆలోచన ఉన్న రాజు ఆ ఉద్యోగాలను వదిలి సొంతూరు బాట పట్టాడు…
తండ్రి రాములు నాయక్ ఇచ్చిన ఒక్క ఎకరం వ్యవసాయ భూమిలో రాజు వినూత్న పంటలు సాగు చేయడం ప్రారంభించాడు. ఆ ఎకరం భూమిలో డ్రాగన్ ఫ్రూట్, పల్లి సాగు చేశాడు. మంచి దిగుబడులు వచ్చి లాభాలు రావడంతో మరో తొమ్మిది ఎకరాలు కొనుగోలు చేశాడు. అందులో డ్రాగన్ ఫ్రూట్, పల్లి, మునగ, మామిడి మొక్కలు వేశాడు. ఈ 10 ఎకరాలతో పాటు మరో 30 ఎకరాల భూమిని కౌలు తీసుకుని అందులో పత్తి పంట సాగు చేశాడు.రాజు నాయక్ ఆలోచన విధానమే క్రమంగా ఆదాయం తెచ్చిపెట్టేలా చేసింది. రాజు సాగు చేసే మామిడి వేసవిలో ఆదాయం ఇస్తుండగా, డ్రాగన్ ఫ్రూట్ సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు, పల్లి జనవరి నుండి మార్చి వరకు, అలాగే మునగ ఆగస్టు నుండి జనవరి వరకు ఆదాయాన్ని ఇస్తుంది.
ఇలా ఏడాది కాలం పాటు క్రమంగా ఆదాయం వచ్చేలా రాజు పంటలు సాగు చేస్తున్నాడు. ఈ విన్నూత సాగుతో ఏడాదికి రూ. 15 లక్షల ఆదాయాన్ని పొందుతున్నట్లు రాజు తెలిపాడు. చదువుకున్నవారు వ్యవసాయంలోకి వస్తే ఆధునిక విధానాలు అవలంభిస్తూ, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటలు సాగు చేస్తూ మంచి దిగుబడులతో అధిక ఆదాయాలు పొందవచ్చన్నాడు. ఎన్నో రకాల ఉద్యోగాలకు మించిన సంపాదన సంపాదించవచ్చని తెలిపాడు.
New Ration Cards : తెలంగాణలో చాలా కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేద, మధ్య…
Daaku Maharaaj Trailer :నందమూరి బాలకృష్ణ Balakrishna నటించిన డాకు మహారాజ్ సినిమా ట్రైలర్ ఆదివారం విడుదలైంది. రెండు నిమిషాల…
Papaya : కాలానికి అనుగుణంగా పండ్లు ఉంటాయి. అందులో శీతాకాలంలో ఒక పండు Papaya మాత్రం కచ్చితంగా తినాలని పోషకాహార…
Allu Arjun : నటుడు అల్లు అర్జున్‌కు ఆదివారం ఉదయం పోలీసులు మరో నోటీసు జారీ చేశారు. రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు…
Soaked Raisins : ఎండుద్రాక్ష దీన్ని కిస్మిస్ Raisins అని కూడా పిలుస్తారు. ఇది రుచి లోను మరియు పోషకాల…
Rythu Bharosa : రైతుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం మరియు ఆహార భద్రత సమస్యను పరిష్కరించే లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి…
Pawan Kalyan: గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ ఛేంజర్ Game Changer సినిమా ప్రీ…
Pawan Kalyan : రామ్ చరణ్ Ram Charan , కియారా అద్వాని ప్రధాన పాత్రలలో శంకర్ తెరకెక్కించిన చిత్రం…
This website uses cookies.