Business : శ‌భాష్ నారీమ‌ణి.. ఇస్త‌రాకుల బిజినెస్‌లో దూసుకుపోతున్న మ‌హిళ‌…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Business : శ‌భాష్ నారీమ‌ణి.. ఇస్త‌రాకుల బిజినెస్‌లో దూసుకుపోతున్న మ‌హిళ‌…!

Business : ఈ రోజుల్లో డ‌బ్బులు సాధించడం చాలా క‌ష్టం. ఒక్కో బిజినెస్ ఐడియాతో ఒక్కొక్క‌రు ప‌లు స్కెచ్‌లు వేస్తున్నారు. మన దగ్గర ఉన్న బిజినెస్ ఐడియాతో పాటు మార్కెటింగ్ పై అవగాహన ఉంటే స్వయం ఉపాధి ద్వారా ఆదాయం పొందడం ఈ రోజుల్లో పెద్ద కష్టమేమీ కాదు. నిత్య జీవితంలో మన చుట్టూ ఉండే అవసరాలను గమనించి వాటినే ఆదాయవనరుగా చేసుకుంటే డబ్బు సంపాదించడం మరింత సులువు. ఇలాంటి ఒక వ్యాపార మార్గమే పేపర్ ప్లేట్ల […]

 Authored By ramu | The Telugu News | Updated on :17 November 2024,4:06 pm

ప్రధానాంశాలు:

  •  Business : శ‌భాష్ నారీమ‌ణి..ఇస్త‌రాకుల బిజినెస్‌లో దూసుకుపోతున్న మ‌హిళ‌...!

Business : ఈ రోజుల్లో డ‌బ్బులు సాధించడం చాలా క‌ష్టం. ఒక్కో బిజినెస్ ఐడియాతో ఒక్కొక్క‌రు ప‌లు స్కెచ్‌లు వేస్తున్నారు. మన దగ్గర ఉన్న బిజినెస్ ఐడియాతో పాటు మార్కెటింగ్ పై అవగాహన ఉంటే స్వయం ఉపాధి ద్వారా ఆదాయం పొందడం ఈ రోజుల్లో పెద్ద కష్టమేమీ కాదు. నిత్య జీవితంలో మన చుట్టూ ఉండే అవసరాలను గమనించి వాటినే ఆదాయవనరుగా చేసుకుంటే డబ్బు సంపాదించడం మరింత సులువు. ఇలాంటి ఒక వ్యాపార మార్గమే పేపర్ ప్లేట్ల తయారీ బిజినెస్. ప్రస్తుత కాలంలో పెళ్లిళ్ల కైనా, రిసెప్షన్ల కైనా, బర్త్ డే పార్టీలకైనా ఫంక్షన్ ఏదైనా సరే బఫె పద్దతిలో విందు ఇవ్వడం అనేది సర్వసాధారణం అయిపోయింది.బఫె పద్ధతిలో విందు ఇవ్వడానికి పేపర్ ప్లేట్లను ఎక్కువగా వాడుతుంటారు.

Business శ‌భాష్ ఉషా..

శుభకార్యాలకే కాకుండా స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ లో సైతం పేప‌ర్ ప్లేట్స్ వాడకం ఎక్కువ. ఇలా వీటి వాడకం నిత్యం ఉండటంవల్ల ఈ ప్లేట్లకు మంచి డిమాండ్ వుంది. అందువలన వీటి అవసరాన్ని ఆదాయవనరుగా మలచుకుని లక్షల్లో డబ్బు సంపాదించుకోవడానికి మంచి అవకాశం ఉంది. తిరుపతికి చెందిన ఉషా విస్తరాకులు డైనింగ్ సొల్యూషన్ అనే పేరుతో విస్తరాకుల ప్లేట్ల తయారీ సంస్థను ఆరేళ్ల కిందట ప్రారంభించారు. ఈ సంస్థ ప్రారంభించిన ఏడాదికే కరోనా ఉపధృవం రావడంతో రెండేళ్ల పాటు వ్యాపారంలో చాలా నష్టాలు చవిచూడ‌డంతో ప్రొడక్షన్ చేసిన విస్తరాకుల పేపర్ ప్లేట్లు ఒక్క టన్ను కూడా అమ్మ‌లేక‌పోయాడు.

Business శ‌భాష్ నారీమ‌ణి ఇస్త‌రాకుల బిజినెస్‌లో దూసుకుపోతున్న మ‌హిళ‌

Business : శ‌భాష్ నారీమ‌ణి.. ఇస్త‌రాకుల బిజినెస్‌లో దూసుకుపోతున్న మ‌హిళ‌…!

స్వయంగా తామే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్‌గా మారి అనేక దుకాణాలు వెళ్లి విస్తరాకుల ప్లేట్లను విక్రయించడం ప్రారంభించారు. భయట ఉన్న ప్లాస్టిక్ పేపర్ ప్లేట్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని… ఈ ఇస్తరాకుల పేపర్ ప్లేట్ ద్వారా ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదని ఉష తెలుపుతున్నారు.ఈ సంస్థ ప్రారంభించిన కొత్తల్లో చాలా ఒడిదుడుకులు ఎదురుకొన్నానని, ఎన్జీఓ గా విధులు నిర్వహించానని, అప్పట్లో మంచి జీతం వచ్చేదని , జిల్లా ప్రోగ్రామర్‌గా గతంలో పనిచేశానని, స్వయంగా ఏదోకటి చేయాలన్న ఆలోచనతో ఈ ఫ్యాక్టరీని స్థాపించానని వివరించారు. 10 మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఇలా చేశాన‌ని తాను అన్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది