Money Earn : ఏడాదికి రూ.15 ల‌క్ష‌ల సంపాద‌న‌.. ఈ యువ రైతు విన్నూత సాగు సూప‌ర్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Money Earn : ఏడాదికి రూ.15 ల‌క్ష‌ల సంపాద‌న‌.. ఈ యువ రైతు విన్నూత సాగు సూప‌ర్‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :31 December 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Money Earn : ఏడాదికి రూ.15 ల‌క్ష‌ల సంపాద‌న‌.. ఈ యువ రైతు విన్నూత సాగు సూప‌ర్‌..!

Money Earn : రైతులు సంప్ర‌దాయ పంట‌ల సాగునే ఎక్కువ‌గా అవ‌లంభిస్తున్నారు. అయితే మారుతున్న కాల‌మాన ప‌రిస్థితుల్లో చ‌దువుకున్న యువ‌త వ్య‌వ‌సాయంలోకి అడుగిడి విన్నూత రీతిలో పంట‌లు సాగు చేస్తూ దూసుకెళ్తున్నారు. ఉద్యాన పంటలను సాగు చేయడం వలన రైతులకు సంప్రదాయ పంటల కంటే రెండు రెట్లు ఎక్కువ ఆదాయం Business వచ్చే అవకాశం ఉండ‌డంతో దాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. అటువంటి ఓ యువ రైతు జీవిత‌మే ఇప్పుడు చాలా మందికి ఆద‌ర్శంగా నిలుస్తుంది. చాలా మంది ఉన్న‌త విద్యాభ్యాసం పూర్తి చేసి చాలిచాల‌ని జీతాల‌తో జీవితాలు నెట్టుకొస్తుండ‌గా.. ఈ యువ‌కుడు మాత్రం చ‌దువు అనేది జ్ఞానం స‌ముపార్జ‌న‌కే అని న‌మ్మి సొంతూర్లో, త‌న వాళ్ల మ‌ధ్య హాయిగా జీవిస్తూ అంద‌రూ ఔరా అనేలా వ్య‌వసాయం చేస్తూ ల‌క్ష‌లు ఆర్జిస్తున్నాడు. ఆ యువ‌కుడే మంచిర్యాల జిల్లా భీమారం మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన భూక్యా రాజు నాయక్. బి ఫార్మసీ, ఎల్ ఎల్ బి పూర్తి చేశాడు. కొంతకాలం పాటు ప్రాక్టీస్ కూడా చేశాడు. అయితే వ్య‌వ‌సాయంపై మ‌క్కువ‌, సొంతంగా ఎదుగాల‌నే ఆలోచ‌న ఉన్న రాజు ఆ ఉద్యోగాల‌ను వ‌దిలి సొంతూరు బాట ప‌ట్టాడు…

Money Earn ఏడాదికి రూ15 ల‌క్ష‌ల సంపాద‌న‌ ఈ యువ రైతు విన్నూత సాగు సూప‌ర్‌

Money Earn : ఏడాదికి రూ.15 ల‌క్ష‌ల సంపాద‌న‌.. ఈ యువ రైతు విన్నూత సాగు సూప‌ర్‌..!

తండ్రి రాములు నాయ‌క్ ఇచ్చిన ఒక్క ఎక‌రం వ్యవసాయ భూమిలో రాజు వినూత్న పంటలు సాగు చేయడం ప్రారంభించాడు. ఆ ఎకరం భూమిలో డ్రాగన్ ఫ్రూట్‌, పల్లి సాగు చేశాడు. మంచి దిగుబడులు వచ్చి లాభాలు రావడంతో మరో తొమ్మిది ఎకరాలు కొనుగోలు చేశాడు. అందులో డ్రాగన్ ఫ్రూట్‌, పల్లి, మునగ, మామిడి మొక్క‌లు వేశాడు. ఈ 10 ఎక‌రాల‌తో పాటు మ‌రో 30 ఎకరాల భూమిని కౌలు తీసుకుని అందులో పత్తి పంట సాగు చేశాడు.రాజు నాయక్ ఆలోచన విధానమే క్ర‌మంగా ఆదాయం తెచ్చిపెట్టేలా చేసింది. రాజు సాగు చేసే మామిడి వేసవిలో ఆదాయం ఇస్తుండ‌గా, డ్రాగన్ ఫ్రూట్‌ సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు, పల్లి జనవరి నుండి మార్చి వరకు, అలాగే మునగ ఆగస్టు నుండి జనవరి వరకు ఆదాయాన్ని ఇస్తుంది.

ఇలా ఏడాది కాలం పాటు క్రమంగా ఆదాయం వ‌చ్చేలా రాజు పంటలు సాగు చేస్తున్నాడు. ఈ విన్నూత సాగుతో ఏడాదికి రూ. 15 లక్షల ఆదాయాన్ని పొందుతున్నట్లు రాజు తెలిపాడు. చదువుకున్నవారు వ్యవసాయంలోకి వ‌స్తే ఆధునిక విధానాలు అవ‌లంభిస్తూ, మార్కెట్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా పంట‌లు సాగు చేస్తూ మంచి దిగుబ‌డుల‌తో అధిక ఆదాయాలు పొంద‌వ‌చ్చ‌న్నాడు. ఎన్నో ర‌కాల ఉద్యోగాల‌కు మించిన సంపాదన సంపాదించవ‌చ్చ‌ని తెలిపాడు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది