Zodiac Signs : ఆ రోజు నుంచి ఈ నాలుగు రాశుల వారికి ఈ సమస్యలు ఉండవు…!
Zodiac Signs : దీపావళి పండుగ అయిపోయిన తర్వాత అంటే అక్టోబర్ 26న బుధుడు కన్యారాశిని వదిలి తులా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇలా నవంబర్ 19 వరకు ఈ రాశిలోనే ఉంటుంది. బుధ గ్రహ సంచారం వలన పలు రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో బుధుడికి అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. బుధుడు తెలివితేటలు, వాక్కు, గణితం చాకచక్యం, స్నేహానికి ప్రతీకగా పరిగణిస్తారు.
బుధుడు అనుకూలమైన స్థితిలో ఉంటే, ఆయా వ్యక్తులు మేధావులు అవుతారు. అయితే ప్రస్తుతం బుధుడు తులా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇది మొత్తం పన్నెండు రాశుల మీద ప్రభావాన్ని చూపబోతుంది. ముఖ్యంగా తులా రాశిలో బుధుడి సంచారం నాలుగు రాశులపై ప్రతికూల ప్రభావం చూపబోతుంది. అయితే బుధుడు కన్య రాశి నుంచి తులా రాశిలోకి ప్రవేశించినప్పుడు ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అవి ఏ రాశులో ఇప్పుడు తెలుసుకుందాం.
1) బుధుడు కన్యారాశి నుంచి తులా రాశిలోకి ప్రవేశించిన సమయంలో మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. పని ప్రదేశంలో వారికి అనుకూలమైన అవకాశాలు లభిస్తాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. అనుకొని ప్రదేశాల నుండి ఆర్థిక లాభాలు వస్తాయి. మంచి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యం కాపాడుకోవాలి. నలుగురిలో గౌరవాన్ని పొందుతారు.
2) బుధుడు తులా రాశిలోకి ప్రవేశించడం వలన కర్కాటక రాశి వారికి కుటుంబ శాంతి కలుగుతుంది. ఉద్యోగంలో ఆదాయపరంగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు విద్యారంగంలో రాణిస్తారు. వ్యాపారస్తులకు మంచి ఒప్పందాలు లభిస్తాయి. మొత్తానికి కర్కాటక రాశి వారికి చూసుకుంటే అన్ని విధాలుగా చక్కగా కనబడే అవకాశం కనిపిస్తుంది.
3) బుధుడు తులారాశిలో ప్రవేశించడం వలన సింహ రాశి వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. బంధుమిత్రుల బంధాలు తీయగా ఉంటాయి. ఉద్యోగంలో అనుకున్న విజయాలను సాధిస్తారు.
4) బుధగ్రహం తులా రాశిలో సంచరించడం వలన ధనుస్సు రాశి వారికి మంచి ఫలితాలు రానున్నాయి. వారు కొత్త ఆదాయాన్ని పొందుతారు. దాని వలన డబ్బు సంపాదన పెరుగుతుంది. బకాయిలు తిరిగి చెల్లించబడతాయి. కుటుంబ సంబంధాలు చక్కగా కొనసాగుతాయి. శుభవార్తలను వింటారు. దాని వలన మనసు ఆనందంగా ఉంటుంది.