Amalaka Ekadashi 2025 : అమలక ఏకాదశి అంటే తెలుసా... ఈరోజు విష్ణువును పూజిస్తే... గోదానం పుణ్యఫలం, భోగభాగ్యాలు తులతూగుతాయంట...?
మన హిందూ సాంప్రదాయాలలో పండుగలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అటువంటి పండుగలలో అమలక ఏకాదశి చాలా ముఖ్యమైనది. ఈ అమలక ఏకాదశి పాల్గుణ మాసంలో వస్తుంది. ఈరోజున శ్రీమహావిష్ణువుని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈరోజు ఎవరైతే ఉపవాస దీక్షలను ఆచరిస్తూ శ్రీమహావిష్ణువుని పూజిస్తే సమస్త పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ అమలక ఏకాదశి రోజున ప్రత్యేకించి ఉసిరి చెట్టు కింద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఇలా వ్రతాన్ని ఆచరిస్తే పుణ్యాలకు పుట్టినిల్లుగా మారుతుందని, భోగభాగ్యాలతో తులతూగుతాయని జీవితంలో ఎటువంటి లోటు లేకుండా సంతోషంగా జీవించవచ్చని. ఈ అమలక ఏకాదశి నాడు ఎవరైతే పూజలు చేసి, ఉపవాసాలను చేస్తూ, దానధర్మాలను చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగునని పురాణాల్లో చెప్పబడినది.
మన హిందూ ధర్మ శాస్త్రంలో ఏకాదశి ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఒక ఏడాదిలో 24 ఏకాదశి లో వస్తాయి. శ్రీ మహావిష్ణువు కి ఏకాదశి తిధిని అంకితం చేయబడినది. మన తెలుగు క్యాలెండర్ లో చివరి మాసమైన పాల్గొనమాసంలో, వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశిని ధాత్రి ఏకాదశి, అమృత ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు నా విష్ణువుని పూజిస్తూ అలాగే ఉసిరి చెట్టును కూడా పూజిస్తారు. ఇలా చేయడం వల్ల విష్ణువు, లక్ష్మీదేవి ఆశీస్సులు మనకు కలుగుతాయి. ఈరోజున ఉపవాసం ఉండి పూజలు చేస్తే పాపాలన్ని తొలగి పుణ్యఫలం లభిస్తుంది. వారికి జీవితంలో సంతోషం, సంపదలు కలుగుతాయి. వీరి ఇల్లు ఎప్పుడు కూడా సిరిసంపదలతో, భోగభాగ్యాలతో విరాజిల్లుతుంది. ఈ మహావిష్ణువుని పూజించడమే కాదు, ఉపవాసాలు చేయాలి, ఇంకా దానధర్మాలు కూడా చేస్తే, జీవితంలో ఎటువంటి ఆటంకాలు రావని భక్తుల నమ్మకం.
Amalaka Ekadashi 2025 : అమలక ఏకాదశి అంటే తెలుసా… ఈరోజు విష్ణువును పూజిస్తే… గోదానం పుణ్యఫలం, భోగభాగ్యాలు తులతూగుతాయంట…?
మన తెలుగు క్యాలెండర్ల ప్రకారం పాల్గొనమాసంలో కృష్ణపక్ష ఏకాదశి తిధిన 2025, మార్చి 9న ఉదయం 7:45 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ తిధి మార్చి 10న ఉదయం 7:44 గంటలకు ముగుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏకాదశి ఉపవాసం మార్చి 10న చేయాల్సి ఉంటుంది. మార్చి 11 న ఉదయం 6:35 నుంచి 8:13 ఏకాదశి ఉపవాసం విరమించే సమయం. ఈ సమయంలో ఉపవాసమును విరమించవచ్చు.
ఉసిరి చెట్టు అంటే శ్రీమహావిష్ణువుకి ఎంతో ప్రీతికరం. ఎందుకనగా శ్రీమహావిష్ణువు ఉసిరి చెట్టులో కొలువై ఉంటాడు. అందుకే ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుని ఉసిరి చెట్టుకి పూజలను చేస్తారు. కాబట్టి ఉసిరి చెట్టును పూజించే సంప్రదాయం మొదలయింది. అయితే ఈ రోజున ఉసిరిని దానం చేయాలి. ఉసిరి దానం మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. జీవితంలో వచ్చే ఆటంకాలు అన్ని తొలగిపోయి అదృష్టం వరిస్తుంది.
ఆహారం : అమలక ఏకాదశి రోజున పేదలకు ఆహారాన్ని పెట్టాలి. అవసరార్థులకు కూడా ఆహారం వితరణ చేయాలి. ఎవరైతే అన్నదానం చేస్తారో వారికి గోదానం చేసిన పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు. అన్నదానం ఎంతో గొప్పది. ఇంట్లో సిరిసంపదలు తులతూగుతాయి.
నల్ల నువ్వులు : నల్ల నువ్వులను అమలక ఏకాదశి రోజున దానం చేస్తే తమ పూర్వికులు ఆత్మలకు శాంతి చేకూరుతుందని నమ్ముతారు. కావున అమలక ఏకాదశి రోజున నల్ల నువ్వులను దానం చేయండి.
డబ్బు, వస్త్రాలు : అమలక ఏకాదశి రోజున, నిరుపేదలకు డబ్బు, వస్త్రాలను దానం చేస్తే ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోతాయి. అంతేకాదు ఇంట్లో ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది. మీకు ఎల్లప్పుడూ డబ్బుకి, వస్త్రాలకి లోటు ఉండదు.
పసుపు రంగు వస్తువులు : పసుపు రంగు వస్తువులను అమలక ఏకాదశి రోజున దానం చేస్తే, మీ ఇంట్లో సుఖసంతోషాలు, మనశ్శాంతి నెలకొంటుంది. మీ జాతకంలో బృహస్పతి గ్రహం బలపడుతుంది. గురువు అనుగ్రహం కలుగుతుంది.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.