Money Plant : ఇప్పుడు చాలామంది మనీ ప్లాంట్ ను ఇళ్ళల్లో పెంచుతున్నారు. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే మంచి జరుగుతుందని, సంపాదనను పొందడంలో సహాయపడుతుందని చాలామంది చెబుతారు. దీనికి ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. అంతేకాకుండా వాటి నిర్వహణ కూడా సులువుగా ఉంటుంది. ఈ మొక్క ఇంట్లో ఉండటం వలన పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఇంట్లోని కుటుంబీకులు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మనీ ప్లాంట్ ను సరైన దిశలో ఉంచడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సరైన స్థలంలో మనీ ప్లాంట్ ను ఉంచకపోతే ఇంట్లో ఆర్థికపరంగా ఎన్నో సమస్యలు వస్తాయి. ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. కనుక మనీ ప్లాంట్ ను ఎప్పుడైనా సరే వాస్తు ప్రకారం గా ఉంచుకోవాలి. మనీ ప్లాంట్ ను ఎప్పుడైనా సరే ఆగ్నేయ దిశలో నాటాలి.
వినాయకుడు ఈ దిశలో మంచిని సూచించే దేవుడు. కనుక ఈ దిశలో నాటడం వలన పుణ్యఫలం లభించే అవకాశం ఉంది. అలాగే మనీ ప్లాంట్ ను నేలకు తాకకుండా చూసుకోవాలి. తీగలు ఎదుగుతున్నప్పుడు తాడుతో కట్టి పందిరిలా అల్లుకునేలా చేయాలి. వాస్తు ప్రకారం పెరుగుతున్న తీగలు శుభ సూచకం. మనీ ప్లాంట్ లక్ష్మీదేవి అభివ్యక్తి అని చెబుతారు. మనీ ప్లాంట్ ను ఎప్పుడైనా సరే ఈశాన్య దిశలో పెట్టకూడదు. ఆర్థికంగా అనేక సమస్యలు ఎదురవుతాయి. ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ చొరబడుతుంది. అలాగే మనీ ప్లాంట్ ను ఎండిపోకుండా కాపాడుకోవాలి. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ఎండిపోతే ఇంట్లో అశుభాలు జరుగుతాయి. కనుక మనీ ప్లాంటుకు ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉండాలి. ఒకవేళ ఆకులు ఎండిపోతే వాటిని వెంటనే కత్తిరించి తొలగించుకోవాలి.
వాస్తు ప్రకారంగా మనీ ప్లాంట్ కు ఈ దారం కట్టడం వలన ఆర్థికంగా అనేక సమస్యలు తొలగిపోతాయని వాస్తు పండితులు చెబుతున్నారు. అది ఏ దారం అంటే ఎరుపు రంగు దారం. శుక్రవారం రోజు మనీప్లాంట్ కు ఎర్రటి దారాన్ని కట్టాలి. ఇలా కట్టడం వలన ఇంటికి శుభం కలుగుతుంది. ఎరుపు రంగు విజయానికి సంకేతం. అందువలన మనీ ప్లాంట్ కు ఎర్రటి దారం కట్టడం వలన మీరు అనుకున్న పనులు విజయవంతం అవుతాయి. ఆర్థికంగా ఊహించలేనంతగా ఎదుగుతారు. ఇంట్లో డబ్బు సమస్యలు తొలగిపోయి ఆనందంగా జీవిస్తారు. అలాగే ఇంట్లోని కుటుంబీకులు ఆరోగ్యపరంగా అన్ని విషయాలలో సౌకర్యంగా ఉంటారు. అనుకున్న పనులు జరిగిపోతాయి. డబ్బులు ఇవ్వాల్సిన వారు తిరిగి ఇచ్చేస్తారు. కనుక ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఇంటికి మనీ ప్లాంట్ ను తెచ్చుకొని ఎరుపు రంగు దారాన్ని కడితే అంతా శుభమే జరుగుతుంది.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.