
Astrology Tips do not kept these objects on the floor in Pooja Time
Pooja Time ; దేవుడి అనుగ్రహం ఉంటేనే ఇల్లు సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వెలుగుతుందని ప్రతి ఒక్కరు తమకు ఇష్టమైన దైవాన్ని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. దేవుడిని మెప్పించడానికి వివిధ రకాల ఫలహారాలు చేసి సమర్పిస్తుంటారు. ఉదయం, సాయంత్రం స్నానమాచరించి దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు. కానీ కొంతమందికి పూజల వలన ఎటువంటి ప్రయోజనం కలుగదు. ఇంటి సమస్యలు అలానే ఉంటాయి. దీనికి కారణం పూజ చేసేటప్పుడు తెలిసి, తెలియక కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు. అందుకే దేవుని అనుగ్రహం వారిపై కలుగదు. అందువలన ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తించుకోవాలి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
1) పూజ చేసేటప్పుడు దేవుని విగ్రహాన్నినేలపై అస్సలు ఉంచకూడదు. అలాగే దేవుడి గదిని శుభ్రం చేసేటప్పుడు విగ్రహాలను కాని ఫోటోలను కాని ఒక పీఠ మీద కాని ఒక శుభ్రమైన గుడ్డ మీద కాని పెట్టాలి. నేలపై అస్సలు పెట్టకూడదు. ఇలా దేవుడి విగ్రహాలను నేలపై పెట్టడం వలన దేవుళ్లను అవమానించినట్లు అవుతుంది. మీ ఇంట్లో దరిద్య్రం తాండవం చేస్తుంది. కనుక ఎప్పుడైనా సరే దేవుడి విగ్రహాలను నేలపై ఉంచరాదు. ఇంట్లోని కుటుంబీకులు మానసికంగా, ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాలసి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోను దేవుడి విగ్రహాలను, ఫోటోలను నేలపై పెట్టరాదు.
Astrology Tips do not kept these objects on the floor in Pooja Time
2) మన హిందూ సాంప్రదాయాల ప్రకారం దేవుడి ముందు ఒక దీపం వెలిగించి కూడా పూజ చేయవచ్చు. అయితే దేవుడి గది లోపల మాత్రమే దీపాన్ని వెలిగించాలి. నేలపై దీపాన్ని పెట్టి దేవుడిని పూజించకూడదు. ఎప్పుడైనా సరే దీపాన్ని ఒక ప్లేట్ లో కాని ఒక స్టాండ్ లో కాని పెట్టి వెలిగించాలి.దీపాన్ని నేలపై పెట్టి అస్సలు వెలిగించకూడదు. ఇలా చేస్తే ఇంటికి కీడు కలుగుతుంది. అందుకే దీపం వెలిగించే ముందు నేలపై వరిపిండితో ముగ్గు వేసుకొని దానిపై ఒక ప్లేట్ లేదా స్టాండ్ పెట్టి అందులో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే ఇంటికి శుభం కలుగుతుంది.
3)అలాగే పూజ అయిపోయిన అనంతరం శంఖాన్ని పూరించాలి. శంఖం శుభానికి సంకేతం. కాబట్టి శంఖాన్ని ఎల్లప్పుడూ దేవుని గదిలోనే ఉంచాలి. ఎందుకంటే శంఖం లక్ష్మీదేవికి ప్రతీక. కాబట్టి దానిని నేలపై అస్సలు ఉంచకూడదు. అది లక్ష్మీదేవికి ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. శంఖాన్ని నేలపై ఉంచడం వలన ఇంట్లో ఆర్ధిక సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఇంట్లోని వారు మానసికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోంటారు.
4) అలాగే రత్నాలు, బంగారం, వెండి, వజ్రాలు మొదలగు విలువైన వాటిని నేలపై ఉంచకూడదు.ఎందుకంటే ఇవి ఏదో ఒక గ్రహానికి సంబంధించినవి. కనుక వీటిని నేలపై ఉంచడం వలన వారికి అవమానించినట్లు అవుతుంది. పూజ అయిపోయాక రత్నాలను నేలపై ఉంచితే వాటి ప్రభావం తగ్గుతుంది.కాబట్టి వాటిని ఒక గుడ్డలో చుట్టి పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోను వీటిని నేలపై ఉంచకూడదు. ఇంటికి శుభం కలగాలంటే ఈ నాలుగు వస్తువులను నేలపై అస్సలు ఉంచకూడదు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.