Deeparadhana : సకల సౌభాగ్యాలు కావాలంటే దీపారాధన దీంతో చేయండి !
దీపారాధన.. అత్యంత పవిత్రమైన కార్యక్రమం ప్రతి హిందూభక్తులు తమ ఇండ్లలో పొద్దున, సాయంత్రం వేళలలో దీపారాధ చేస్తారు. ఇక కార్తీకమాసంలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీపానికి ఉన్న ప్రాశ్యస్తం అంతా ఇంతాకాదు. అయితే చాలామందికి వచ్చే సందేహం ఏ నూనెతో దీపారాధన చేయాలి అని దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం….
నువ్వులనూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషములు , పీడలు పోతాయి. నెయ్యి దీపారాధన చేసిన ఇంటిలో సర్వ సుఖాలు సౌభాగ్యాలు లభిస్తాయి. ఆముదంతో దీపారాధన చేసిన దేదీప్య మానమగు జీవితం, బంధుమిత్రుల శుభం, దాంపత్య సుఖం వృద్ధి అవుతుంది. నెయ్యి , ఆముదం , వేప నూనె , కొబ్బరి నూనె , ఇప్ప నూనె కలిపి 48 రోజులు దీపారాధన చేసిన వారికి దేవీ అనుగ్రహం కలుగును.
వేప నూనె, నెయ్యి , ఇప్ప నూనె మూడు కలిపి దీపారాధన చేసిన ఐశ్వర్యం.., ఇలవేల్పులకు సంతృప్తి కలుగును .ఇక ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం .. వేరుశెనగనూనె దీపారాధన చేసిన నిత్య ఋణములు, దుఖం, చోర భయం, పీడలు మొదలగునవి సంభవిస్తాయి.