Brahmam Gari Kalagnanam 2023 : కరోనా వచ్చిన మూడేళ్ళ తరవాత అంటే 202౩ లో ఏం జరుగుతుంది.. బ్రహ్మం గారు అప్పుడే చెప్పారు !
Brahmam Gari Kalagnanam 2023 : శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన అపారమైన జ్ఞానంతో భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే చెప్పారు. కాలక్రమంలో చూస్తున్న మార్పులను చూస్తే వీటన్నిటిని బ్రహ్మంగారు ముందే తన కాలజ్ఞానంలో ప్రస్తావించారని తెలుస్తుంది. మనం ఎక్కడ ఏ వింత జరిగిన అది ముందే బ్రహ్మం గారు చెప్పారు అంటూ గుర్తు చేసుకుంటున్నాం. ఇలాంటి వాటిలో కరోనా వైరస్ ఒకటి. కరోనా గురించి బ్రహ్మంగారు ముందే కాలజ్ఞానంలో ప్రస్తావించారట. కోరంకియను జబ్బు కోటి మందికి తగిలి కోడి లాగా తూగి సచ్చేరయా అంటూ ఆయన కాలజ్ఞానంలో చెబుతారు. కరోనా తర్వాత ఈ భయంకరమైన పరిస్థితులు
ఇంతటితో ఆగిపోవని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో పేర్కొన్నారని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే బ్రహ్మంగారి చెప్పినట్లు జరుగుతోంది. ప్రస్తుతం బ్రిటన్ నుంచి కొత్త వైరస్ స్ప్రెడ్ అవుతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిపట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ దేశాలను సూచిస్తుంది. దీనిని బట్టి కరోనా ఇంకా అయిపోలేదని, పరిస్థితి మరింత భయంకరంగా మారే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆయన కాలజ్ఞానాన్ని బట్టి చూస్తే కరోనా ఇంకా అయిపోలేదని ఓమిక్రాన్ పేరిట మరో కొత్త వైరస్ పుట్టుకొస్తుంది అని తెలుస్తుంది. అలాగే వీటితోపాటు కాశీలోని దేవాలయం 40 రోజులపాటు పాటుపడుతుందని తెలిపారు. 1910_12 కాలంలో గంగా నదికి వరదలు రావడం,
ఆ సమయంలోనే కలరా వ్యాధి రావడం తో కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకోవడానికి ఎవరు రాలేదు. అలాగే ఓ అంబ16 సంవత్సరాల పాటు రాజ్యాన్ని పాలిస్తుంది అని అన్నారు. ఆయన చెప్పినట్లే ఇందిరా దేవి 16 సంవత్సరాలు భారత ప్రధాని గా కొనసాగారు. అలాగే స్త్రీలపై అక్రమాలు ఎక్కువ అవుతాయని, వ్యభిచారిల వలన భయంకరమైన వ్యాధులకు గురవుతారని చెప్పారు. ఇప్పటికే వ్యభిచారి వలన ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. దీనికి చాలా కాలం మందు కనుక్కోలేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే కృష్ణానది కనకదుర్గమ్మ ముక్కుపుడక తాకుతుందని చెప్పారు. జల ప్రళయం జరిగి నాగార్జున డ్యాం బీటలు బారితే కృష్ణానది దుర్గమ్మను తాకే ప్రమాదం ఉంది.