Brahmam Gari Kalagnanam : బ్రహ్మంగారు భవిష్యత్తుని ముందుగానే ఊహించి చెప్పారు అన్న విషయం మనందరికీ తెలుసు. ఆయన రచించిన కాలజ్ఞానంలోని అంశాలు ఇప్పటికీ నిజం అవుతున్నాయి. అవి మనందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పటివరకు కాలజ్ఞానంలో పొందుపరిచినటువంటి అంశాలు మన నిజ జీవితంలో ఎన్నో జరిగాయి. ఎలాంటి ఉత్పాదాలు జరిగిన, ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా, ఎలాంటి వ్యాధులు , ప్రబలిడినా, ఏం జరిగినా సరే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో దానికి సంబంధించి ఏదో ఒక అంశం ఉండడం చూస్తూనే ఉన్నాం. ఇప్పటివరకు అనేక అంశాలు జరిగాయి. కాలజ్ఞానం అంటే మన అందరికీ తెలుసు భవిష్యత్తులో జరగబోయే అంశాలను ముందుగానే చెప్పడం. అయితే ఆయన కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు నిజంగానే జరుగుతున్నాయా అంటే కచ్చితంగా జరుగుతున్నాయి.
బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని తాళపత్రాల గ్రంధాలలో రాశారు. భవిష్యత్తులో జరిగే అన్ని విషయాలను ఆయన పొందుపరిచారు. ఆయన ఒకేసారి ఈ కాలజ్ఞానాన్ని రాయలేదు. అనేక విడతలగా రాశారు అని చరిత్ర చెబుతుంది. ఆయన తన కాలజ్ఞానంలో కాశీలోని దేవాలయం 48 రోజులు మూతపడుతుందని రాశారు. ఆయన చెప్పినట్లుగానే 1910 సంవత్సరంలో దేవాలయాన్ని 48 రోజులపాటు మూతపడేలా చేశారు. ముఖ్యంగా గంగానదికి ఆ సమయంలో వరదలుు వచ్చాయి. అలా వరద రావడం వలన కలరా వ్యాధి వచ్చింది. దీని కారణంగా ఆ వ్యాధి మరొకరికి ప్రబలించకుండా ఉండటానికి 48 రోజులు దేవాలయాన్ని మూసివేశారు.అలాగే కాలజ్ఞానంలో బ్రహ్మంగారు రాజరిక వ్యవస్థ కనుమరుగు అవుతుందని చెప్పారు. ఇప్పుడు చూస్తే మన దేశంలో రాచరికం లేదు.
ఒక అమ్మ దేశాన్ని శాసిస్తుంది అని చెప్పారు. ఇందిరాగాంధీ మన దేశాన్ని ప్రధానమంత్రిగా పనిచేశారు. ఈ అంశాన్ని ఆయన కాలజ్ఞానంలో ముందుగానే రాయడం జరిగింది. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని చెప్పారు. జనసంఖ్య పెరుగుతుందని చెప్పారు.చిత్రవిచిత్రమైన యంత్రాలు వస్తాయని చెప్పారు.ఎవరు ఎన్ని యంత్రాలు కనిపెట్టిన చావు పుట్టుకల మర్మాన్ని కనిపెట్టలేరు అని బ్రహ్మంగారు చెప్పారు. నీటితో దీపాలు వెలిగిస్తారని చెప్పారు. ఇప్పుడు నీటితో తయారుచేసిన కరెంటును వాడుతున్నాం. దీనిని ముందుగానే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు. కపట యోగులు దేశంలో పెరిగిపోతారని చెప్పారు. అలాగే వేశ్యల వలన జనాలు భయంకరమైన రోగాల బారిన పడతారని చెప్పారు.
5000 ఏళ్ల తర్వాత గంగా నది కనిపించదని, చెన్నకేశవ స్వామి మహిమలు నాశనం అవుతాయని రాశారు. అలాగే కృష్ణా నదిలో బంగారు రధం పుడుతుందని, అది చూసిన వారి కళ్ళు పోతాయని రాశారు. వేప చెట్టు నుంచి అమృతం కారుతుందని చెప్పారు. కరోనా లాంటి వ్యాధి గురించి కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు. కోరంగి అనే వ్యాధి తూర్పు దేశం నుంచి వ్యాపించి జనాలు కోళ్ల వలే తూగి చచ్చిపోతారని చెప్పారు. 2024లో ప్రకృతి ప్రకోపానికి మనుషులు మానవజాతి గురవుతారని చెప్పారు. 2024 కొత్త సంవత్సరంలో జపాన్ లో 27 చోట్ల భూకంపం వచ్చింది. అలాగే జనాలలో పాపం పెరుగుతుందని చెప్పారు. వావి వరసలు మర్చిపోతారని చెప్పారు. ఒకరిని మరొకరు చంపుకుంటారని చెప్పారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.