Dhanteras : ధన్ తెరాస్ పండుగ గురించి హిందువులకు తెలిసే ఉంటుంది. ఇక ఈ ధన్ తేరాస్ పండుగ రోజున ప్రతి ఒక్కరూ ధన్వంతరి మాతను పూజిస్తారు. ఈరోజు ఈ విధంగా ధన్వంతరిని పూజించడం వలన అనేక కష్టాలు, ఆర్థిక నష్టాలు ,ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారని హిందువుల నమ్మకం. అయితే ఈ ఏడాది ధన్ తెరాస్ పండుగ దీపావళి నుండి ప్రారంభం కానుంది. అంటే ఈ ఏడాది అక్టోబర్ 29న ధన్ తెరాస్ పండుగను జరుపుకోనున్నారు. అయితే ఈరోజు చాలామంది బంగారం మరియు వెండి అభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం వలన బాగా కలిసి వస్తుందని నమ్మకం. అయితే ఈ పండుగ రోజు అందరూ వెండి మరియు బంగారు అభరణాలను కొనలేరు. అలాంటివారు కొన్ని రకాల వస్తువులను కొనుగోలు చేయడం వలన అర్దిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.
ధన్ తెరాస్ పండుగ రోజు ప్రతి ఒక్కరు కూడా బంగారం మరియు వెండి అభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక ఈ రోజున బంగారం మరియు వెండి వస్తువులను కొనుగోలు చేయలేని వారు ,కొన్ని రకాల వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు. అయితే హిందూ సంప్రదాయంలో ఎలాంటి శుభకార్యాలు జరిగిన తప్పనిసరిగా తమలపాకులను ఉపయోగిస్తూ ఉంటారు. ఇక ఈ తమలపాకును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇక ఈ తమలపాకులను కొనుగోలు చేసి ధన్ తెరాస్ రోజున లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టినట్లయితే ఆ జగన్మాత ఆశీస్సులు లభిస్తాయని పురోహితులు చెబుతున్నారు. ఇలా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన తమలపాకులను మరుసటి రోజు ఉదయం ఓ పవిత్రమైన నదిలో వదిలేయాలి.అదేవిధంగా ధన్ తెరాస్ పండుగ రోజు కొత్తిమీరను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చిన కూడా శుభశకునం అవుతుంది. ఎందుకంటే కొత్తిమీరను కూడా సంపదకు చిహ్నంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ పండుగ రోజు కొత్తిమీరను కొంటే డబ్బుకు లోటు ఉండదని నమ్మకం.
అలాగే హిందూ సాంప్రదాయాలలో పసుపు కుంకుమలు లేకుండా పూజలు జరగవు. అలాంటి పసుపు కుంకుమలను ధన్ తెరాస్ పండుగ రోజు కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడం అత్యంత శుభప్రదం. ఈ విధంగా చేయడం వలన ఇంట్లోని స్త్రీలకు వైవాహిక జీవితం సాఫీగా ఉంటుంది. అంతేకాక అదృష్టం పడుతుంది. అలాగే ఈ ధన్ తెరాస్ పండుగ రోజు ఇంట్లోకి చీపురు కొనడం చాలా మంచిది. ఎందుకంటే హిందూ సాంప్రదాయాలలో చీపురుని కూడా లక్ష్మీదేవితో సమానంగా పోల్చడం జరిగింది. ఇక అలాంటి చీపురును ధన్ తెరాస్ పండుగ రోజు కొనుగోలు చేసి తీసుకురావడం వలన ఐశ్వర్యం అదృష్టం కలిసి వస్తుందని తెలుస్తోంది. అలాగే ఈ ధన్ తెరాస్ పండుగ రోజు పేదవారికి చీపుర్లు చెప్పులు గొడుగులు వంటి వస్తువులు దానం చేయడం వలన అనేక నష్టాల నుండి బయటపడతారు. కావున ఈ ధన్ తెరాస్ పండుగ రోజు బంగారం మరియు వెండి కొనుగోలు చేయలేని వారు ఇలాంటి వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా అంతటి విశిష్టతను పొందవచ్చు.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.