Categories: DevotionalNews

Chanakya Niti : భ‌ర్త పొర‌పాటున కూడా భార్య‌తో ఈ 4 విష‌యాల‌ను పంచుకోవ‌ద్దు అంటున్న‌ చాణ‌క్య‌…

Advertisement
Advertisement

Chanakya Niti : ఆచార్య చాణ‌క్యుడు ర‌చించిన నీతి శాస్త్రం ఇప్ప‌టికి ఎంతోమంది అనుస‌రిస్తున్నారు. ఈ నీతి శాస్త్రం ప్ర‌తి మ‌నిషి మంచి మార్గంలో ముందుకు వెళ్లేలా సూచిస్తుంది. అయితే చాణ‌క్యుడు చెప్పిన దాని ప్ర‌కారం ఏ భ‌ర్త అయిన ఈ నాలుగు విష‌యాల‌ను జీవిత భాగ‌స్వామితో పంచుకోవ‌ద్దంట‌. భ‌ర్త భార్య‌కు ఎంత మంచి వాడ‌యిన భార్య‌తో కొన్ని విష‌యాల‌ను చెప్ప‌డం వ‌ల‌న బ‌ల‌హీనులు అవుతారు. క‌నుక మీరు ఎంత‌టి వారైన మీ జీవిత భాగ‌స్వామితో కొన్ని అంశాల‌ను వివ‌రించ‌కుండా ఉండ‌ట‌మే మంచిది. ఇలా చేయ‌డం మీ జీవితానికే శ్రేయ‌స్క‌రం. ఒక‌వేళ చెపితే ఇరువురి మ‌ధ్య అనేక స‌మ‌స్య‌లు త‌లెత్త‌వ‌చ్చు. అయితే ఆచార్య చాణ‌క్యుడు చెప్పిన దాని ప్ర‌కారం భ‌ర్త ఏ ఏ విష‌యాల‌ను భార్య‌తో పంచుకోకూడ‌దో ఇప్పుడు తెలుసుకుందాం…

Advertisement

1) చాణ‌క్య నీతి శాస్త్ర ప్ర‌కారం భ‌ర్త త‌న సంపాద‌న గురించి భార్య‌తో అస్స‌లు చెప్ప‌కూడ‌దు. మీ సంపాద‌న గురించి ఆమెకు తెలిస్తే దానిపై అధికారం పొంద‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది. అలాగే మీరు ప్ర‌తి దానికి ఎంత ఖ‌ర్చు పెడుతున్నారు అని ఆరాతీయ‌డం మొద‌లెడుతుంది. మీరు ఎక్క‌డికి వెళ్లినా మీ ఖ‌ర్చుల‌ను ఆప‌డానికి ప్ర‌య‌త్నం చేస్తూ ఉంటుంది. దీనివ‌ల‌న కొన్నిసార్లు ముఖ్య‌మైన ప‌నులు కూడా ఆగిపోతాయి. దీని కార‌ణం చేత ఈ విష‌యాన్ని భార్య‌తో ప్ర‌స్తావించ‌కుండా ఉండ‌ట‌మే మంచిది అని ఆచార్య చాణ‌క్యులు తెలిపారు.

Advertisement

Chanakya Niti spiritual speech about husband hidden these 4 things from his wife

2) మీరు ఎక్క‌డికైన వెళ్లిన‌ప్పుడు అక్క‌డ అవ‌మానానికి గురైతే దానిని ఒక గుణ పాఠంగా తీసుకోవాలి. అంతే కానీ ఎవ‌రితో చెప్ప‌వ‌ద్దు. ముఖ్యంగా భార్య‌తో ఈ విష‌యం గురించి ప్ర‌స్తావించ‌వ‌ద్దు. ఎందుకంటే అవ‌స‌రం అయిన‌ప్పుడు ఆ అవ‌మానాన్ని ప్ర‌స్తావిస్తూ మాట్లాడుతుంది. మిమ్మ‌ల్ని నిందించ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తుంది. క‌నుక మీరు ఎదుర్కొన్న అవ‌మానాల‌ను మీ భార్య‌తో ప్ర‌స్తావించ‌కూడ‌దు.

3) అలాగే దాన‌ధ‌ర్మాలు చేసేట‌ప్పుడు మీ భార్య‌కు చెప్ప‌కండి. దాన‌ధ‌ర్మాలను ర‌హ‌స్యంగా చేసిన‌ప్పుడే దానికి ప్రాముఖ్య‌త ఉంటుంది. మీరు ఎవ‌రికి అయిన విరాళం ఇస్తే అది మీ భార్య‌కు చెప్ప‌కండి. ఇలా చేయ‌డం వ‌ల‌న మీ భార్య దాతృత్వానికి చేసిన ఖ‌ర్చును ఉద‌హ‌రిస్తూ మీ మంచి చెడుల గురించి
ఎత్తి చూపుతారు. క‌నుక దాన‌ధ‌ర్మాలు చేసేట‌ప్పుడు మీ భార్య‌కు చెప్ప‌కండి.

4) భ‌ర్త‌కు దేని గురించి అయిన బ‌ల‌హీన‌త ఉంటే త‌న‌లోనే దాచుకోవాలి. మీలో బ‌ల‌హీన‌త‌ను మీ భార్య‌కు ఎట్టి ప‌రిస్థితుల్లో చెప్ప‌కండి. మీ బ‌ల‌హీన‌త గురించి మీ భార్య‌కు తెలిస్తే ఆమె ఏదైన విష‌యం గురించి మాట్లాడేట‌ప్పుడు మీ బ‌ల‌హీన‌త‌పై దాడి చేస్తుంది. క‌నుక భ‌ర్త త‌న బ‌ల‌హీన‌త‌ను గురించి ఎప్పుడైన స‌రే త‌న భార్య‌తో చెప్ప‌కూడ‌దు అని ఆచార్య చాణ‌క్యుడు తెలియ‌జేసాడు.

Advertisement

Recent Posts

TGSRTC : గ్రామీణ బ‌స్సుల‌కు TGSRTC డిజిటల్ చెల్లింపు వ్యవస్థ విస్త‌ర‌ణ‌..!

TGSRTC : రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపు వ్యవస్థను విస్తరిస్తూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) పల్లె వెలుగు…

49 mins ago

Banana : రోజుకు ఒక అరటి పండును తీసుకుంటే… శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా…!!

Banana : మనం ఆరోగ్యం కోసం రోజు ఎన్నో రకాల పండ్లను తింటూ ఉంటాం. వాటిలలో ఒకటి అరటిపండు. అయితే…

2 hours ago

Tulasi Plant : ఇంట్లో తులసి మొక్కను పెంచుతున్నారా… అయితే పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి…!

Tulasi Plant : హిందూమతంలో తులసి చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. తులసి చెట్టుని సకల దేవతల స్వరూపంగా కొలుస్తూ…

3 hours ago

Ginger Tea : అల్లం టీ ని ఎక్కువగా తాగుతున్నారా…. ఈ సమస్యలు తప్పవు…!!

Ginger Tea : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. అయితే ప్రతినిత్యం ఒక కప్పు టీ తాగకుండా ఉంటే…

4 hours ago

Revanth Reddy : ఎమ్మెల్యేల‌కి రేవంత్ రెడ్డి చుర‌క‌లు.. జాగ్ర‌త్త‌గా ప‌ని చేయాలంటూ హెచ్చ‌రిక‌..!

Revanth Reddy : రేవంత్ రెడ్డి తెలంగాణ‌లో అనేక మార్పులు చేర్పులు చేస్తూ అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. అయితే ప్ర‌తిపక్షాలు…

13 hours ago

Farmers : రైతుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం శుభ‌వార్త .. మ‌ద్ద‌తు ధ‌ర పెంపుతో ఎక‌రాకు రూ.10 వేలు పొందే అవ‌కాశం

Farmers : సూపర్‌ఫైన్ రకం వరి ఉత్పత్తి చేసే రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌గా చెల్లించాలని తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం…

14 hours ago

Hydra : గంట స‌మ‌యం ఇస్తే బాగుండేది.. ఎందుకు ఇలా ఆగం చేస్తున్నారు..!

Hydra : హైదరాబాదు పరిసరాలలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ఆక్రమణదారుల గుండెలలో హైడ్రా దడ పుట్టిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉంది.…

16 hours ago

This website uses cookies.