Home » Devotional » Chanakya Niti These Signs Point Towards The Money Problems
Devotional

Chanakya Niti : ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే… ఆర్థిక సమస్యలు మొదలైనట్లే అంటున్న చాణక్య…

Authored By
aruna
The Telugu News | Published on: August 23, 2022, 7:00 am
Advertisement

Chanakya Niti : ఆచార్య చాణక్యుడు రచించిన నీతి శాస్త్రాన్ని ఇప్పటికే ఎంతోమంది అనుసరిస్తున్నారు. ఒక వ్యక్తి తన జీవితంలో ఎటువంటి మార్గంలో వెళ్లాలి, ఎటువంటి నిర్ణయాలను తీసుకోవాలి మొదలగు విషయాలు ఈ నీతి శాస్త్రంలో తెలుపబడ్డాయి. ఆచార్య చాణక్యుడు వీటిని పాటిస్తే ఒక వ్యక్తి తప్పక జీవితంలో విజయాన్ని సాధించవచ్చు అని చెప్పారు. ఇంట్లో ఆర్థిక సమస్యలు రావడానికి వచ్చే కొన్ని సంకేతాలను గురించి కూడా చాణుక్యులు ప్రస్తావించారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1) ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం ఇంట్లో గొడవలు జరగటం మంచిది కాదు. గొడవలు జరిగితే ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు. దీనివలన ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఇంట్లోని కుటుంబీకులు ఎటువంటి గొడవలు లేకుండా హాయిగా, సంతోషంగా గడపాలి. 2) గాజు పగలడం చాలా అశుభం. ఇంట్లో పదేపదే గాజు పగిలి పోతే ఆ ఇంటి సభ్యులను ఆర్థిక సమస్యలు చుట్టూ ముడుతాయని అర్థం. అందువలన గాజు పగలడం ఆర్థిక సమస్యలను సూచిస్తుంది. కనుక ఇంట్లో గాజు పగలకుండా చూసుకోవాలి.

Chanakya Niti these signs point towards the money problems

Advertisement

3) ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం ఇల్లు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి. అలాగే పూజలు కూడా నిర్వహించాలి. దీని వలన ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. పూజలు చేయని ఇంట్లో లక్ష్మీదేవి నిలకడగా ఉండదు. కాబట్టి ప్రతిరోజు పూజలు చేయడం మంచిది. 4) మన ఇంట్లో తులసి మొక్క ఎండిపోవడం డబ్బు కొరతను సూచిస్తుంది. భవిష్యత్తులో రాబోయే ఇబ్బందులకు సంకేతం కూడా కావచ్చు. తులసి మొక్క ఎండిపోవడం మొదలుపెడితే రాబోయే కాలంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక తులసి చెట్టు ఎల్లప్పుడూ పచ్చగా ఉండేలా చూసుకోవాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి