Akshaya Tritiya : ఆడవారికి బంగారం అంటే ఎంత ఇష్టమో అందిరికి తెలిసిందే. బంగారు నగలు ధరించి ఎంతో మురిసిపోతుంటారు. బంధువులకు, ఫ్రెడ్స్ కి ఇతరులకు చూపించుకుంటూ గర్వంగా ఫీలవుతారు. ఆడవాళ్లు ఒక్కచోట చేరారంటే నువ్ ఎంత బంగారం వేసుకున్నావ్.. ఏ డిజైన్ వేసుకున్నావ్.. చాలా బాగుంది. అంటూ మాట్లాడుకుంటూ మురిసిపోతుంటారు. ఫంక్షన్స్, ఇతర ఈవెంట్లలో ఆడవాళ్లు భారీగా నగలు ధరించి సందడి చేస్తుంటారు. అందరికి చూపించుకుంటూ ప్రెస్టేజ్ గా ఫీలవుతుంటారు. చాలా మంది బంగారాన్ని ధరించడాన్ని సాంప్రదాయంగా భావిస్తారు. అందుకు మంచి రోజు చూసి కొనడానికి ఇష్టపడతారు. అక్షయ తృతీయ. అనగానే.. బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే అక్షయ తృతీయ శుభకరమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున బంగారం కొంటే చాలా మంచిదని విశ్వసిస్తుంటారు.
అక్షయ తృతీయ రోజున ఏం కొంటే అది రెట్టింపు అవుతుందని చాలా మంది నమ్మకం. అక్షయ తృతీయ శ్రీ మహా విష్ణువుకు మరియు మహాలక్ష్మీ అమ్మవారికి సంబంధించిన పర్వదినం. అందుకే లక్ష్మీ స్వరూపమైన స్వర్ణాన్ని, అంటే బంగారాన్ని కొంటారు. ఈ రోజున కేవలం బంగారం మాత్రమే కాదు ఏదైనా కొనవచ్చు. అక్షయ తృతీయ వైశాఖ మాసం శుక్ల పక్షం రోజున శ్రీ మహా విష్ణువును పూజిస్తారు. ఈ రోజున రాహుకాలం, వర్జ్యంతో సంబంధం లేకుండా ఏ సమయంలోనైనా ఎటువంటి శుభాకార్యాన్నైనా జరుపుకోవచ్చని పండితులు చెబుతారు. అందుకే ఈ రోజు బంగారం, నూతన వస్త్రాలు, స్థిరాస్తులు, కార్లు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.
అందుకే అక్షయ తృతీయ రాగానే జ్యుయెలరీ మాల్స్ కిటకిటలాడుతుంటాయి. ఈ రోజు బంగారానికి భారీ డిమాండ్ ఉంటుంది. ఈ యేడాది మే 03న అక్షయ తృతీయ రాబోతుంది. ఈ రోజు బంగారం, వెండి, ఇతర ఐశ్వర్యం కొంటే వృద్ధి ఉంటుందని.. ఎప్పటికీ తరిగిపోవని నమ్ముతుంటారు.మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్షయ తృతీయ రోజున బంగారం విపరీతంగా కొనుగోలు చేస్తుంటారు. అలాగే రాజస్ఠాన్, మహారాష్ట్ర వంటి మరికొన్ని రాష్ట్రాల్లో కూడా బంగారం కొనడానికి ఆసక్తి చూపిస్తారు. కాగా అక్షయ తృతీయ మే 3న ఉదయం 05.18 నుంచి ప్రారంభం కానున్నట్లు పండితులు చెబుతున్నారు. ఇది మే 4 ఉదయం 7.32 వరకు కూడా కొనసాగనున్నట్లు చెబుతున్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.