Kajal : కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం ఆచార్య. మెగా స్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 29న ఆచార్య గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. శనివారం రోజు హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసక్తికర విషయాలు తెలియజేశారు. అయితే కాజల్ గురించి ఎవరు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అంతేకాదు ట్రైలర్‌లోను కాజల్ సీన్స్ ఒక్కటి లేవు. దీంతో అందరిలో అనేక అనుమానాలు మొదలయ్యాయి.
ఏం జరిగిందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలో దర్శకుడు కొరటాల శివ స్పందించారు.కాజల్ లాంటి స్టార్ హీరోయిన్ ని ఆ పాత్రకు ఫిట్ చేయడం సరైనది కాదు అనిపించింది. కాబట్టి ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకుంది. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి గారే కాజల్ ని ఈ విషయంలో ఒప్పించారు. దీనితో కాజల్ ఎలాంటి అసంతృప్తి లేకుండా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది అని కొరటాల అన్నారు. కాజల్ ఆచార్య చిత్రంలోని లాహే లాహే సాంగ్ లో కూడా కనిపించిన సంగతి తెలిసిందే. అలాగే ఆచార్య చిత్రంలో చిరంజీవి పాత్రకు హీరోయిన్ ఉండరు అని కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ కి కొంత మేర నిరాశ తప్పదు.
సో చిరుకి ఏ చిత్రంలో రొమాన్స్ ఉండదు. కానీ యాక్షన్, డాన్సుల్లో మాత్రం చిరంజీవి ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు.మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీని ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. కాగా, కాజల్ చందమామ సినిమాలో మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా, మగధీరలో రామ్ చరణ్ హీరోయిన్ మిత్రవిందగా.. సర్ధార్ గబ్బర్ సింగ్‌లో పవన్ కథానాయికగా, బన్నీతో ఆర్య 2, ఇక ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరుకు కాజల్ మంచి హిట్ ఇచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీకి ఈ భామ లక్కీగా మారింది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.