Akshaya Tritiya : ఈ రోజు బంగారం కొంటే.. ఆ సంప‌ద ఎప్ప‌టికీ మీ సొంతం.. అదే అక్ష‌య తృతీయ‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Akshaya Tritiya : ఈ రోజు బంగారం కొంటే.. ఆ సంప‌ద ఎప్ప‌టికీ మీ సొంతం.. అదే అక్ష‌య తృతీయ‌

 Authored By mallesh | The Telugu News | Updated on :25 April 2022,4:00 pm

Akshaya Tritiya : ఆడ‌వారికి బంగారం అంటే ఎంత ఇష్ట‌మో అందిరికి తెలిసిందే. బంగారు న‌గ‌లు ధ‌రించి ఎంతో మురిసిపోతుంటారు. బంధువుల‌కు, ఫ్రెడ్స్ కి ఇత‌రుల‌కు చూపించుకుంటూ గ‌ర్వంగా ఫీల‌వుతారు. ఆడ‌వాళ్లు ఒక్క‌చోట చేరారంటే నువ్ ఎంత బంగారం వేసుకున్నావ్.. ఏ డిజైన్ వేసుకున్నావ్.. చాలా బాగుంది. అంటూ మాట్లాడుకుంటూ మురిసిపోతుంటారు. ఫంక్ష‌న్స్, ఇత‌ర ఈవెంట్ల‌లో ఆడ‌వాళ్లు భారీగా న‌గ‌లు ధ‌రించి సంద‌డి చేస్తుంటారు. అంద‌రికి చూపించుకుంటూ ప్రెస్టేజ్ గా ఫీల‌వుతుంటారు. చాలా మంది బంగారాన్ని ధ‌రించడాన్ని సాంప్ర‌దాయంగా భావిస్తారు. అందుకు మంచి రోజు చూసి కొన‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. అక్షయ తృతీయ. అనగానే.. బంగారం కొనుగోలు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తారు. ఎందుకంటే అక్ష‌య తృతీయ శుభకరమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున బంగారం కొంటే చాలా మంచిదని విశ్వసిస్తుంటారు.

అక్షయ తృతీయ రోజున‌ ఏం కొంటే అది రెట్టింపు అవుతుందని చాలా మంది నమ్మకం. అక్షయ తృతీయ శ్రీ మహా విష్ణువుకు మరియు మహాలక్ష్మీ అమ్మవారికి సంబంధించిన పర్వదినం. అందుకే లక్ష్మీ స్వరూపమైన స్వర్ణాన్ని, అంటే బంగారాన్ని కొంటారు. ఈ రోజున కేవలం బంగారం మాత్రమే కాదు ఏదైనా కొనవచ్చు. అక్షయ తృతీయ వైశాఖ మాసం శుక్ల ప‌క్షం రోజున శ్రీ మహా విష్ణువును పూజిస్తారు. ఈ రోజున రాహుకాలం, వర్జ్యంతో సంబంధం లేకుండా ఏ సమయంలోనైనా ఎటువంటి శుభాకార్యాన్నైనా జరుపుకోవచ్చని పండితులు చెబుతారు. అందుకే ఈ రోజు బంగారం, నూత‌న వ‌స్త్రాలు, స్థిరాస్తులు, కార్లు ఎక్కువ‌గా కొనుగోలు చేస్తారు.

devotees believe that buying gold and silver on akshaya tritiya festival

devotees believe that buying gold and silver on akshaya tritiya festival

అందుకే అక్షయ తృతీయ రాగానే జ్యుయెలరీ మాల్స్ కిటకిటలాడుతుంటాయి. ఈ రోజు బంగారానికి భారీ డిమాండ్ ఉంటుంది. ఈ యేడాది మే 03న అక్ష‌య తృతీయ రాబోతుంది. ఈ రోజు బంగారం, వెండి, ఇత‌ర ఐశ్వ‌ర్యం కొంటే వృద్ధి ఉంటుంద‌ని.. ఎప్ప‌టికీ త‌రిగిపోవ‌ని న‌మ్ముతుంటారు.మ‌న తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్ష‌య తృతీయ రోజున‌ బంగారం విప‌రీతంగా కొనుగోలు చేస్తుంటారు. అలాగే రాజ‌స్ఠాన్, మ‌హారాష్ట్ర వంటి మ‌రికొన్ని రాష్ట్రాల్లో కూడా బంగారం కొన‌డానికి ఆస‌క్తి చూపిస్తారు. కాగా అక్ష‌య తృతీయ మే 3న ఉద‌యం 05.18 నుంచి ప్రారంభం కానున్న‌ట్లు పండితులు చెబుతున్నారు. ఇది మే 4 ఉద‌యం 7.32 వ‌ర‌కు కూడా కొన‌సాగ‌నున్న‌ట్లు చెబుతున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది