do these things to get money always
ధనం.. ప్రపంచమంతా ధనంతో నడుస్తుంది అనడంలో సందేహం లేదు. ధనం కోసం అందరూ శ్రమిస్తారు. కానీ కొందరికే ధనం ఎక్కువగా వస్తుంది. మిగిలినవారు ఎంత శ్రమించినా ఆశించిన స్థాయిలో ధనం రాదు. అందరికీ ధనం ప్రవాహం కావాలంటే పెద్దలు చెప్పిన పరిహారాలు పాటించాలి. దీనికి తేలికైన సిద్ధి ఉపాయాన్ని తెలుసుకుందాం… సిద్ది ఉపాయం అంటే ఏదైతే ఖచ్చితమైన ఫలితం ఉంటుందో దాన్ని సిద్ది ఉపాయం అంటారు. ఏదైనా సంపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేస్తే వచ్చేదే ఫలితం. దీన్ని ఎవరైనా చేయవచ్చు. ఆఫీసులో ఉన్నా, వ్యాపారస్తులుచ గృహాలలోను ఎవరైనా చేయవచ్చు. ఆడవారు, మగవారు ఎవరైనా చేయవచ్చు. ఎలాంటి నిబంధనలు లేవు. ఇది చేసేవారు ఇలాంటి మంత్రాన్నికానీ, పూజను కానీ, జపాన్ని చేయనవసరం లేదు. ఇంట్లో ఉండే పదార్థాలతో దీనిని చేయవచ్చు. ఈ ఉపాయం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. దీనివల్ల వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు కాకుండా నిలకడ ఉంటుంది. ఉపాయం వల్ల డబ్బులు పొదుపు చేసే మార్గం కనబడుతుంది. ధన లాభం పెరుగుతుంది. అతి ముఖ్యమైన విషయం మానసిక ప్రశాంతత పొందుతారు.
do these things to get money always
ఒక గాజు సీసా తీసుకుని ఒక పిన్నిసు తీసుకోండి, పంచదారను, బియ్యాన్ని, ఉప్పు, మెత్తటి ఉప్పు లేదా గళ్ళు పు ఏదైనా సరే ఈ సిద్ధి ఉపాయానికి ఈ 5 వస్తువులు తప్పక అవసరం. ఈ పని శనివారం రోజైనా శుక్రవారం రోజైనా బుధవారం రోజు అయినా చేయవచ్చు. ఉదయం ఈ మూడు రోజులలో ఏ రోజైనా చేయవచ్చు. ఈ పనిని ఈ మూడు రోజుల్లో తెల్లవారుజామున స్నానం చేసిన అప్పటి నుంచి ఆ రోజు సాయంత్రం 5లోపు పూర్తి చేయాలి బియ్యాన్ని పంచదారను, ఉప్పును సరిసమానంగా తీసుకోవాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ తీసుకోకూడదు. కింద నేల మీద ఏదైనా ఆసనం వేసుకొని తూర్పువైపు ముఖాన్ని పెట్టి ఆ గాజు సీసా తీసుకుని దాన్ని శుభ్రం చేసుకొని ఆ గాజు సీసా లో మొదట పిడికెడు బియ్యాన్ని తర్వాత పిడికెడు పంచదారను, తర్వాత పిడికెడు ఉప్పును వేయండి. ఆ తర్వాత పిన్నసును తీసుకొని దాని తెరవండి. దాన్ని ఆ గాజుసీసాలో ఆ పదార్థాల మీద కుచ్చండి. ఆ తర్వాత ఆ గాజు సీసా మీద మూతను పెట్టండి దాన్ని తీసుకొని వంట రూమ్ లో వంట చేసే వైపు ఉత్తరం వైపు పెట్టుకోండి. వ్యాపారస్తులు అయినా దుకాణాల్లో కూడా ఉత్తరం వైపు ఈ గాజు సీసాను పెట్టుకోవాలి. ఆఫీసులో కూడా మీరు కూర్చున్న దగ్గర ఉత్తరం వైపు ఈ గాజు సీసాను పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత మాసానికి అంటే నెలరోజులకు ఒక సారి ఈ గాజుసీసాలో పదార్థాన్ని మార్చి శుభ్రం చేసి తిరిగి మళ్ళీ పెట్టుకోవచ్చు. ఆ మార్చిన దానిని మీ ఇంటి ఆవరణ చెట్ల పొదల్లో వేయవచ్చు. పిన్నీసును చిన్న గుంత తీసి ఆ గుంటలో పాత పెట్టండి. ఆ తర్వాత ఆ గాజు సీసా శుభ్రం చేసి మళ్లీ మూడు పదార్థాలను సమానంగా తీసుకొని శనివారము, శుక్రవారము లేదా బుధవారము మళ్లీ ఎప్పట్లాగే మొదలు పెట్టవచ్చు. నెలకోసారి ఈ ఉపాయం చేయడంవల్ల డబ్బు సమస్యల నుంచి బయటపడతారు, రాబడి పెరుగుతుంది. అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యంగా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఏ పని చేసిన నమ్మకంతో చేయడంవల్ల అంతా బాగుంటుంది. ఇది ఖర్చులేని అతి సులభమైన పని దీన్ని మీరు ఆచరించి కొన్నినెలలో మీలో వచ్చిన మార్పును గమనించండి. భక్తి, శ్రద్ధలతో దీన్ని ఆచరించండి.
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
This website uses cookies.