Wife : కొత్తగా పెళ్లయిన భార్య భర్తలు ఇద్దరూ పెళ్లి అయిన కొన్నాళ్లపాటు హ్యాపీగానే ఉంటారు. ఆ తర్వాత కాలం గడుస్తున్న కొద్ది ఇద్దరి వైవాహిక జీవితంలో మనస్పర్ధలు గొడవలు అనేవి సహజంగా వస్తుంటాయి. ఇలాంటి సమయంలోనే వారి జీవితం అనేది బోర్ కొడుతుంది. అలాంటప్పుడు భార్యను ఎల్లప్పుడూ హ్యాపీగా ఉంచేందుకు భర్తలు ఈ పనులు చేస్తే చాలని ఎప్పుడో పురాణాలలో ఆచార్య చాణక్యుడు తెలియజేశాడు. వైవాహిక జీవితాన్ని బలోపేతం చేసేందుకు అనేక రకాల సూత్రాలను తెలిపాడు. చాణక్యుడు తెలియజేసిన ఈ సూత్రాలను పాటించినట్లయితే భార్య భర్తల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా వారి వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. మరి చాణక్యుడు చెప్పిన ఆ సూత్రాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
పెళ్లయిన తర్వాత కొంతకాలం భార్యతో గడిపిన తర్వాత వారిపై గౌరవం అనేది తగ్గుతుంది. కానీ పెళ్లయిన కొత్తలో ఎలా అయితే భార్యను గౌరవంగా చూసేవారో అలాగే జీవితమంతా తన భార్యను గౌరవంగా చూసే వ్యక్తి తన వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయగలడని తెలియజేయడం జరిగింది. అంతేకాక భార్యను గౌరవంగా చూసిన వ్యక్తి తిరిగి అదే గౌరవాన్ని పొందుతాడని చాణక్యుడు తెలిపాడు.
భార్యాభర్తలు ఇద్దరు స్నేహితుల్లా జీవించడం అనేది వారి యొక్క దాంపత్య జీవితాన్ని ఆనందంగా ఉంచుతుందని చాణుక్యుడు పేర్కొన్నాడు. మంచి చెడు సమయాలలో ఒకరికి ఒకరు తోడుగా నిలుస్తూ ఒకరి కష్టసుఖాలను మరొకరు అర్థం చేసుకుంటూ స్నేహితులాగా జీవించే వారి యొక్క వైవాహిక జీవితం బలంగా ఉంటుంది.
సమానత్వం…
కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు కూడా సమానం. భర్త భార్యను సమానంగా చూస్తే ఆమె ఎంతో సంతోషంగా ఉంటుంది. అలా కాదని వారిపై అధిపత్యం చలాఇస్తూ నేనే ఎక్కువ నువ్వు తక్కువ అనే మాటలు మాట్లాడితే వారి వైవాహిక జీవితం బలంగా ఉండదు. కావున ఇద్దరు ప్రతి విషయాన్ని చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
సురక్షిత భావం…
తన భాగస్వామితో భార్య సురక్షితంగా ఉన్నాను అని నమ్మాలి అని చానికుడు తెలియజేయడం జరిగింది. అప్పుడే ఆ బంధం బాగుంటుందని అలాంటి సమయంలో భార్య తన భర్తలో తన తండ్రిని చూసుకుంటుందని చాణక్యుడు తెలియజేయడం జరిగింది.
నిజాయితీగా వ్యవహరించండి…
చాణక్య నీతి ప్రకారం ప్రతి ఒక్కరి వైవాహిక జీవితంలో నిజాయితీ అనేది చాలా ముఖ్యం. నిజాయితీగా ఉంటేనే బంధం అనేది బలంగా ఉంటుంది. కావున మీరు మీ వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడపాలంటే మీ భార్యతో ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండండి.
శారీరక ఆనందం…
చాణక్యుడు సూత్రాల ప్రకారం వైవాహిక జీవితం సంతోషకరంగా సాగాలి అంటే శారీరక సంతృప్తి కూడా చాలా ముఖ్యం. కాబట్టి భర్త తన భాగస్వామి యొక్క మానసిక శారీరక ఆనందంలో దృష్టి పెట్టడం మంచిది.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.