Home » Devotional » Do You Keep Idols Of These Gods Together In Your Puja Room
Devotional

Vastu Tips : మీ పూజ గదిలో ఈ దేవుళ్ళ విగ్రహాలను కలిపి పెడుతున్నారా…. వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది…?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: July 17, 2025 7:50 pm
Advertisement

Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పెట్టే వస్తువులు అయినా,దేవుని విగ్రహాలైనా సరే వీటి విషయంలో చాలా జాగ్రత్తగా పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే, వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులైన దేవుళ్ళ విగ్రహాలలో తప్పులు చేసిన ఆ ప్రభావం ఇంటిలో ఉంటుంది. దీనివల్ల ప్రతికూల శక్తులు ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. వాస్తు శాస్త్రం ప్రకారం పూజగది అంటే ఎంతో పవిత్రమైన స్థలం. స్థలంలో దేవతా విగ్రహాలను పెట్టి పూజించడం శుభప్రదం. అయితే కొన్ని దేవతలు దేవుళ్లకు సంబంధించిన చిత్రపటాలు పెట్టుకోవడం అశుభంకరం. ఏ రకమైన దేవుళ్ల విగ్రహాలను లేదా పటాలను మీ పూజ గదిలో పెట్టుకోకూడదు వివరంగా తెలుసుకుందాం.

Advertisement

Vastu Tips : మీ పూజ గదిలో ఈ దేవుళ్ళ విగ్రహాలను కలిపి పెడుతున్నారా…. వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది…?

వాస్తు శాస్త్రం ప్రకారం పూజగది ఎంతో పవిత్రమైనది. ఎప్పుడూ కూడా పూజ గది శుభ్రంగా ఉండాలి. అంతే కాదు, కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం చాలా ముఖ్యం. చాలామంది తెలిసి తెలియక పూజ గదిలో ఇలాంటి దేవుళ్లను లేదా దేవతల విగ్రహాలను పెట్టే విషయాలలో వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని పాటించడం వల్ల ఇంట్లో సానుకూల శుద్ధి వస్తుందని నమ్ముతారు. లేకుంటే ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయి. దానివల్ల మీ ఇంట్లో సమస్యలను సృష్టిస్తుంది.

Advertisement

Vastu Tips వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎలాంటి దేవుళ్ళను పూజ గదిలో ఉంచాలి

వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో పూజ స్థలం చాలా పవిత్రమైనది. మందిరం ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో శ్రీకృష్ణుడు,రాధా రాణి విగ్రహాలను కలిపి ఉంచడం శుభప్రదం. మరికొన్ని దేవుళ్ళ విగ్రహాలను కలిపి ఉంచడం వల్ల అశుభానికి దారితీస్తుంది అంటున్నారు నిపుణులు. ఏ దేవతల విగ్రహాలను, మీ ఇంట్లో ఉన్న దేవుళ్ళ ఫోటోలతో కలిపి ఉంచకూడదు తెలుసుకుందాం. శాస్త్రం ప్రకారం విష్ణువు శివలింగానికి కలిపి పూజ గదిలో ఎప్పుడూ ఉంచకూడదు. ఎందుకంటే రెండిటిని పూజించే పద్ధతి భిన్నంగా ఉంటుంది.విష్ణువు శివలింగాన్ని కలిపి ఉంచడం వల్ల శుభ ఫలితాలు కంటే ఎక్కువ అశుభ ఫలితాలు కలుగుతాయి. పొరపాటున అయినా కూడా పూజ గదిలో బ్రహ్మ, విష్ణు,మహేశ్వరుల విగ్రహాలను కలిపి ఉంచవద్దు. త్రిమూర్తులు ఉన్న ఫోటోలు కూడా పెట్టుకోవద్దు. వాస్తు శాస్త్రం ప్రకారం మరణించిన బంధువుల ఫోటోలు లేదా విగ్రహాలను పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచకూడదు. ఇంకా,కాళికాదేవి శనీశ్వరుడు రాహువు, కేతు వంటి పటాలను పూజ గదిలో అస్సలు ఉంచకూడదు.ఎందుకంటే, ఈ దేవతలందరూ ఉగ్ర స్వరూపాన్ని కలిగి ఉంటారు.వీరికి ప్రత్యేక తాంత్రిక ఆచారాల ద్వారా పూజిస్తారు.అంతేకాదు, ఆగ్రహంతో ఉండే అమ్మవారి విగ్రహం లేదా, ఉగ్రరూపంలో ఉన్న దేవత విగ్రహాన్ని పూజ గదిలో ఉంచకూడదు. సానుకూల శక్తి కోసం విగ్రహాలను సంతోషకరమైన ఆశీర్వదించిన మాత్రమే శుభప్రదంగా పరిగణించబడుతుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి