Categories: NewsTelangana

Kavitha : రేవంత్ నిర్ణ‌యానికి  జై కొట్టిన కవిత.. ఆ విషయంలో బీఆర్‌ఎస్‌పై తీవ్ర అసంతృప్తి..!

Kavitha  : తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. గత కొంతకాలంగా ఆమె పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలంగా కనిపించకపోవడం, తన అభిప్రాయాలకు ప్రాధాన్యత లేకపోవడం వంటి కారణాలతో కవిత పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కి ఆమె మద్దతు తెలపడం, అదే సమయంలో బీఆర్ఎస్ నేతల వైఖరిని విమర్శించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Kavitha : రేవంత్ నిర్ణ‌యానికి  జై కొట్టిన కవిత.. ఆ విషయంలో బీఆర్‌ఎస్‌పై తీవ్ర అసంతృప్తి..!

Kavitha  రేవంత్ సర్కార్ కరెక్టేనంటూ కవిత కామెంట్స్..

తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కి బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నారు. కానీ కవిత మాత్రం దీన్ని సమర్థిస్తూ, న్యాయబద్ధమైన నిర్ణయంగా అభివర్ణించారు. ఆమె వ్యాఖ్యల ప్రకారం చట్టసవరణ చేసి తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను న్యాయనిపుణులతో చర్చించిన తర్వాతే మద్దతు తెలిపానని చెప్పారు. ఇక బిఆర్ ఎస్ నేతలు ఎప్పటికైనా నా కాళ్లవద్దకు రావాల్సిందే అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు.

Kavitha  ఆ విషయంలో బీఆర్‌ఎస్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కవిత

కవిత చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఆమెలో బీఆర్ఎస్ పార్టీపై నెలకొన్న అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమె పేరు సంబంధితంగా మీడియా లోపల బయట వినిపించడమే కాకుండా, అరెస్టు తర్వాత పార్టీ నుండి తగిన మద్దతు లేకపోవడం, పార్టీ కార్యక్రమాల్లో ఆమె పాత్ర తగ్గిపోవడం వంటి అంశాలు కవితను అసంతృప్తికి గురిచేశాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇవన్నీ ఆమెను బహిరంగ వ్యాఖ్యలకు ప్రేరేపించిన కారణాలుగా చెబుతున్నారు.

తనను బలపర్చే కార్యక్రమాల్ని స్వయంగా ప్రారంభించి, బీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కవిత నిజానికి పార్టీకి మేలు చేస్తున్నారా? లేక రాజకీయంగా నష్టాన్ని కలిగిస్తున్నారా? అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. పార్టీ అంతర్గత విషయాలపై బహిరంగంగా వ్యాఖ్యానించడం కేసీఆర్ నేతృత్వంపై కవితకు భరోసా లేకపోవడాన్ని సూచిస్తున్నదా? అనే అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తీన్మార్ మల్లన్న ఆరోపణలపై బీఆర్ఎస్ నేతలు స్పందించకపోవడాన్ని ‘వారి విజ్ఞతకే వదిలేస్తున్నా’ అన్న కవిత వ్యాఖ్యలతో ఆమె అసహనం మరోసారి బహిర్గతమైంది.

Recent Posts

Junior Movie Review : జూనియ‌ర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Junior Movie Review  : 'కిరీటి రెడ్డి'..  Kireeti  sreeleela నిన్న మొన్నటి వరకూ అయితే ఈ పేరు పెద్దగా…

3 minutes ago

Pregnant Women : నేరేడు పండ్లను… గర్భిణీ స్త్రీలు తిన్నారంటే ఇదే జరుగుతుంది…?

Pregnant Women : ప్రకృతి ప్రసాదించిన పండ్లలో నేరేడు పండు కూడా ఒకటి. ఇది సీజనల్ పండు. ఇది వేసవికాలం…

20 minutes ago

Gas Cylinder : ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ విధానంలో కీలక మార్పు తీసుకొచ్చిన సర్కార్..!

Gas Cylinder : ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక భారం తగ్గించేందుకు దీపం 2 పథకం లో ఒక…

1 hour ago

Home Remedies : మీ కళ్ళ కింద నల్లటి వలయాలు ఉన్నాయని చింతిస్తున్నారా… వీటితో మటుమాయం…?

Home Remedies : ఈ రోజుల్లో చాలామందికి కంటికి నిద్ర లేకపోవడం వలన, కొన్ని జీవనశైలిలో మార్పులు వలన, కళ్ళ…

2 hours ago

Vastu Tips : మీ పూజ గదిలో ఈ దేవుళ్ళ విగ్రహాలను కలిపి పెడుతున్నారా…. వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది…?

Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పెట్టే వస్తువులు అయినా,దేవుని విగ్రహాలైనా సరే వీటి విషయంలో చాలా…

4 hours ago

Tripathi : ఇందిరమ్మ ఇండ్లు ఎంపిక నిర్మాణంలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవు : నల్లగొండ జిల్లా కలెక్టర్

Tripathi  : ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నల్గొండ జిల్లా స్థాయి మొదలుకొని గ్రామ స్థాయి వరకు అధికారులు,సిబ్బంది ఎలాంటి విమర్శలు,ఆరోపణలకు…

11 hours ago

Vajresh Yadav : ఇందిరమ్మ రాజ్యంలో నెరవేరిన పేదల సొంతింటి కల వజ్రేష్ యాదవ్

Vajresh Yadav : ఇందిరమ్మ రాజ్యంలోనే పేదల సొంతింటి కల నెరవేరుతుందని మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తోటకూర…

12 hours ago

Venkatesh : విక్ట‌రీ వెంక‌టేష్ కోసం ఫుల్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్ .. ‘అబ్బాయి గారు 60+’ టైటిల్‌ ఫిక్స్!

Venkatesh  : టాలీవుడ్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ కోసం మరో వినోదభరితమైన సినిమా కథ సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే హ్యూమ‌ర్‌కి సిగ్నేచ‌ర్‌…

13 hours ago