Silver Elephant : వెండి ఏనుగు ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా..? ఇక్కడ మాత్రం అస్సలు ఉంచకండి
Silver Elephant : చాలా మంది వాస్తు, జోతిష్య శాస్త్రాలను ఎక్కువగా నమ్ముతుంటారు. ఏ పని చేయాలన్నా అన్ని విషయాలు తెలుసుకుని చేస్తుంటారు. ఇంట్లో ఏది ఎక్కడ ఉండాలన్నా వాస్తు శాస్త్రాన్ని అడిగి తెలుసుకుని నిర్మాణం చేపడతారు. అలాగే ఆర్థిక ఇబ్బందులు, వృత్తిపరంగా నష్టాలు చికాకులు వంటివి కూడా ఇంట్లో వాస్తు ప్రభావం వల్ల కూడా సంభవిస్తాయని నమ్ముతుంటారు. అలాగే ఏది ఎక్కడా ఉండాలో అక్కడ ఉంచనట్లైతే అనారోగ్య సమస్యలు, అరిష్టాలు జరుగుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నాజరు. అలాగే జ్యోతిష్య శాస్త్రం కూడా కొందరు బలంగా నమ్ముతారు.
జోతిష్య నిపుణులు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు.అలాగే పలు వస్తువులను ఇంట్లో తెచ్చిపెట్టుకుంటారు.చాలా మంది ఇళ్లలో గణేషుడి విగ్రహం, వెండి ఏనుగు వంటివి పెట్టుకుంటారు. ఇలా పెట్టుకోవడం వల్ల ఇంట్లో ప్రశాంత వాతావరణం, సుఖ శాంతులు, లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చెబుతున్నారు. కాగా వెండి ఏనుగు విగ్రహం ఎందుకు పెట్టుకోవాలి.. ఇంట్లోని ఏ ప్లేస్ లో పెట్టాలని అనే విషయాలు వాస్తు శాస్త్రం ప్రకారం ఇప్పుడు తెలుసుకుందాం…ఏనుగు అనేది బుద్ధ భగవానుడు, గణేశుడికి ప్రతీక. వెండి ఏనుగు విగ్రహాలను ఇంట్లో పెట్టుకుంటే వారికి అదృష్టం వరిస్తుంది.
భార్యభర్తలు, తల్లిదండ్రులు, పిల్లల మధ్య సంబంధాలు మెరుగవుతాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఏనుగును ఇంట్లో తూర్పు దిశలో ఏర్పాటు చేసుకోవాలి. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు లేకుండా ఉండాలంటే జంట ఏనుగుల విగ్రహాలను ఇంట్లో ఉంచుకోవాలి. తల్లీ, పిల్లల బంధం బలంగా ఉండాలంటే తల్లి ఏనుగు, పిల్ల ఏనుగు విగ్రహాలను గదులలో పెట్టుకోవాలి.అలాగే ఇంటి ముందు గాని మెయిన్ డోర్ ముందు గాని రెండు ఏనుగుల విగ్రహాలు ప్రతిష్టించాలి. ఇలా చేస్తే ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాకుండా ఆపేస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.