Diwali : దీపావళి పండుగ అంటే మనలోని అజ్ఞానం పోయి జ్ఞాన జ్యోతిని వెలిగించడం. అదే దీపావళి పండుగ. నరక చతుర్దశి నాడు యమ ప్రీతికై పూజలు చేసి దీపాలను వెలిగించాలి. అలా చేస్తే పితృదేవతలు స్వర్గానికి చేరుతారు. దీపావళి రోజు పితృదేవతలు సంధ్య సమయాన ఆకాశంలో దక్షిణ దిక్కుగా వచ్చి తమ సంతానాల గృహాలను చూస్తారట. వారికి దారి కనిపించడం కోసమే దివ్వెలు కొట్టే సాంప్రదాయం ఏర్పడింది. పెద్దవారు పిల్లలతో ఈ దివిటీని కొట్టిస్తారు. పొడుగాటి గోంగూర కాడలకు నూనెతో తడిపిన బట్ట వత్తులు కట్టి వాటిని పిల్లల చేతులకిచ్చి వారిని వీరి గుమ్మం ముందు నిలబెట్టి దివిటీలను వెలిగించి ఆకాశంలో దక్షిణ వైపుకి చూపిస్తూ గుండ్రంగా మూడుసార్లు తిప్పుతారు.
దివిటీని నేలకు వేసి కొట్టిస్తూ దుబ్బు దుబ్బు దీపావళి మళ్లీ వచ్చే నాగులచవితి అని అనిపిస్తారు. ఆ తర్వాత ఆ కాడలను ఒక పక్కగా పడేస్తారు. పిల్లల కాళ్లు, చేతులు కడిగి కళ్ళు తడి చేతితో తూడిచి నోరు పుక్కిలించి శుభ్రం చేసుకోమని చెబుతారు. ఆ తర్వాత పిల్లలకు నోట్లో మిఠాయిలు పెట్టి తినిపిస్తారు. ఆ తర్వాత ఇంట్లోని అందరూ టపాకాయలు కాలుస్తారు. బాణాసంచా కాల్చటం లాంటి సంబరాలు పూర్తయ్యాక అర్ధరాత్రి దాటాక ఇల్లు వాకిళ్లను తుడుచుకోవాలి అని ధర్మ శాస్త్రం చెబుతోంది. పండుగ నాడు ఇంటి గుమ్మాలకు మావిడాకులు, తోరణాలు, బంతిపూల మాలలు కడతారు. పెద్ద పెద్ద ముగ్గులు వేసి మధ్యలో పసుపు కుంకుమలతో పూలతో అలంకరించి దీపాలు పెడతారు. దేవుని దగ్గర, తులసి కోట దగ్గర ఇంటి గుమ్మాలకి ఇరువైపులా దీపపు ప్రమిదలు పెడతారు.
మట్టి ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి వేసి ఒత్తులు వేసి వెలిగించిన తరువాత దీపాలను వరుసగా ఇంటి ముందర పిట్టగోడల మీద డాబాల మీద పెడతారు. కొన్ని ప్రాంతాలలో బాణాసంచా కాల్చి ఇంట్లోకి వచ్చాక ఆడవాళ్ళందరూ కలిసి చేటలు పళ్ళాలు వాయిస్తారు. అది దరిద్ర దేవత తరిమివేసినట్లు అవుతుంది. దీపావళి పండుగ ముందు అనేక రకాలైన మిఠాయిలు చేసుకొని దీపావళి నాడు ఇంట్లో వండిన పులిహోర, పరమాన్నం, గారెలు, బూరెలు లాంటివి ఇరుగుపొరుగు వారికి ఇచ్చి బంధువులతో కలిసి భోజనం చేస్తాం. దీపావళి పండుగకు రెండు రోజుల ముందు ధన త్రయోదశిని తర్వాత నరక చతుర్దశి అమావాస్య రోజు దీపావళి, ఆ తర్వాత రోజు బలిపాడ్యమి, ఆ మరుసటి రోజు భగిని హస్తభోజనం లేక యమ ద్వితీయ అని వరుసగా ఐదు రోజుల పండుగను చేసుకుంటాం.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.