Diwali : దీపావళి రోజున పెద్దవారు పిల్లలతో దివిటిని ఎందుకు కొట్టిస్తారో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Diwali : దీపావళి రోజున పెద్దవారు పిల్లలతో దివిటిని ఎందుకు కొట్టిస్తారో తెలుసా…?

Diwali : దీపావళి పండుగ అంటే మనలోని అజ్ఞానం పోయి జ్ఞాన జ్యోతిని వెలిగించడం. అదే దీపావళి పండుగ. నరక చతుర్దశి నాడు యమ ప్రీతికై పూజలు చేసి దీపాలను వెలిగించాలి. అలా చేస్తే పితృదేవతలు స్వర్గానికి చేరుతారు. దీపావళి రోజు పితృదేవతలు సంధ్య సమయాన ఆకాశంలో దక్షిణ దిక్కుగా వచ్చి తమ సంతానాల గృహాలను చూస్తారట. వారికి దారి కనిపించడం కోసమే దివ్వెలు కొట్టే సాంప్రదాయం ఏర్పడింది. పెద్దవారు పిల్లలతో ఈ దివిటీని కొట్టిస్తారు. పొడుగాటి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :22 October 2022,7:00 am

Diwali : దీపావళి పండుగ అంటే మనలోని అజ్ఞానం పోయి జ్ఞాన జ్యోతిని వెలిగించడం. అదే దీపావళి పండుగ. నరక చతుర్దశి నాడు యమ ప్రీతికై పూజలు చేసి దీపాలను వెలిగించాలి. అలా చేస్తే పితృదేవతలు స్వర్గానికి చేరుతారు. దీపావళి రోజు పితృదేవతలు సంధ్య సమయాన ఆకాశంలో దక్షిణ దిక్కుగా వచ్చి తమ సంతానాల గృహాలను చూస్తారట. వారికి దారి కనిపించడం కోసమే దివ్వెలు కొట్టే సాంప్రదాయం ఏర్పడింది. పెద్దవారు పిల్లలతో ఈ దివిటీని కొట్టిస్తారు. పొడుగాటి గోంగూర కాడలకు నూనెతో తడిపిన బట్ట వత్తులు కట్టి వాటిని పిల్లల చేతులకిచ్చి వారిని వీరి గుమ్మం ముందు నిలబెట్టి దివిటీలను వెలిగించి ఆకాశంలో దక్షిణ వైపుకి చూపిస్తూ గుండ్రంగా మూడుసార్లు తిప్పుతారు.

దివిటీని నేలకు వేసి కొట్టిస్తూ దుబ్బు దుబ్బు దీపావళి మళ్లీ వచ్చే నాగులచవితి అని అనిపిస్తారు. ఆ తర్వాత ఆ కాడలను ఒక పక్కగా పడేస్తారు. పిల్లల కాళ్లు, చేతులు కడిగి కళ్ళు తడి చేతితో తూడిచి నోరు పుక్కిలించి శుభ్రం చేసుకోమని చెబుతారు. ఆ తర్వాత పిల్లలకు నోట్లో మిఠాయిలు పెట్టి తినిపిస్తారు. ఆ తర్వాత ఇంట్లోని అందరూ టపాకాయలు కాలుస్తారు. బాణాసంచా కాల్చటం లాంటి సంబరాలు పూర్తయ్యాక అర్ధరాత్రి దాటాక ఇల్లు వాకిళ్లను తుడుచుకోవాలి అని ధర్మ శాస్త్రం చెబుతోంది. పండుగ నాడు ఇంటి గుమ్మాలకు మావిడాకులు, తోరణాలు, బంతిపూల మాలలు కడతారు. పెద్ద పెద్ద ముగ్గులు వేసి మధ్యలో పసుపు కుంకుమలతో పూలతో అలంకరించి దీపాలు పెడతారు. దేవుని దగ్గర, తులసి కోట దగ్గర ఇంటి గుమ్మాలకి ఇరువైపులా దీపపు ప్రమిదలు పెడతారు.

Do you know why adults beat the divinity with children on Diwali

Do you know why adults beat the divinity with children on Diwali

మట్టి ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి వేసి ఒత్తులు వేసి వెలిగించిన తరువాత దీపాలను వరుసగా ఇంటి ముందర పిట్టగోడల మీద డాబాల మీద పెడతారు. కొన్ని ప్రాంతాలలో బాణాసంచా కాల్చి ఇంట్లోకి వచ్చాక ఆడవాళ్ళందరూ కలిసి చేటలు పళ్ళాలు వాయిస్తారు. అది దరిద్ర దేవత తరిమివేసినట్లు అవుతుంది. దీపావళి పండుగ ముందు అనేక రకాలైన మిఠాయిలు చేసుకొని దీపావళి నాడు ఇంట్లో వండిన పులిహోర, పరమాన్నం, గారెలు, బూరెలు లాంటివి ఇరుగుపొరుగు వారికి ఇచ్చి బంధువులతో కలిసి భోజనం చేస్తాం. దీపావళి పండుగకు రెండు రోజుల ముందు ధన త్రయోదశిని తర్వాత నరక చతుర్దశి అమావాస్య రోజు దీపావళి, ఆ తర్వాత రోజు బలిపాడ్యమి, ఆ మరుసటి రోజు భగిని హస్తభోజనం లేక యమ ద్వితీయ అని వరుసగా ఐదు రోజుల పండుగను చేసుకుంటాం.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది