Sharad Purnima : నేడు శరత్ పౌర్ణమి….ఈ వస్తువులు దానం చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sharad Purnima : నేడు శరత్ పౌర్ణమి….ఈ వస్తువులు దానం చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం…!

Sharad Purnima : హిందూమతంలో ప్రతి ఏడాది అక్టోబర్ 16వ తేదీన ఆశ్వీయుజ మాసం శుక్ల పక్ష పౌర్ణమిని శరత్ పూర్ణిమ పండును వైభవంగా జరుపుకుంటారు. అయితే రాధాకృష్ణులను మరియు శివపార్వతులతో పాటు చంద్రుడిని కూడా పూజిస్తారు. ఇక శరత్ కాలంలో చంద్రుడు 16 కళ్ళలో ప్రవేశిస్తారని చంద్రుడి కిరణాలలో అమృత ఉందని నమ్ముతారు. అయితే ఈరోజు చేసే పూజలో స్థానంలో, దానంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోజున దానధర్మాలు చేయడం ద్వారా లక్ష్మీదేవి యొక్క […]

 Authored By ramu | The Telugu News | Updated on :16 October 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Sharad Purnima : నేడు శరత్ పౌర్ణమి....ఈ వస్తువులు దానం చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం...!

Sharad Purnima : హిందూమతంలో ప్రతి ఏడాది అక్టోబర్ 16వ తేదీన ఆశ్వీయుజ మాసం శుక్ల పక్ష పౌర్ణమిని శరత్ పూర్ణిమ పండును వైభవంగా జరుపుకుంటారు. అయితే రాధాకృష్ణులను మరియు శివపార్వతులతో పాటు చంద్రుడిని కూడా పూజిస్తారు. ఇక శరత్ కాలంలో చంద్రుడు 16 కళ్ళలో ప్రవేశిస్తారని చంద్రుడి కిరణాలలో అమృత ఉందని నమ్ముతారు. అయితే ఈరోజు చేసే పూజలో స్థానంలో, దానంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోజున దానధర్మాలు చేయడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు.

పంచాంగం ప్రకారం చూసుకున్నట్లయితే అక్టోబర్ 16వ తేదీ బుధవారం 8:41 నిమిషాలకి ఆశ్వీయుజ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది. తిరిగి మరుసటి రోజు అక్టోబర్ 17వ తేదీ గురువారం సాయంత్రం 04:53 గంటలకు ముగుస్తుంది. కాబట్టి శరత్ పూర్ణిమ పండుగను అక్టోబర్ 16న మాత్రమే జరుపుకుంటారు. ఈ రోజు సాయంత్రం 05:04 నిమిషాలకి చంద్రోదయం ఏర్పడుతుంది. పూర్ణిమ రోజున అన్నదానం చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఇంట్లో సుఖసంతోషాలు లభిస్తాయి. అలాగే అన్నవితరన చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లో సంపద వర్షం కురిపిస్తుంది. అంతేకాకుండా జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి.

Sharad Purnima శరత్ పూర్ణిమ రోజున ఈ వస్తువులను దానం చేయడం శుభప్రదం.

బియ్యం : లక్ష్మీదేవికి బియ్యం ప్రీతికరంగా భావిస్తారు. కాబట్టి శరత్ పూర్ణిమ రోజున తెల్ల బియ్యాన్ని దానం చేయడం మంచిది దీనివల్ల సంపద చేకూరుతుంది.

పాలు : పాలు స్వచ్ఛతకు చిహ్నం. కనుక పాలన దానం చేయడం వలన పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

చందనం : హిందూ సాంప్రదాయాలలో గ్రంధాన్ని శుభప్రదంగా భావిస్తారు. గంధాన్ని దానం చేయడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు.

వస్త్రాలు : శరత్ పూర్ణ రోజున పేదలకు వస్త్రాలను దానం చేయడం పుణ్యంతో పాటు ధన లాభం కలుగుతుంది.

పండ్లు : దేవతలకు పండ్లు ఎంతో ప్రీతికరమైనది. పండ్లను దానంగా ఇవ్వడం వలన సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది.

బెల్లం : బెల్లం అనేది ప్రతి జీవితంలో శ్రేయస్సు మరియు ఆనందానికి చిహ్నం. కాబట్టి బెల్లాన్ని దానం చేయడం వలన ఇంట్లో సంపద పెరుగుతుంది మరియు పితృ దోషాలు తొలగిపోతాయి.

దానం చేసే సమయంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి.

– దానం చేసే సమయంలో మనసులో ఎలాంటి ద్వేషం కానీ దురాశగాని ఉండకూడదు.

– దానాన్ని అవసరం అయిన వారికి మాత్రమే చేయాలి.

Sharad Purnima నేడు శరత్ పౌర్ణమిఈ వస్తువులు దానం చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం

Sharad Purnima : నేడు శరత్ పౌర్ణమి….ఈ వస్తువులు దానం చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం…!

– దానం చేసేటప్పుడు మనసులో ఓం జపిస్తూ ఉండాలి.

-శరత్ పూర్ణిమ రోజు రాత్రి చంద్రకాంత్ లో పరమాన్నం వండి దానిని ప్రసాదంగా తీసుకోండి.

-లక్ష్మీదేవిని పూజించు దీపం వెలిగించండి.

శరత్ పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని పూజించి పరమాన్నాన్ని ప్రసాదంగా పెట్టండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవికి అనుగ్రహాన్ని పొందవచ్చు. దీంతో మీ ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు.

Sharad Purnima దాతృత్వం ప్రాముఖ్యత

హిందూ మతంలో దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. మనిషి మోక్షానికి దాతృతమే గొప్ప మార్గమని నమ్మకం. అయితే మనిషి కోరికలను నెరవేర్చడం కోసం పుణ్యప్రాప్తి కోసం మరియు భగవంతుని ఆశీర్వాదాలు పొందడం కోసం దానాలను చేస్తారు. దానం వలన జీవితంలో ప్రయోజకరంగా ఉండటమే కాకుండా మరణాంతరం కూడా గొప్ప ప్రయోజనం ఉంటుందని అంటారు

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది