God Rings : దేవుడి ప్రతిమ ఉన్న బంగారాన్ని ధరిస్తున్నారా… అయితే ఈ తప్పు అస్సలు చేయకండి…!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 16 November 2024, 5:58 am
  •  God Rings : దేవుడి ప్రతిమ ఉన్న బంగారాన్ని ధరిస్తున్నారా... అయితే ఈ తప్పు అస్సలు చేయకండి...!

God Rings : నేటి ఆధునిక కాలంలో చాలామంది మెడలో వేసుకునే హారాలకు చైన్స్ కి నెక్లెస్ లకి మరియు చేతికి పెట్టుకునే ఉంగరాల వరకు దేవుడి ప్రతిమలో ఉన్న వాటిని ధరిస్తున్నారు. అయితే ట్రెడిషనల్ గోల్డ్ ధరించడం మంచి విషయమే కానీ వీటిని ధరించేటప్పుడు కొన్ని పద్ధతులను పాటించాలి. వీటిని ధరించడం వలన లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి. మరి దేవుడు ప్రతిమ ఉన్న బంగారాన్ని ధరించినప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలి..? ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

God Rings : ఎలా ధరించాలి

చాలామంది దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలు ధరిస్తారు. కానీ వీటిని ఎలా ధరించాలో ఎవరికీ తెలియదు. ఇక దేవుడు ఉంగరాలు ధరించే ముందు పూజలు అభిషేకాలు చేసిన తర్వాత ధరించాలి. ఈ విధంగా ధరిస్తేనే వాటికి ఆ శక్తి వస్తుంది. అంతేకాదు ఈ ఉంగరాలను చేతికి ఎటువైపు ధరించాలి అనేది కూడా కొంతమందికి తెలియదు. అయితే ఉంగరానికి ఉన్న దేవుడి ప్రతిమ తల మన చేతి మణికట్టు వైపు ఉండేలా చూసుకోవాలి. ఇకపోతే చేతి పిడికిలిని బిగించినప్పుడు దేవుడు ప్రతిమ కాళ్లు కిందకి ఉండాలి. దేవుడి ప్రతిమను ఇలా ధరించడం వలన మంచి జరుగుతుంది.

God Rings : మాంసాహారం తినకూడదు.

దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించేవారు చాలామంది ఉంగరం పెట్టుకుని మాంసాహారాన్ని తింటారు. కానీ ఈ విధంగా అసలు చేయకూడదు. ఇంట్లో మాంసాహారం వండినప్పుడు దేవుడి గదికి ఎలా దూరంగా ఉంటారో అదేవిధంగా దేవుడు ప్రతిమ ఉన్న ఉంగరాలను కూడా అంతే దూరంగా ఉంచాలి. కాబట్టి మాంసాహార పదార్థాలు తినేటప్పుడు దేవుడు ఉంగరాలను తీసేయండి.

God Rings : దేవుడి ప్రతిమ ఉన్న బంగారాన్ని ధరిస్తున్నారా... అయితే ఈ తప్పు అస్సలు చేయకండి...!

God Rings : దేవుడి ప్రతిమ ఉన్న బంగారాన్ని ధరిస్తున్నారా… అయితే ఈ తప్పు అస్సలు చేయకండి…!

God Rings మద్యపానం – ధూమపానం..

చాలామంది దేవుడు ఉంగరాలను పెట్టుకుని ఎన్నో తప్పులను చేస్తారు. అందులో ఒకటి మద్యపానం ధూమపానం. ఈ అలవాట్లు ఉన్నవారు ధూమపానం మద్యపానం చేసేటప్పుడు తప్పనిసరిగా దేవుడి ఉంగరాన్ని తీసి జాగ్రత్త పడాలి. మన ఇంట్లో దేవుడు ఉన్నప్పుడు ఎలాంటి నియమాలను పాటిస్తామో అదేవిధంగా మన ఒంటిపై దేవుడి ప్రతిమలు సంబంధించిన వస్తువులు ఉన్నప్పుడు కూడా తప్పనిసరిగా జాగ్రత్తలను తీసుకోవాలి. దేవుడు ప్రతిమల ఉన్న ఉంగరాలను ధరించాలి అనుకునేవారు పూజ సమయంలో ధరించడం మంచిది. ఒకవేళ రోజువారీగా ధరించాలి అనుకుంటే అది మంచి కాదు.

Also read

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి