Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అయితే బృహస్పతి 12 నెలల పాటు ఒకే రాశులో సంచారం చేస్తూ ఉంటాడు. అలాగే బృహస్పతి కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను ఇస్తే మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. మరి బృహస్పతి కారణంగా ఇబ్బందులను ఎదుర్కొనే రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
బృహస్పతి 2025 సంవత్సరం మే 14 వ తేదీన మిధున రాశిలో సంచరించబోతున్నాడు. తిరిగి అక్టోబర్ 18 వ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. మళ్లీ నవంబర్ 11 వ తేదీన తిరోగమనం చెంది డిసెంబర్ 5 వ తేదీన మిధున రాశిలోకి చేరుకుంటాడు.
బృహస్పతి తన వేగాన్ని మూడు రెట్లు పెంచుకుంటాడు. అదేవిధంగా అతి తక్కువ సమయంలోనే రాశి చక్రాన్ని మారుస్తాడు. తిరిగి యదాస్థితిలో మిధున రాశిలోకి వస్తాడు. ఇక బృహస్పతి సంచారం కారణంగా ప్రతికూల శక్తులను పొందే రాశులు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
మిధున రాశి : బృహస్పతి సంచారం కారణంగా మిధున రాశి జాతకుల జీవితంలో అనేక ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయి. ఈ సమయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు మిధున రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. వివాదాలకు దూరంగా ఉండాలి.
ధనుస్సు రాశి : బృహస్పతి సంచారం కారణంగా ధనుస్సు రాశి జాతకులకు అనేక ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా వ్యక్తిగత మరియు వృత్తి జీవితాలలో అనేక అపార్ధాలు చోటు చేసుకుంటాయి. ఇక పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నష్టాలను చూస్తారు. ఈ సమయంలో అధిక ఖర్చులు ఉంటాయి. ముఖ్యంగా కుటుంబంలో విభేదాలు వస్తాయి.
మకర రాశి : మిధున రాశిలో బృహస్పతి సంచారం కారణంగా మకర రాశి జాతకులకు ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. అలాగే మకర రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో వీరికి సమాజంలో పరువు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇక వర్తక వ్యాపారుల విషయానికి వస్తే అధిక పెట్టుబడులను పెట్టకపోవడం మంచిది. ఉద్యోగులు కూడా ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి : 2025 వ సంవత్సరంలో బృహస్పతి సంచారం కారణంగా మీన రాశి జాతకులకు అనేక నష్టాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నూతన సంవత్సరంలో పని భారం అధికంగా ఉంటుంది. కాబట్టి మీన రాశి జాతకులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
Soybean : సోయాబీన్ లేదా సోయా బిన్ ( గ్లైసిన్ మాక్స్ ) Soybean అనేది తూర్పు ఆసియా కు…
Earthquake : ఇటీవల భూప్రకంపనలు ప్రజలకి వణుకు పుట్టిస్తున్నాయి. New Delhi ఢిల్లీ-ఎన్సీఆర్, bihar Earthquake సహా దేశంలోని పలు…
Railway Recruitment 2025 : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) వివిధ ట్రేడ్లలో అప్రెంటీస్ పోస్టుల కోసం 4,232 ఖాళీలను…
Budhaditya Rajyoga :గ్రహాలకు రాకుమారుడు అయిన బుధుడు, తెలివితేటలకు, తార్కానికి, పెట్టుబడి వ్యాపారులకు కారణంగా పరిగణించబడే బుధుడు యొక్క ప్రభావం…
Anasuya Bharadwaj : స్టార్ యాంకర్ అనసూయ Anchor Anasuya Bharadwaj ఏం చేసినా సరే దానికో స్పెషాలిటీ ఉంటుంది.…
Amala Paul : తమిళం, తెలుగు, మలయాళ చిత్రాల్లో కథానాయికగా నటించి పేరు తెచ్చుకున్న నటి అమలా పాల్ తల్లైన…
Daku Maharaaj : నందమూరి బాలకృష్ణ Balakrishna నటించిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఈ సినిమా…
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ సంక్రాంతికి గేమ్ ఛేంజర్ గా రాబోతున్నాడు. శంకర్ Shankar…
This website uses cookies.