Home » Devotional » Due To Shasha Rajayoga These Zodiac Signs Get Godness Lakshmi Blessing
Devotional

Shasha Rajayoga : శశరాజ యోగంతో ఈ రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం… కోట్ల సంపద వీరి సొంతం…!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: October 6, 2024, 10:00 am
Advertisement

Shasha Rajayoga : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి జీవితాలలో అనేక రకాల పరిణామాలు చోటు చేసుకుంటాయన్న సంగతి మన అందరికీికీ తెలిసిందే. అయితే గ్రహాలు అనేవి ఒక్కొక్క నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుండి మరొక రాశికి సంచరిస్తూ ఉంటాయి. అయితే అన్ని గ్రహాలలో శని గ్రహం అనేది చాలా నెమ్మదిగా ప్రయాణం చేసే గ్రహం. ఇక ఈ ఏడాది మొత్తం శనిగ్రహం కుంభరాశి లోనేే ఉంటాడు. శని ఏడాది పాటు కుంభరాశిలో ఉండటం వలన అరుదైన శశరాజ యోగం ఏర్పడింది. ఇక ఈ శశరాజ యోగం మార్చి 2025 వరకు కొనసాగుతుందని దీంతో కొన్ని రాశుల వారికి శని దేవుడి అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. దీంతో కొన్ని రాశుల వారికి అపారమైన సంపదలు కలుగుతాయి. పంచ మహాపురుష యోగాలలో ఒకటైన ఈ శశ రాజయోగం వలన కొన్ని రాశుల వారు విశేషమైన ఫలితాలను పొందుతారు. మరి ఆ రాశులు ఏంటి ఏ రాశి వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Advertisement

Shasha Rajayoga వృషభ రాశి

శని వృషభ రాశిలో సంచరించడం వలన ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. దీంతో వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. అపారమైన సంపదలు కలుగుతాయి. అలాగే నూతన గృహాలు వాహనాలు వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆదాయం దినాభివృద్ధి చెందుతుంది.

Shasha Rajayoga తులారాశి

తులారాశి 5వ ఇంట్లో శని సంచరించనున్నాడు. ఇక ఈ సమయంలో తులా రాశి జాతకులు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయపరంగా కూడా వీరికి శుభ సమయం. అలాగే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు విజయాలను సాధిస్తారు.

Advertisement

ధనుస్సు రాశి

ధనస్సు రాసి 3వ ఇంట్లో శని సంచారం చేయడం వలన వీరికి బాగా కలిసి వస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి ఉన్నత పదవులు వస్తాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఇక ఈ సమయంలో వీరు ఎక్కువగా కష్టపడకుండానే సంపాదిస్తారు. అలాగే కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.

Advertisement

Shasha Rajayoga : శశరాజ యోగంతో ఈ రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం… కోట్ల సంపద వీరి సొంతం…!

మకర రాశి

మకర రాశి రెండవ ఇంట్లో శనిసంచారం కారణంగా వీరికి మెరుగైన ఫలితాలుు లభిస్తాయి. ఇక ఈ సమయంలో ఈ రాశి జాతకులు ఆర్థికంగా బలపడతారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మకర రాశి జాతకులు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి