Home » Health » Nutmeg Powder Benefits Of Glowing Skin
Health

Nutmeg Powder : జాజికాయ పొడిలో ఉన్న లాభాలు తెలిస్తే… అస్సలు వదిలిపెట్టరు…!!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: October 6, 2024, 11:00 am
Advertisement

Nutmeg Powder : జాజికాయ అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది బిర్యాని. అయితే పులావ్ దినుసులలో ఉండే వాటిలలో ఇది కూడా ఒకటి. ఈ జాజికాయ గురించి అందరికీ తెలిసినదే. అలాగే దీనిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. అలాగే దీనిలో యాంటీబయోటిక్ మరియు యాంటీ ధర్మోబోటిక్, పొటాషియం, ఐరన్, జింక్, మెగ్నీషియం ,కాల్షియం, కాపర్ లాంటివి కూడా సమృద్ధిగా ఉంటాయి. ఈ పొడిని కొద్దిగా తీసుకున్న సరే ఇన్ని పోషకాలు అందుతాయి. అలాగే ఈ జాజికాయను ఆయుర్వేదంలో ఎన్నో రకాల వ్యాధులను నయం చేయటంలో కూడా ఉపయోగిస్తారు. ఈ తరుణంలోనే జాజికాయ పొడిని వాడడం వలన ఆరోగ్యపరంగా ఎన్నో రకాల అద్భుతాలు ఉన్నాయి. అలాగే చర్మం మరియు జుట్టు సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. అయితే ఈ జాజికాయలో ఉండే లాభాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Advertisement

నిద్రలేమి : నిద్రలేమి సమస్యతో బాధపడేవారు జాజికాయ పొడిని తీసుకోవటం వలన ఈ సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు. ప్రస్తుత కాలంలో మనం ఉన్న బిజీ లైఫ్ కారణం చేత ఒత్తిడి మరియు ఆందోళన అనేది ఎక్కువై నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నాము. అయితే నిద్రలేమి కారణం చేత ఇన్సోమియ లాంటి వ్యాధులు వచ్చి పడతాయి. అయితే మీరు రాత్రి పడుకునే ముందు పాలలో చిటికెడు జాజికాయ పొడిని వేసుకొని తాగితే ఈ సమస్య నుండి మీరు తొందరగా బయటపడతారు…

పంటి నొప్పి : పంటి నొప్పి సమస్యతో బాధపడే వారికి కూడా ఈ జాజికాయ పొడి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఈ జాజికాయ పొడి తో నోటి దుర్వాసన అనేది దూరమై ఆరోగ్యం అనేది పెరుగుతుంది. అయితే దీనిలో భయటో యాక్టివ్ యుగనైట్ ఉండడం వలన పంటి ఆరోగ్యం మరియు నోటికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి…

Advertisement

స్కిన్ కేర్ : చర్మ సమస్యలతో బాధపడే వారికి కూడా జాజికాయ మంచి హోమ్ రెమిడి అని చెప్పొచ్చు. దీనిలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ మరియు యాంటీ మైక్రో బ్యాక్టీరియల్ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. అలాగే స్కిన్ పై వచ్చే దురద మరియు మంటను కూడా తగ్గిస్తాయి. అలాగే ఈ జాజికాయ పొడి యక్నె ని తగ్గించటంలో కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. అంతేకాక మచ్చలు మరియు గీతాలు కూడా తగ్గుతాయి.

Nutmeg Powder : జాజికాయ పొడిలో ఉన్న లాభాలు తెలిస్తే… అస్సలు వదిలిపెట్టరు…!!

Advertisement

గుండె ఆరోగ్యం : ఈ జాజికాయలో పొటాషియం మరియు కాల్షియం, మెగ్నీషియం కూడా ఉన్నాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కావున గుండె సమస్యలతో బాధపడే వారు కూడా ఈ జాజికాయ పొడిని తీసుకోవచ్చు.

డిప్రెషన్ : ఒత్తిడి మరియు ఆందోళన, డిప్రెషన్ తో ఇబ్బంది పడే వారు కూడా ఈ జాజికాయ పొడిని తీసుకోవటం వలన మంచి ఫలితం ఉంటుంది. అలాగే డిప్రెషన్ ఉన్న టైంలో మీరు కోరి వెచ్చని నీటిలో ఈ పొడిని కలుపుకొని తాగితే ఈ సమస్య నుండి ఈజీగా బయటపడొచ్చు…

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి